మేఘం కన్నీరు
ఎప్పుడు కార్చిందో కాని
పాదాలకు తడి తగిలింది.
మనసు ఎప్పుడు
గాయపడిందో కానీ
పుటలు తిప్పిన
వేళ్లకు నెత్తుటి తడి తగిలింది.
ఆ పలకరింపు ఎప్పటిదో తెలీదు
ఎండుటాకుల ధ్వని వింటే కాని
నీ జ్ఞాపకం గుండెను పిండేయలేదు
రహదారిపై నలిగిన పూలు
రోడ్డు వికసించలేదు కానీ
శవం వెళ్లిన జాడను తెలిపాయి
నిశ్శబ్దం మంచిదే
తెరిచిన కనురెప్పల్లో
వెలుగు ఆరనంతవరకూ..
ఏసంగీతమూ
ఆహ్లాదం కాదు
నిశ్చేష్టమైన జీవితంలో..
అశ్రువులు అక్షరాలై
కాగితాన్ని తడిపేవరకూ
కవిత్వం రక్తసిక్తమవుతుందని
అర్థం కాలేదు..
So good!!
చాలా బావు౦ది భావుకత.
‘మేఘం కన్నీరు
ఎప్పుడు కార్చిందో కాని
పాదాలకు తడి తగిలింది’……………ఎక్స్ లె౦ట్ పోయిమ్!
అశ్రువులు అక్షరాలై
కాగితాన్ని తడిపేవరకూ
కవిత్వం రక్తసిక్తమవుతుందని
అర్థం కాలేదు………………..వావ్! beautiful expression good lines..
మేఘం కన్నీరు
ఎప్పుడు కార్చిందో కాని
పాదాలకు తడి తగిలింది…మంచి భావుకత .
“ఏసంగీతమూ
ఆహ్లాదం కాదు
నిశ్చేష్టమైన జీవితంలో..”….true!
చాలా బావుంది,.కానీ కన్నీరు కవిత్వమై,.రక్తసిక్తం అవడం అర్థం కాలేదు,..