నీ చూపుల చెలమల్లో
నేను దాహం తీరడం లేదు
నా కళ్ల నదుల్లో
నువ్వు స్నానం చెయ్యడం లేదు
ఉదయాస్తమయాల్లో మనిద్దరి మధ్యా
వెలుతురు పెదాలు విచ్చుకోవడం లేదు
విధుల ముళ్లు విదిలించుకుని
ఇంట్లో అడుగు పెట్టాక కూడా
గాయాల బాధ మాయం కావడం లేదు
అడపాదడపా వంటగదిలో విడుదలయ్యే నవ్వులు
ప్రెషర్ కుక్కర్ మూతదాటి బయటికి రావడం లేదు
భోజనాల వేళ మాటలమెతుకుల మధ్య
మునుపటి విశేషాలముద్దలు గొంతు దిగడం లేదు
దైనందిన దైవాలుగా
అనివార్య ఆయుధాలుగా
మన మీదికి డిజిటల్ శక్తుల మూకుమ్మడి దాడి
కనిపించే వస్తువులు కనిపించని కత్తులు దూస్తూ-
రెండు ప్రపంచాలు ఎప్పటికీ ఏకం కాకుండా
నిరంతర మత్తుకాంక్షను ఎగదోస్తూ-
జీవన సతత హరితారణ్యంలో
ఊళలు పెడుతున్న జిత్తులమారి అప్రాణుల్ని
వేటాడ్డం నేర్చుకుందాం
జతగా వస్తావా నేస్తం!
వెరీ నైస్ పోయెమ్
ధన్యవాదాలు శ్రీనివాసరావు గారూ.
ఎక్స్ల్లెంట్ పోయెమ్ సర్
——
ధన్యవాదాలు బుచ్చిరెడ్డి గారూ.
రామి రెడ్డి గా గారు,
ఈ రోజు కార్పొరేట్ ఉద్యోగి ఎలా జీవిస్తున్నాడనేది చాల చక్కగా వర్ణించారు.
శుభాభినందనలు సర్
ధన్యవాదాలు నరేంద్ర గారూ
చాలా బాగుంది మాస్టారు!!
Manaku teliyakunda manam technology ki addict aypotunnam. manishi ki manishi ki Madhya duranni taginchalsina technology durannai inka inka penchutundi.
తప్పకుండా మీతో వస్తాం . చాలా చాలా బాగుంది. అందరూ చదవాలి.
Very nice sir
It’s very nice poem Rami Reddy గారు
Excellent poem sir