ఓ నాలుగు చువ్వల్తో చిత్రం ఒకటి
గది గోడకు వేలాడుతుంది
ఇద్దరు మనుషులు సగం గ్లాసుల్తో నిలబడీ
పొగ నవ్వుల్ని తెరలుగా పంచుకుంటున్న దృశ్యం,
స్నేహం ఇద్దరికీ సంబంధంలేని
టీ కొట్టువానిక్కూడా మేలు చేస్తుంది
పొగదుమ్ము కక్కుతూ వొస్తున్న కారు చూసీ
చీరచెంగుతో కొడుకు ముఖం కప్పేసిందో అమ్మ,
బడిలో సూత్రాలేవీ బయటలోకానికి పట్టవని
వాడికింకా తెలీదులా వుంది
నోరు పెద్దగా తెరిచీ సౌండ్ మ్యూట్ లో
సీతాఫలాల బండివాడు అరుస్తున్నాడు,
కావాలనిపించే ఆశ కలిగిస్తే తప్ప
ఎంత తీయనిదైనా ఎవరూ రుచిచూడాలనుకోరని
ఆతనికి బాగా తెల్సులా వుంది
ఈ టైంలో కిటికీ తీస్తే ఎలారా…?
దాగున్న రెండు రెక్కలూ దగ్గరికి లాగి
చిలక వేసేసాడు మావాడు
ఇప్పుడు లోపల గదంతా
గాలాడని ఆలోచనల ఉక్కపోత.
Woww Mahee..very natural scenario..nee kavitalo alaa kanulaku kattindi. Keep it up..:) (y)
ఒకానొక సజీవ జీవన చిత్రం. జీవితంతో మన ఆలోచనల అనుసంధానాన్ని విరమిస్తే మిగిలేది ఆలోచనల ఉక్కపోతే కదా. చాలా చాలా బాగుంది మహీ.
అన్నయ్యా థాంక్యూ వెరీ మచ్…
థాంక్యూ వెరీ మచ్ మా…
కిటికీని, కాన్వాస్ ని చేసేసి, ఒక సజీవ చిత్రాన్ని ఇలా అక్షరాలతో చిత్రీకరించి చూపారు. చాలా బావుంది!
థాంక్యూ సో మచ్ …
చక్కగా రాశావు మహీ! కంగ్రాట్స్
థాంక్యూ సో మచ్ సోదరా…
superb Mahi
థాంక్యూ సో మచ్ మా…
Bagundi mahi
థాంక్యూ వెరీ మచ్ సర్…
Chakkani drusyam aavishkarincharu. Mahi
థాంక్యూ మా…
చాలా, చాలా బాగుంది రా ..
బడి సూత్రాలేవీ బయటి లోకానికి పట్టవని…
ఇప్పుడు గదంతా… గాలాడని ఆలోచనల ఉక్కపోత…
సూపర్బ్ మహీ. శుభాకాంక్షలు!
థాంక్యూ వెరీ మచ్ అక్కా..
కిటికీ లోంచి అత్యంత సహజంగా మా కనులముందు చూస్తున్నామనిపించేంత బాగా కవితాదృశ్యాన్ని మా కనుల ముందుంచారు…పేయింటింగ్ లా..కొత్త ప్రయత్నం..అభినందనలు..మహీ గారు
అమ్మా…
బాగా చెప్పారు మహి
థాంక్యూ సోదరా
ఇదీ పదచిత్రాలున్న కవితే. స్టాంజాల రూపంలో కవిత రాస్తే, ఆ చిత్రాలు మరింత బలంగా పాఠకుడి మనసుకెక్కుతాయి.
కవిత శిఖరానికి చేరేసరికి అంతకుముందున్న చిత్రాలన్నీ, తుది భావచిత్రాన్ని ఆవిష్కరించడానికి సన్నాహమయి, సహకరిస్తాయి.
ఉక్కపోత గదిలో వాళ్లకీ, ఉక్కిరిబిక్కిరి చేసే ఊపిరాడనితనం కవితని అనుసరించినవారికీ.
సుపర్ణ మహి గారూ, మీ ఏ మెయిల్ ఐడి నాతో పంచుకోగలరా? మీ కవితకి నేను గీసిన బొమ్మ మీతో పంచుకోవడానికి.
టి. చంద్రశేఖర రెడ్డి
tcsreddy612@జిమెయిల్.కామ్.
చాలా చాలా ధన్యవాదాలు సర్…mahesh369@ఔట్లుక్.కం