కవిత్వం

మోహం!

ఆగస్ట్ 2015

కే ఆకాశాన్ని
ఏకకాలంలో రమిస్తున్న
ఏడు సముద్రాలు.

పల్చటి చీకటితెర వెనకాల
కావులిచ్చుకు పడుకున్న
పచ్చటి కొండలు.

పిరుదులూపుకుంటూ
పంటపొలాల్లో తిరుగుతున్న
గాలికన్యలు.

ఆకు నగ్నత్వాన్ని
అద్దంపట్టి చూపిస్తున్న
మంచుబిందువులు.

భూమి బొడ్డు మీద
పెరుగు చిలుకుతున్న
చంద్రుడు.

కంటి కౌగిట్లో నగ్నంగా కులకడానికి
పేజీ ముడులను ఒక్కొక్కటే విప్పుకుంటూ
పుస్తకం.