కవిత్వం

వానాగిపోయాక..

సెప్టెంబర్ 2014

తడి పాదం
ఒంటరి అడుగులు
లెక్కలేనన్ని
దారంతా చల్లుతూ-

గడ్డి పరకలు
ముద్దు పెట్టే
సీతాకోక చిలుకలు-

పాదాల కంటికి
అంటు మట్టి
దేహం అంతా
అత్తరు-

వాన చెమటకి
చెట్టు తల
ప్రియురాలి నుదుటి
బొట్టు బిళ్ళ

నేల ఆరిపోవు
మొదలు సమయం
నా కాళ్ళు
తడబడు చివరి
ఘడియ-