సూర్యుడా,
విశ్వరహస్యపు ఉత్తరాలు
వెలుగు ఉండలుగా చుట్టి
విసిరివేస్తున్నావు
ఫోటాను పొట్లాలు
విడదీసే వివరాలు
మాకింకా తెలిసిరాలేదు
నీవు మాటల్లోనూ చెప్పేవుంటావు
ఉరుము మెరుపుల జన్మ
ఒక్కసారే అయినా
మెరుపులు వెలిసి పోయాకెపుడో
ఉరుమొచ్చినట్లు-
వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వున్నాము
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని దూరలేని
శూన్యపు గోడలు .
సృష్టి రహస్యం తెలిసిపోకుండా
ఊహలకు కొలతలు వేసేలోపే
ఊపిరిపోతుంటే
లక్షల కాంతి సంవత్సరాల దూరాలు
లక్ష్యాలవుతుంటే
స్తలకాలాల మధ్య సమన్యయం కుదరక
శాస్త్రకారులంతా చేసేదేమీ లేక
భుజాలు మార్చుకొంటున్నారు
పోయున వాళ్ళూ పుడుతున్న వాళ్ళూ
లయబద్ద అలలుగా సాగుతూ
విశ్వరహస్య పరిశోధనల వైపు
పరమ సత్యాల జాడలవైపు
వెళ్తూనే వున్నారు
శ్రీనివాసరావుగారూ,
“సృష్టి రహస్యం తెలిసిపోకుండా” … బహుశా ఇక్కడ “సృష్టిరహస్యం తెలుసుకునేలోపే” అని ఉండాలేమో.
మీరు సూర్యుడిగురించి చెపుతూ ధ్వని ప్రస్తావన తీసుకురాగానే, నాకు Heleiseismology గుర్తొచ్చింది. ఈ క్రింది లింకులో సూర్యుడుచేసే శబ్దాలగురించి కొంత సమాచారం ఉంది.
http://image.gsfc.nasa.gov/poetry/ask/a10411.html
కొత్త కవితావస్తువు. అభినందనలు
ns murty gariki namastea
“సృష్టి రహస్యం తెలిసిపోకుండా”్…..ఈవాక్యం పై స్టాంజా తో కలిపి చదవాలి ..ఎడిటింగ్ పొరపాటు మూలంగా ..కిందికి వచ్చి కాస్త అసౌకర్యమని పించి వుంటుంది …మన్నించగలరు …మంచి లింక్ ఇచ్చారు ధన్యవాదాలు
బాగుంది.బాగుంది.
దన్యవాదాలు రమాసుందరి గారు
srusti rahashyanni shodinche kramama sagutune undantu suryuni pi ke ninda stutini prayoginchatam nutana pokada—-kavita vasthulalo vilakshanata bagundi
రమన గారికి ధన్యవాదాలు
వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వున్నాము
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని దూరలేని
శూన్యపు గోడలు … nice
mehdi ali గారికి ధన్యవాదాలు
సైన్స్ ని కవిత్వంలో చొప్పించిన విధానం బావుంది,.ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బావుండేదనిపించింది,..ఉదాహరణకు సూర్యుడా తో మొదలు పెట్టడంతో,.పరిధి తగ్గినట్లనిపించింది,.నెబ్యులాలనో,గెలాక్సీలనో,బ్లాక్ హొల్స్ తోనో మొదలుపెట్టి, విస్తరించివుంటే, .విశ్వరహస్యాలకు మరింత దగ్గరగా వుండేది, మంచి ప్రయత్నం, అభినందనలు,..
Thanq. The tree Garu . Misuchana chala samanjasamayunadi , nenu alane anukoni Nxatra mandala laku antuleadani. Swayam prakashaka mayuna unit ga bhavinchi modaletta . Marosari dhanyavadalato.
chala different vastuvu,simple but elegant poem
థాంక్యు ఆకెళ్ళ రవి ప్రకాష్ గారు