‘ మూలా సుబ్రహ్మణ్యం ’ రచనలు

సెక్యూరిటీ చెక్

నీ లేపుటాప్లు, సెల్ఫోన్లు
టాబ్లెట్లూ, వాలెట్లూ
ఇంటి తాళాలు, అహంకారం

ఒక్క క్షణమైనా
అన్నీ విడిచిపెట్టి

ఖాళీ చేతులు జాపుకుని
ఒక ద్వారపాలకుడి ఎదుట…

కొన్ని ద్వారాలు తెరుచుకోవాలంటే
ఎన్ని వదులుకోవాలో!


పూర్తిగా »

సహప్రయాణీకుడు సాయి కిరణ్ తో ‘అంతర్యానం’!

సహప్రయాణీకుడు సాయి కిరణ్ తో ‘అంతర్యానం’!

కొండముది సాయి కిరణ్ కుమార్ కవిత్వం ‘అంతర్యానం’ విడుదల సందర్భంగా

 

రైలు ప్రయాణంలో చంద్రుణ్ణి తోటి ప్రయాణికుడిగా ఊహిస్తూ “సహప్రయాణీకుడు” అని ఇస్మాయిల్ గారొక కవిత రాసారు. ఏ ప్రయాణానికైనా తోడు అవసరం. ఇక స్నేహితులు అందరితో కలిసి చేసే ప్రయాణం, మరింత ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా కిరణ్ గారితో తొమ్మిదేళ్ళ మా సాహితీయానం నెమరు వేసుకోవడం నాకు ఎంతో ఆనందం.

ఇంటర్నెట్లో కవిత్వం మొదలైన తొలిరోజులు అవి. కిరణ్ గారు, రఘు గారు, బన్నీ గారు, వినీల్, ప్రసూన, తులసి, నిషిగంధ, సీత ఇలా అంతా ఉత్సాహంగా కవిత్వం రాసేవారు. దాదాపు అంతా ఒకేసారి కవిత్వం రాయడం మొదలుపెట్టాం. పడుతూ లేస్తూ…
పూర్తిగా »

ఒక అనుభూతి గీతం

ఒక అనుభూతి గీతం

అనుభవాల్లో సారూప్యత లేని ఇద్దరు వ్యక్తుల మధ్య భాష నిరర్ధకమే. కవిత్వం కూడా ఒక విధమైన భాషే. అందుకే సంవత్సరాల తరబడి అర్ధం కాని కవితలు కూడా, ఏదో క్షణంలో చటుక్కున అర్ధమౌతాయి ఒక మెరుపు మెరిసినట్టు. ఆ క్షణంలో పాఠకుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అక్కడ కవిత మారలేదు. మారింది పాఠకుడు. పెరిగింది అతని అనుభవ విస్తృతి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అనుభూతి గీతాలు అంతకు ముందు ఎన్ని సార్లో చదివినా, ఈ కవిత చదివినట్టే గుర్తులేదు. కానీ తర్వాత 2005 లో మా నాన్న గారి మరణం తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో అనుభూతి గీతాలు చదవడం తటస్థించింది. అప్పుడు…
పూర్తిగా »

కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది

15-ఫిబ్రవరి-2013


కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది

 కవిత్వంలో నిశ్శబ్దం అనగానే మొదటగా స్ఫురించే కవి ఇస్మాయిల్ గారు. ప్రస్తుత కాలంలో ఇస్మాయిల్ గారిని తలచుకోగానే,  వెంటనే గుర్తుకొచ్చే  కవి – మూలా సుబ్రహ్మణ్యం అంటే అతిశయోక్తి కాదు. ఇస్మాయిల్ కవితలు చదివి, ఆ బాణిలో, ఆ ప్రేరణతో ఒక్క కవితైనా వ్రాయని కవి ఉన్నాడంటే నమ్మలేం. ఆ కవితల మత్తులో జోగుతూ గాలిబుడగల్లా పేలిపోయిన కవులు చాలా మందే ఉన్నారు. కవులు కాకపోయినా, ఇస్మాయిల్ కన్నా అద్భుతంగా ప్రకృతిలో మమేకమయ్యే మనుషులైనా కనీసం ఉంటారా అని ఆశ్చర్యపోవటం కూడా పరిపాటి.! ఇస్మాయిల్ తో పోలిక అవసరమో అనవసరమో తెలీదు. కానీ, ఆ స్థాయిలో అనుభూతికి కొత్త రంగులు తొడిగి, ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో…
పూర్తిగా »

చిరుజల్లులో పూలు

1.
ఒక రైలు పట్టా మీదే
చక చకా నడిచేస్తోంది
పాలపిట్ట.

2.
వస్తూ పోతూ
అలలు
నిశ్చలంగా బండ

3.
రాళ్ళు లేని
సెలయేటికి
హొయలేవీ?

4.
మంచు, సెలయేరు
స్వచ్ఛతని
హెచ్చవేసుకుంటూ..

5.
లోపలా బయటా
వెలిగిపోతూ
నదిలో దీపం

6.
గాలికి రాలిన
గన్నేరు పువ్వు.
గడ్డికి పూసింది.

7.
పూవులా వికసించింది
పూలని చూసిన
ఆమె ముఖం

8.
ఎన్ని వక్ర రేఖలో!
రెండు చుక్కల్ని

పూర్తిగా »