సమీక్ష

నీలాగే ఒకడుండేవోడని…

నవంబర్ 2013

ఎవరైనా ఏదన్నా రాద్దారని మొదలెట్నపుడు, ఏం రాయాలా అని ఆలోసిత్తారు కదా! మర్నేనూ అంతే కదా! అంటే కాదు కదా…

నెట్టొక్క కటుంటే సాల్దనీ నెట్టుకొచ్చే తెలివుండాలని ఆడి స్టైల్లో ఆడు రాసినపుడు , సదివి మరిసో,సద్విమర్శో నా శైల్లో నేనూ రాయాలి కదండీ రాసిందే తిరగరాయించే కాలానికి వొందనం సేత్సున్నోడి గురించి రాసిన లైనే మళ్ళీ రాత్తే తప్పేంటంట? అప్పుడుకప్పుడు బుద్దిపుట్టి అనుకోకుండా రాస్తే అది మీరంతా సదువుతారా అనుకునే మొదలెట్టాను గానీ, కొంతైనా సదుంతారు అనే దీమా ఒగిటి నన్ను రాయించేసింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే “నీలాగే ఒకడుండేవోడని” ఒక కొత్త పుత్తక మొచ్చిందండోయ్ అదీ ఒక ఆధునిక కవిది.

అంటే నంద కిషోర్ ది. ఆధునిక కవీ అని ఎందుకన్నానంటే , వాడు పుట్టిందే లేటు గనక, ఇప్పుడే ఏసిన సంపుటి గనక , ఇంకోటి! ఆధునిక కవంటే ఇంగిలీసు పదాలు, కొటేసన్ల గందరగోళాలు, అరదం కాని పరమ వ్యెవహారిక పదాలూ, కాతోకూతో సెక్సూ, బోల్డన్ని పుట్నోట్సు ఉంటాయనుకుంటే కవిత్వం లో కాలేసినట్టే !

ఆటన్నింటికీ దూరంగా , అందంగా మనస్తత్వాన్ని తత్వంలాగ భలే రాసాడు. ఎక్కడా ఏ బావమూ మిసైపోయినట్టు అనిపించదు, సరింగా పరిసీలిత్తె మనిసికి దేముడికి మద్య తెర కామం, అని ఎక్కడో కామా పెట్టి సేప్పేసి వొలపుకీ, పేమకీ
మధ్య తేడా బలేగా సెప్తాడు.

ఒక్కొకరికీ ఒకో ముద్ర ఉంటాది. పూర్తిగా సదివాను గనక నాకు ఇక్కడున్న ప్రత్తేకమేంటో కాస్తో , కూస్తో తెలుస్తాది కదా! నాయని వొత్సల, నండూరి ఎంకీ, శెంకరశాస్త్రి పరమేశ్వరీ అబ్బూరి అప్రాప్తీ లాగ సౌందర్య దాహాన్ని తీర్చిన ఊహా సుందరీమనుల్లాగా ఈ కవిత్వం లో ఒక “దేవీ” ఉన్నాదండీ, కవిత్వంతో వ్యాసం రాయలేం గానీ, వ్యాసంలో కవిత్వం రాయొచ్చు
మీరు కచ్చితంగా చదవండి.వ్యాసంలో వున్న ఈ కవిత్వం సదవండి.

ఏ కవైనా ఎక్కడోసోట వ్యక్తిత్వాన్ని , వ్యక్తి గతాన్ని సూపెడతాడు కదండీ, అపుడు సదివిన పాటకుడికి ఓ తృప్తి మిగులుతుందండి. వ్యక్తిగతం అయ్నందుకే ! అందుకే కాబోలు ప్రేమన్న భావం ఉన్నసోట దుఃఖం తాలూకా మాటలే కనిపిస్తాయండీ! హృదయం విచ్చుకోడాం అనాదీ, హృదయం బద్దలవడం అర్హత అంటాడందుకే.

మంచి కవిత్వాన్ని అందించిన మంచి కవికి అభినందనలు తెలుపుతూ నేనూ మీకు ఈ బహుమానాన్ని ఇత్తన్నాను తీసుకోండే!

*** + ***

నీలాగే ఒకడుండేవాడు! – నందకిషోర్ కవిత్వం
పుత్తకం ఈడ సదవండి: http://kinige.com/kbook.php?id=2286&name=Neelage+Okadundevaadu