కవిత్వం

అడుగుల ముగ్గు

మార్చి 2016

వాకిట్లో తప్పటడుగుల
ముగ్గేసే
లేత పాదాల పాప

భూమినంతా
చిక్కుడుబిచ్చను చేసి
విసురుతుంది

వింతేం లేదు కాని
మేఘాలెందుకో
ఆగాగి కదుల్తాయ్

ఇంటిముందు చెట్టుమీది
గూడులో
పిచ్చుకల అరుపులు

నేలంతా ఇప్పుడు
జుట్టు చెదిరిన
ఆడపిల్ల

పాప
అలిసిపొయిన తల్లి

వానెందుకో
వచ్చి
ముగ్గులో చుక్కలు పెడుతుంది

*