1.
ఒక రైలు పట్టా మీదే
చక చకా నడిచేస్తోంది
పాలపిట్ట.
2.
వస్తూ పోతూ
అలలు
నిశ్చలంగా బండ
3.
రాళ్ళు లేని
సెలయేటికి
హొయలేవీ?
4.
మంచు, సెలయేరు
స్వచ్ఛతని
హెచ్చవేసుకుంటూ..
5.
లోపలా బయటా
వెలిగిపోతూ
నదిలో దీపం
6.
గాలికి రాలిన
గన్నేరు పువ్వు.
గడ్డికి పూసింది.
7.
పూవులా వికసించింది
పూలని చూసిన
ఆమె ముఖం
8.
ఎన్ని వక్ర రేఖలో!
రెండు చుక్కల్ని
కలిపేందుకు
9.
రంగు రంగుల పూలు
రంగులు వెలసిన ఆకులు
ఒకే చెట్టుకి!
10.
కరెంటు పోగానే
కొవ్వొత్తినీ, నా కళ్ళనీ
కలిపి వెలిగించింది
నాకు నచ్చింది…అర్హ్దంకావటానికి రెండు మూడు సార్లు చదివినా its worth it.