జీవితం ప్రారంభంలో కనిపించినదేదీ
ఇప్పుడు మసక కింద ముడుచుకుంది
లెక్కల్లో తేలని జ్ఞానం
మాటల్ని సవరించుకుంది
ఒక చల్లని పరిమళం తన ఉపరితలాన్ని పంచుకొని
మురిసిన కాలం రంగు వెలిసింది
నాకోసం పాటపాడిన చిటారుకొమ్మన చిలుక ఎగిరిపోయాక,
రాగం తిరిగి తిరిగి నా వెంట శోకం లో కలిసిపోయింది
వ్యధ కూడా వెన్నెల లాంటి చల్లదనం కురిపించిన విషయం తెలిసి
దానికీ గుండెని పంచి పెట్టాను.
ఇప్పుడు అది కూడా నా ఆనందకేంద్రకమే.
ఎప్పుడూ కనిపించే ఆకాశం లో కూడా
ఎన్ని రకాల కదలికలు ప్రవహిస్తాయి కదా …
అంగీకరించడమే దాదాపు మెలిక
ఐనా
నా కోసం కొన్ని తలుపులు మూసే ఉంటాయి
వ్యామోహం లేని స్పర్శ కోసం
కొంత జీవితం వెంట నడుస్తున్నా …
అందుకే కావచ్చు కొన్నిటిని కోల్పోయింది
ఎంత చెప్పుకున్నా
మనసుకీ… హృదయానికీ
ఈ వస్తు ప్రపంచానికీ దారులు కలియడమే కుదరనట్టుంది.
దుఃఖమే ఏ వాంఛా లేకుండా
తన మీదికి తీసుకొని లాలిస్తుంది.
ఓ అపరిచితురాలివలె.
‘నా కోసం కొన్ని తలుపులు మూసే ఉంటాయి
వ్యామోహం లేని స్పర్శ కోసం..’
- అంటే అవెలాటి తలుపులై వుంటాయా అని ఆలోచన కలుగుతుంది కదూ ? – ఎవరికైనా!
వ్యామోహం లేని స్పర్శ తప్పకుండా అమ్మవమ్టిదే అవుతుంది. అంటే ప్రేమ తప్ప మరొకటెరుగని స్పర్శేమో అని నా భావన.
వీలుంటే వివరించగలరు.
కవిత బావుంది.
అభినన్దనలండి.
నమస్తే మాడం.థాంక్ యు .
నిజమే అది ఎవరి మధ్యన ఉన్నా గొప్పదని అనిపిస్తుంది .
మరోకదేనికోసమో ప్రకటించే ప్రేమ కాకుంటే అదే …పుణ్య మైనది .
“దుఃఖమే ఏ వాంఛా లేకుండా
తన మీదికి తీసుకొని లాలిస్తుంది.”
చాలా బాగుంది గురుస్వామి గారు.
కృతజ్ఞతలు రవి గారు.
డాక్టర్ గురూ: నీ పద్యం చదవడం వొక అనుభవం. ఆ అనుభవం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది ఈ పద్యంలో…ఇలా…”వ్యామోహం లేని స్పర్శ” ఎంత కష్టమో తెలుసా?!
నా కోసం కొన్ని తలుపులు మూసే ఉంటాయి
వ్యామోహం లేని స్పర్శ కోసం
కొంత జీవితం వెంట నడుస్తున్నా …
అందుకే కావచ్చు కొన్నిటిని కోల్పోయింది
సర్ నమస్తే…
కృతజ్ఞతలు.మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా.
“రాగం తిరిగి తిరిగి నా వెంట శోకం లో కలిసిపోయింది” నైస్ లైన్ సర్ జీ … మంచి కవిత గురుస్వామి గారు
థాంక్ యు ప్రసాద్ సర్.
దుఃఖమే ఏ వాంఛా లేకుండా
తన మీదికి తీసుకొని లాలిస్తుంది.
ఓ అపరిచితురాలివలె.
నిజమే డాక్టర్ సాబ్.. హృదయానికి వైద్యం చేసే పద్యం.. నమస్సులతో..
నమస్తే వర్మ….థాంక్యు .
కవిత ..పద్యమో ..భావమో ..
చదివి చదివి అలసి ..కళ్ళు మూసుకున్నా ..
కనిపిస్తుందా ??
ఈ కవి కోరిన అపరిచితురాలు నాకూ ?
ఎవరి వాంచా వ్యాకులత వారిదే కదా ..అని నిట్టుర్చాను ..
ఇలా వ్యామోహం లేని స్పర్శ ఐనా పోనీ ?
ప్స్చ్ ..నీ తలుపులు ఎప్పుడు ఎలా మూసుకు పోయాయో నీకే తెలుసు
పరిమళాలు తేలి వస్తాయా ? తలుపులు తెరుస్తాయా ?
విషయ వాంచా పరిమళం నన్ను వదలాలి కదా ..
ఇలా ఎన్నో భావాలు ముట్టడించి …ఒక భావన లో వదిలింది మీ కవిత
ధన్యవాదాలు అండీ మీకు ..ప్రచురించిన పత్రిక వారికి కూడా
వసంత లక్ష్మి .
నమస్తే మాడం…
మీ కంటి చూపుల కింద తడిసిన పద్యం ధన్యమైనది.
కృతజ్ఞతలు…
మనసుకీ హృదయానికీ వస్తు ప్రపంచానికీ దారులు కలవని సందర్భాన్ని మంచి కవిత్వం చేశారు.అట్లాంటి స్థితిలోనే ,వ్యామోహం లేని స్పర్శ స్పృశిస్తుందేమో?కవిత బాగుంది.
రాజారామ్ సర్ నమస్తే.ధన్యవాదాలు.మీ సునిశిత దృష్టి ఎప్పుడు విలక్షణ మైనదే…
ఎప్పుడూ కనిపించే ఆకాశం లో కూడా
ఎన్ని రకాల కదలికలు ప్రవహిస్తాయి కదా …
……..నిజమే. ఆలోచనలను తట్టి రేపుతూ … కాలాన్ని కరిగిస్తూ ఉంటాయి
నమస్తే శారద గారు.కృతజ్ఞతలు .
ఇప్పుడు ప్రేమలేని ప్రపంచములో ఆర్దిక సంబందాలు తప్ప మరేమీ కనిపించని స్తితి దీని పరిష్కారం కూడా వ్రాయండి
నమస్తే తిరుమలరావు గారు.ధన్యవాదాలు.