‘ గరికపాటి సంగీత ’ రచనలు

కవిత కాదు

22-ఫిబ్రవరి-2013


కవిత కాదు
నా గుండె శబ్దం
ప్రవహింపచేసే సిర
రక్త ధమనులతో పాటు
కలిసి మెదడునూ చేరింది

వెయ్యి రంగుల సీతాకోక చిలుక
నా కళ్ళ ముందు
నుంచి దాటి పోతోంది
సంధ్య వేళ మిణుగురు పురుగై
నా ముఖాన్ని
వెలిగించి వేసింది

పున్నమి చంద్రుని సౌందర్యం
ఉదయించే సూర్యుని వెలుగై లేచింది

ఉజ్వలమైన రెండు కళ్ళతో
నా మనసు చిరునవ్వు నవ్వుతోంది

 

మూలం (అహోమియా కవిత): గరికపాటి సంగీత
తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్


పూర్తిగా »

కేవలం ఒక దీపమే మిగిలింది

08-ఫిబ్రవరి-2013


ఒక్కడుగు ఉసిరి మొలక ఇప్పుడు నీకు నీడనిచ్చేంతయ్యింది రెండాకుల మారేడు చెట్టుకప్పుడే మారేడు పళ్ళు పడ్డాయి తెలియదు కానీ నువ్వెక్కడనుంచో తెచ్చి నాటిన మల్లెలు మందారాలు గులాబీ గన్నేరు పూల రెక్కలు కొన్ని ఈ రోజు నీ వంటి మీద పడున్నాయి నిత్యం ఆకొకటి గిల్లే తులసి చెట్టుకి సరిగ్గా పక్కనే నువ్వు నిద్రపోయావ్ రెప్పకొట్టేంతలోనే ఈ ప్రదేశం ఖాళీ అయి కేవలం ఒక దీపమే మిగిలింది.

 

తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్

మూలం: గరికపాటి సంగీత (అహోమియా కవిత)

 

 


పూర్తిగా »

సూర్యుడప్పటికే అస్తమించాడు

విషణ్ణ మనస్సు
అలసిన శరీరం
అసహాయంగా, దుర్బల దృష్టితో
తూర్పు వైపు చూస్తూనే ఉన్నా

అవును, ఈ వైపే పొద్దు పొడుస్తుంది.
కాళ తుఫాను ఈ క్షణమే తెప్పరిల్లింది.
హఠాత్తుగా,
తెరపిచ్చిన ఆకాశం తెల్లవారింది
నా వెనకాలే, కానీ
సూర్యుడప్పటికే అస్తమించాడు

 

2. ఏ వైపునో నువ్వున్నది


కన్నీటితో వంతెన కడుతున్నా.
ఆశలతో ఎత్తైన నిచ్చెన
ఏ వైపునో నువ్వున్నది
దూరంగానా? పైనా?

తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్
మూలం: గరికపాటి సంగీత


పూర్తిగా »

నాకు న్యాయం కావాలి

నాకు న్యాయం కావాలి

కాలి బొగ్గైన నా శరీరం
        పదే పదే చితిలో ఎత్తి పెడుతున్నావ్.
అయినా
బూడిద చెయ్యలేకపోయావ్
చెయ్యలేవు…

పిండైన నా హృదయపు
      కాలిన నెత్తురు
             చల్లబరుస్తోంది చితిని.

విచలితమైన కళ్ళ ప్రశ్నకీ రోజు
        జవాబు కావాలి
మూగబోయిన నా కంఠంలోని
        ఆర్తనాదానికి న్యాయం కావాలి

విశృంఖల సమాజపు
పాడు పడ్డ మెదడుకి
        తలకొరివి పెట్టి
        వచ్చి
        నా బూడిదను గంగలో కలుపు
ఒక రజనీగంధ పూవుతో పాటు

 

తెలుగు అనువాదం: గరికపాటి పవన్…
పూర్తిగా »