చిన్న కలవరం
మనసుని విఛ్చిన్నం చేస్తుంది…
*
రోజంతా
ఒక నిద్రను కలగంటున్నా,
రాత్రి చీకట్లో
వెలుతురు పురుగై
నిద్ర
నా కళ్లను పొడుస్తుంది,
నిద్ర పట్టదు…
కొన్ని యుగాల నిద్రను
రోజంతా కలగంటాను..
*
సమయం నాతో
చదరంగం ఆడుతుంది,
సహనం నాలో
అలసట నింపుతుంది…
ఐనా….!?
నిద్ర నా చివరి కోరికై
నన్ను వెక్కిరిస్తూ
నా పక్కనే
కరున లేని మనిషల్లే…
*
మనసు విఛ్చిన్నం అవుతూ
నేను కలవరపడుతూ
గాఢ నిద్రను
కలగంటూ….
చదరంగం అడే అలసట నింపే కాలంతో యుద్ధం కల గనకుండా, నిద్ర కలగనడం ఒకింత ఆశ్చర్యమే, అయినా కె. శివారెడ్డి గారు ” నిదురపోతున్న ఆమెని కదపొద్దు, మనసులో నన్నా పిలవొద్దు “అన్నారు, నిద్ర,విశ్రాంతి రేపటి పోరాట పద్యాన్ని మననం చేస్తున్నట్టే. విజయకుమార్ ఎస్వీ గారికి శుభాభినందనలు.
థాక్యూ dasaraju ramarao gaaru… నా కవిత మీకు శివారెడ్డి గారిని గుర్తుచేసిందుకు ధన్యున్ని…