నీ లేపుటాప్లు, సెల్ఫోన్లు
టాబ్లెట్లూ, వాలెట్లూ
ఇంటి తాళాలు, అహంకారం
టాబ్లెట్లూ, వాలెట్లూ
ఇంటి తాళాలు, అహంకారం
ఒక్క క్షణమైనా
అన్నీ విడిచిపెట్టి
ఖాళీ చేతులు జాపుకుని
ఒక ద్వారపాలకుడి ఎదుట…
కొన్ని ద్వారాలు తెరుచుకోవాలంటే
ఎన్ని వదులుకోవాలో!
“కొన్ని ద్వారాలు తెరుచుకోవాలంటే
ఎన్ని వదులుకోవాలో! ” కదా. బావుంది .
పద్యం చాల బాగుంది. దైనందిన జీవితం లోని చిన్న చిన్న ఘటనల్ని తీసుకుని ‘ఆథ్యాత్మిక’ వ్యాఖ్య చేసే మీ పద్ధతి భలే బాగుంటుంది.
లేప్ టాప్ అనే బదులు తెలగు సంప్రదాయం ప్రకారం.. (తాటాకు మాదిరి) లాప్ టాప్ అని గాని ల్యాప్ టాప్ అని గాని అంటే బాగుండేది.
లేప్ టాప్ లో స్ఫురణ బాలేదు.
సుబ్బూ, వదిలించుకోవడం కంటే వదిలించుకోబడడం బెటరేమో కదా?