‘ కృష్ణుడు ’ రచనలు

మనుషుల కంటే అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు

ఏప్రిల్ 2013


మనుషుల కంటే  అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు

ఒక కృష్ణుడు పొద్దున్నే లేచి రాత్రి దాకా వార్తల వేటలో రాజధానిని గాలిస్తూ వుంటాడు. ఇంకో కృష్ణుడు ఆ వార్తల కింద నలిగిపోతున్న పీడితుల గుండె చప్పుళ్లని అక్షరాల్లోకి తర్జుమా చేసి తన గుండె తడిని వాటికి అద్దుతూ వుంటాడు. ఆ మొదటి కృష్ణుడూ ఈ రెండో కృష్ణుడూ ఇద్దరూ ఇద్దరే! రెండు భిన్నమయిన రంగస్థలాల్లో నిలబడి రెండు చేతులా లోకాన్ని ఆవాహన చేసుకొని, నిండు గుండెలు పట్టేటంతగా ఆ లోకాన్ని ప్రేమిస్తూ, అప్పుడప్పుడూ కాస్త కోప్పడ్తూ…! కొప్పడేటప్పుడు ఎంత ప్రేమించామో చెబ్తూ, ప్రేమించేటప్పుడు ఎంత కోప్పడ్డామో చెప్తూ…ఈ లోకం లయ తప్పకూడదని తపన పడుతూ…! కృష్ణుడు కవిత్వంలాగా కబుర్లు చెప్తాడు, కబుర్లలాగా కవిత్వం చెప్తాడు.…
పూర్తిగా »

అర్థం కాలేదు..

29-మార్చి-2013


మేఘం కన్నీరు
ఎప్పుడు కార్చిందో కాని
పాదాలకు తడి తగిలింది.

మనసు ఎప్పుడు
గాయపడిందో కానీ
పుటలు తిప్పిన
వేళ్లకు నెత్తుటి తడి తగిలింది.

ఆ పలకరింపు ఎప్పటిదో తెలీదు
ఎండుటాకుల ధ్వని వింటే కాని
నీ జ్ఞాపకం గుండెను పిండేయలేదు

రహదారిపై నలిగిన పూలు
రోడ్డు వికసించలేదు కానీ
శవం వెళ్లిన జాడను తెలిపాయి

నిశ్శబ్దం మంచిదే
తెరిచిన కనురెప్పల్లో
వెలుగు ఆరనంతవరకూ..

ఏసంగీతమూ
ఆహ్లాదం కాదు
నిశ్చేష్టమైన జీవితంలో..

అశ్రువులు అక్షరాలై
కాగితాన్ని తడిపేవరకూ
కవిత్వం రక్తసిక్తమవుతుందని
అర్థం కాలేదు..


పూర్తిగా »

ప్రశాంతం

జనవరి 2013


పావురాలు
కిటికీ వద్ద చప్పుడు చేయడం లేదు
చీకట్లన్నీ దుఃఖించాయేమో
అద్దాలపై కన్నీళ్లు
కారుతున్నాయి
రోడ్డు మీద
వాహనాల రొదకేమైందో తెలియదు
జ్వరం వచ్చి పడుకున్నారేమో
పిల్లల అల్లరీ
వినపడడం లేదు
వంటింట్లో పొయ్యిపై
ఏదీ ఉడుకుతున్నట్లు లేదు

అంతా శ్మశానానికెళ్లారేమో
ఊరు ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నది
నేల నేలంతా
నెత్తురు తుడిచి
అలికి ముగ్గేసినట్లుంది

కదం తొక్కే బూట్లు
మౌనంగా శవాలకు
కాపలా కాస్తున్నాయి
అలిసిపోయిన తుపాకులను
నెత్తుటి బొట్లు
పరామర్శిస్తున్నాయి

విరిగిపోయిన పెన్నుల మధ్యపూర్తిగా »