కవిత్వం

అతీతం

జనవరి 2013

నులివెచ్చని ఊపిరి
 అణువణువూ మెలివేస్తుంటే
ఎక్కడో పొంగుతున్న శబ్ధం
మరెక్కడో తొలుస్తున్న నిశ్శబ్ధం
ఆర్తిగా పరుగెట్టే శక్తి
సంతోషం లో
తియ్యని దుఖాన్ని కలిపి
సన్నని మకార శబ్ధాన్ని
మార్చి మార్చి వినిపిస్తుంటే

చూపుల శంఖారావాలతో
మొదలయ్యు
మరణాలులేని
ఓటములులేని
మహాయుద్దం జరుగుతోంది

యుద్దం ముగిసిన ఎప్పటికో
చావులు లేకున్నా
ఏడుపులు వినిపిస్తాయి
వెనువెంటనే నవ్వులూ వికసిస్తాయి

శృష్టి నిండా మిణుగురుపూల వాన
తడవకా తప్పదు
ప్రేమ ద్వారాల గుండా నడవకా తప్పదు