కవిత్వం

ఇంతే!

24-మే-2013

ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు
కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా?
నిప్పులో మండని పదార్థాలుండొచ్చు
నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా?

మేఘాల స్పర్శను పొందుతున్నా
వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి
మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!