కవిత్వం

నాకు న్యాయం కావాలి

జనవరి 2013

కాలి బొగ్గైన నా శరీరం
        పదే పదే చితిలో ఎత్తి పెడుతున్నావ్.
అయినా
బూడిద చెయ్యలేకపోయావ్
చెయ్యలేవు…

పిండైన నా హృదయపు
      కాలిన నెత్తురు
             చల్లబరుస్తోంది చితిని.

విచలితమైన కళ్ళ ప్రశ్నకీ రోజు
        జవాబు కావాలి
మూగబోయిన నా కంఠంలోని
        ఆర్తనాదానికి న్యాయం కావాలి

విశృంఖల సమాజపు
పాడు పడ్డ మెదడుకి
        తలకొరివి పెట్టి
        వచ్చి
        నా బూడిదను గంగలో కలుపు
ఒక రజనీగంధ పూవుతో పాటు

 

తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్

(ఢిల్లీలో బలాత్కారానికి గురై ప్రాణాలు కోల్పోయిన “నిర్భయ” ఘటన ఈ కవితకు ప్రేరణ)  

 

Original: గరికపాటి సంగీత (అహోమియా కవిత)

মোকন্যায় লাগে

জ্বলিএঙাৰহোৱামোৰশৰীৰটো

        বাৰেবাৰেচিতাততুলিদিছা

যদিও

ছাইকৰিবপৰানাই

নোৱাৰা……

 

বিচূৰ্ণমোৰহৃদয়ৰ

         জ্বলা-তেজে        

            
  
ঠান্ডাকৰিছেচিতা

 

বিততচকুৰপ্ৰশ্নকআজি

         উত্তৰলাগে

 মূকমোৰকন্ঠৰ 

     আৰ্ত্তনাদকন্যায় লাগে

  

বিশৃঙ্খলসমাজৰ

বিজুতিঘটামগজুৰ 

        
মুখাগ্নিকৰি

        
আহি

        
বিসৰ্জনকৰামোৰছাই

এপাহৰজনীগন্ধাৰসতে

 

 

 

 

 

 

 

 

 

(సంగీత)

గరికపాటి సంగీత:
అసోమియా రచయిత, కవి, అనువాదకురాలు. తెలుగు నుంచి అసోమియాకు కవితలను అనువదించింది.  అలాగే మొంటాలే, నెరుడా, పాల్ సెలాన్ తదితరులను అసోమియాలోకి అనువదించింది. సుభాస్ చంద్ర బోస్ జీవిత చరిత్రను రచించింది. బిహూ నాట్యం చేస్తుంది, హిందుస్తానీ సంగీతంలో విశారద. ప్రస్తుతం బెంగళూరులో నివాసం.
గమనిక: “స”ని ‘హ’ అనే ఉచ్చారణ చేస్తారు అందుకే “అసోం” “అసోమియా” అని రాసినా ‘అహొం’ ‘అహోమియా’ అన్నట్టు ఉచ్చారణ చేస్తారు.