అనువాద నవల

రాజ్ఞి – ఏడవ భాగం [She - By Sir H.Rider Haggard]

రాజ్ఞి – ఏడవ భాగం [She - By Sir H.Rider Haggard]

[అక్టోబర్ నెల సంచిక తరువాయి]

మేమిక బయల్దేరాలని నిర్ణయించుకున్న గంట లోపలే అయిదు డోలీ లు సిద్ధమయాయి. వాటిని మోసుకుపోయేందుకు పదిమంది మనుషులు, కాసేపు బుజాలు మార్చుకుందుకు ఇంకొందరు. మా సామాను మోసేందుకూ కాపలా కాసేందుకూ యాభై మంది అమహగ్గర్ మనుషులు. మాతోబాటు బిలాలీ కూడా ఒక డోలీ లో వస్తాడని తెలిసి నాకు ధైర్యంగా అనిపించింది. మిగిలిన అయిదో డోలీ లో ఎక్కేదెవరు ? ఉస్తేన్ ?? అదే అడిగాను
బిలాలీ ని.

” ఆమెకి ఇష్టమైతే వస్తుంది బిడ్డా. మా భూమి లో స్త్రీ తానేది కోరుకుంటే అది చేయవచ్చు. ఆమెను పూజిస్తాము మేము – ఆమే లేకపోతే సృష్టి…
పూర్తిగా »

రాజ్ఞి – ఆరవభాగం [SHE BY Sir H.Rider Haggard]

అక్టోబర్ 2015


రాజ్ఞి – ఆరవభాగం [SHE BY Sir H.Rider Haggard]

ఉస్తేన్ ఆ విచిత్రనృత్యం చేయటాన్ని తిలకించినవారెవరైనా విస్మరించటం అసాధ్యం. ఆమె మాటల్లో రాగల దాని నీడలేవో వినిపించించి అదొకలాంటి భీతితో ఒళ్ళు గరిపొడిచింది మాకందరికీ. ఆ మర్నాడు మా గౌరవార్థం విందు ఏర్పాటైందని తెలిసింది. మేము సాదా సీదాగా బతికేవాళ్ళమనీ అటువంటి హడావిడులేమీ వద్దనీ చెప్పి చూశాను- వాళ్ళ మొహాల్లో ప్రసన్నత మాయమైంది ..నోరు మూసుకున్నాను.
పూర్తిగా »

రాజ్ఞి – అయిదవ భాగం [‘SHE‘ by Sir H.Rider Haggard]

సెప్టెంబర్ 2015


రాజ్ఞి  – అయిదవ భాగం [‘SHE‘ by Sir H.Rider Haggard]

చాలా విశాలమైన సావడి అది, నూరడుగుల పొడవూ యాభై అడుగుల వెడల్పు. ప్రకృతి సిద్ధంగా కాక మానవనిర్మితం లాగే ఉంది. దాని చివరన సన్నటి నడవా ఉంది , బహుశా అవతల ఇంకొన్ని చిన్న గదులు ఉండిఉంటాయి. సావడి మధ్యకి వచ్చేసరికి వెలుగు తగ్గిపోయింది. అక్కడొక పెద్ద నెగడు వంటిది మండుతోంది. చుట్టూ గోడల చీకటి మీద దాని నీడలు పొడుగ్గా పడుతున్నాయి. మమ్మల్ని అక్కడ కూర్చోమనీ భోజనం తెస్తారనీ బిలాలీ చెప్పాడు. నేల మీదే, ఒత్తుగా పరిచి ఉన్న జంతుచర్మాల మీద కూలబడ్డాము. త్వరలోనే ఆహారం వచ్చింది. ఉడకబెట్టిన మేకమాంసం, మొక్కజొన్న గింజలు , తాజా గా పితికిన పాలు,. ఆత్రంగా లాగించేశాము- నా…
పూర్తిగా »

రాజ్ఞి – నాలుగవ భాగం [ ‘She‘ by Sir H.Rider Haggard ]

రాజ్ఞి – నాలుగవ భాగం  [ ‘She‘ by Sir H.Rider Haggard ]

సూర్యుడి ఆగమనాన్ని ప్రకటించి కీర్తించిన దూతలూ వైతాళికులూ చీకట్ల నీడలని  వెతికి తరిమికొట్టారు. అప్పుడిక దినరాజు తన సముద్రశయ్యమీంచి లేచి వచ్చాడు , భూమిని తన వైభవోపేతమైన వెచ్చదనం తో వెలిగించాడు. అలల మీద ఊగుతున్న పడవ లో కూర్చున్న నేను నీటి సవ్వడిని వింటూ  మేము చేరవస్తూన్న  కొండ  కొమ్ము ని తిలకించాను. వెనకనుంచి భగ్గుమంటున్న వెలుతురు లో దాని ఆకారం స్పష్టంగా తెలిసింది. ఇంచుమించు నూట యాభై అడుగుల చుట్టుకొలత తో, ఎనభై అడుగుల ఎత్తున ఉంది. ఆఫ్రికన్ జాతి మనిషి ముఖం లాగా ఉన్నమాట నిజమే -  ఆ కవళిక లో భావం క్రూరంగా , ఒళ్ళు జలదరించేలాగా అనిపించింది.…
పూర్తిగా »

రాజ్ఞి – మూడవ భాగం (‘She‘ by Sir H.Rider Haggard)

రాజ్ఞి – మూడవ భాగం (‘She‘ by Sir H.Rider Haggard)

లియో ఇరవై అయిదో జన్మదినానికి ముందురోజున ఇద్దరమూ బయలుదేరి లండన్ వెళ్ళి , ఇరవై ఏళ్ళ కిందట బాంక్ లో దాచి పెట్టిన ఇనప పెట్టె ని బయటికి తీయించాం. అప్పటి గుమాస్తాయే, అదృష్టవశాత్తూ ఇప్పుడూ ఉన్నాడు – లేదంటే ఆ సాలెగూళ్ళ కింద నుంచి దాన్ని తీయటం కష్టమయేదట. సాయంకాలానికి కేంబ్రిడ్జ్ కి వచ్చేశాం, రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టనేలేదు. తెల్లారుతూనే లియో డ్రెస్సింగ్ గౌన్ లోనే వచ్చాడు , వెంటనే పని మొదలెడదామని. అంత కుతూహలం అక్కర్లేదనీ, ఇరవై ఏళ్ళు ఆగినవాళ్ళం బ్రేక్ ఫాస్ట్ అయేదాకా ఆగితే తప్పు లేదనీ నేను అన్నాను. సరే, తొమ్మిది కొట్టగానే బ్రేక్ ఫాస్ట్ కి…
పూర్తిగా »

రాజ్ఞి – రెండవ భాగం (‘SHE‘ by Sir H.Rider Haggard)

రాజ్ఞి – రెండవ భాగం (‘SHE‘ by Sir H.Rider Haggard)

విన్సే అలా ఉన్నట్లుండి చనిపోవటం కళాశాలలో కలకలం రేపింది. అయితే, ఎప్పటినుంచో జబ్బుగా ఉన్నాడని అందరికీ తెలిసిందే, వైద్యుడి ధృవ పత్రమూ దాన్ని బలపరుస్తూనే ఉంది. అందువల్ల శవపంచాయితీ ఏర్పాటు చేయలేదు. నిజానికి ఆ రోజుల్లో అటువంటి పంచాయితీలు కాస్త తక్కువగానే జరిగేవి
పూర్తిగా »

రాజ్ఞి – మొదటి భాగం

రాజ్ఞి – మొదటి భాగం

Henry Rider Haggard [1856-1925] కాల్పనిక గాథలకు, సాహస గాథలకు ప్రసిద్ధి. ఇవాళ్టికీ అతి విస్తృతంగా చదవబడే విక్టోరియన్ రచయితలలో ఆయన ఒకరు. పాఠకులను సమ్మోహితులను చేసి దీర్ఘకాలపు ప్రభావాన్ని కలిగించగల ప్రతిభ ఆయనది [ Graham Greene ] . తన కాలానికి ఆయన నవలలు బెస్ట్ సెల్లర్స్ గా ఉండేవని , ఉత్కంఠతో వాటికోసం ఎదురు చూసేవారమనీ P.G.Wodehouse చెబుతారు. ఇప్పుడు అవి క్లాసిక్స్ గా నిలిచి ఉన్నాయి. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ బావుంటాయి కనుక Classic starts, Puffin classics వంటి పిల్లల సీరీస్ ల లోనూ అవి ప్రముఖంగా ఉంటుంటాయి, ముఖ్యం గా King Solomon’s Mines.

‘…
పూర్తిగా »