కూడా
మరోరోజుకి మనసులా
చిగురేస్తుందే
చుక్కల లెక్కలు ఎన్నిసార్లేసినా
అచ్చంగా మొదటిసారిలానే తప్పుజరుగుద్దే
చెడు గెలిచీ గెలిచీ ఎదురులేదనుకున్నాక
చివరిసారి తిరుగులేని గెలుపు మంచికొస్తుందే
చిత్రకారుడో బొమ్మంతా గీసాక
చివరిగీత దేనికోసమో విలవిల్లాడిపోతాడే
పదాల మధ్యన ప్రపంచాన్నంతా దాచాక కూడా
కవి ఏదో ముగింపు కోసం అల్లాడిపోతాడే
అలాంటి కొసమెరుపు కోసమేనేమో
ప్రతి జీవితంలో ఆగని ఈ అన్వేషణ
కొస మెరుపు కోసం అన్వేషణ అనేది ఎంతో చక్కగా చెప్పారు సారూ ! ధన్యవాదాలు
నా బాధ నీలాంటోల్లతో పంచుకుంటేనే కదా సారూ తగ్గేది.అందుకే నా చివరి పదం కోసం పడే బాధ అందరితో ఇలా పంచుకున్నా, అయినా నీకు తెలియని బాధా అది చెప్పు.
ప్రతి మనిషికీ ప్రతీ సందర్భంలోనూ ఎక్కడో ఓ చోట ముగింపు పలకాల్సిందే. మొదలు పెట్టడం కాదు..ముగింపు పలకడమే చేతకావాల్సింది. మీ భావన…”పదాల మధ్యన ప్రపంచాన్నంతా దాచాక కూడా
కవి ఏదో ముగింపు కోసం అల్లాడిపోతాడే” చాలా బావుంది క్రాంతి గారూ…!!
ముగింపు అనేది తప్పని పని కదా ప్రసాద్ గారూ! ధన్యవాదాలు
చాలా బావుంది క్రాంతి ముగింపు అనేది తప్పదు.,దానికోసమే అన్వేషణ గ్రేట్
మీ మెచ్చుకోలుతో నాకిచ్చిన స్పూర్తికి ధన్యవాదాలు అమ్మా …
ముగింపులోని మెరుపు – ఆ కొస మెరుపు కోసమే జీవితమంతా అన్వేషణ, విచారణ. చాలా బావుందండి. అభినందనలు.