‘ ఎమ్వీ రామిరెడ్డి ’ రచనలు

కంకాళశాల

అది కాటికాపరి విజిల్‌లా లేదు, శ్మశానంలో నక్కల ఊళలా ఉంది.

‘విశాల గదులు- సకల సదుపాయాల’ ప్రకటనల్ని వెక్కిరిస్తూ డార్మిటరీలన్నీ మంచాలతో కిక్కిరిసి ఉన్నాయి. సుడిగాలికి సురసురా లేచిన బూడిదమేఘాల్లా దుప్పట్లు లేచి అవతల పడ్డాయి.

మంచాల మీంచి అస్థిపంజరాలు నిటారుగా లేచి నిలబడ్డాయి. తెల్లటి ఎముకలతో కూడిన కాళ్లను నేల మీద తాటించి, బిలబిలమంటూ ఆ ఫ్లోర్‌లో ఒక మూలనున్న అతిపెద్ద ఫ్రీజర్‌ దగ్గరకు పరిగెత్తాయి.

క్యూలో నిలబడి, తమ వంతు రాగానే బార్‌కోడ్‌ ఆధారంగా తమ తలల్ని తగిలించుకుని, మళ్లీ గదుల వైపు పరిగెత్తాయి.

గోడకు తగిలించిన అద్దం ముందు నిలబడి, తేరిపార చూసుకుంది ఓ అస్థిపంజరం.

సందేహం లేదు, తన మొహమే!…
పూర్తిగా »

కలవని వేళలు

అక్టోబర్ 2017


నీ చూపుల చెలమల్లో
నేను దాహం తీరడం లేదు
నా కళ్ల నదుల్లో
నువ్వు స్నానం చెయ్యడం లేదు
ఉదయాస్తమయాల్లో మనిద్దరి మధ్యా
వెలుతురు పెదాలు విచ్చుకోవడం లేదు

విధుల ముళ్లు విదిలించుకుని
ఇంట్లో అడుగు పెట్టాక కూడా
గాయాల బాధ మాయం కావడం లేదు
అడపాదడపా వంటగదిలో విడుదలయ్యే నవ్వులు
ప్రెషర్‌ కుక్కర్‌ మూతదాటి బయటికి రావడం లేదు
భోజనాల వేళ మాటలమెతుకుల మధ్య
మునుపటి విశేషాలముద్దలు గొంతు దిగడం లేదు

దైనందిన దైవాలుగా
అనివార్య ఆయుధాలుగా

మన మీదికి డిజిటల్‌ శక్తుల మూకుమ్మడి దాడి

పూర్తిగా »