‘ జాన్ హైడ్ కనుమూరి ’ రచనలు

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

రంజని-కుందుర్తి అవార్డ్, ఆంధ్రసారస్వత సమితి అవార్డ్, రమ్యభారతి కథా పురస్కారం, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత కవయిత్రి రేణుకా అయోల గారితో ముఖాముఖం.

Q: కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి తేడా ఎమిటి? దాన్ని మీరెంతవరకు సాధించగలిగారు? మీకు నచ్చిన తెలుగు మరియు తెలుగేతర కవిత్వము, కథలు రచయతలు/త్రులు గురించి చెబుతారా?

కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి కావలసింది నిజాయతి, అది నేను సాదించేనని అనుకుంటున్నాను. కవిత్వాన్ని ప్రేమించే నేను అందరి కవిత్వం ఇష్టపడతాను. అనువాదాలు అంతగా చదవలేదు. కధలు, నవలలు విరివిగా చదివినా, నేను ఎక్కువగా ఇష్టపడ్డ రచయతలు; కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాధ్.

ఉద్యోగరీత్య మధ్యప్రదేస్ లో వుండం వల్ల గజల్స్ వినడం, వాటిపై…
పూర్తిగా »

పడిలేవడం

మేధస్సు
సాంకేతికాక్షరాల మధింపు
డిజిటల్లో, అనలాగ్గో పరికరాల సూచికల్తో
నా భద్రతను అంచనా వేసుకుంటాను

ఎదిగిన పరిజ్ఞానంతో
ఎన్ని దారుల్ని పరుచుకున్నానో !

అభద్రతా గుండంలోకి
జారిపోయిన క్షణం ఊహించని ప్రవాహం!

నే నిలబెట్టిన శివుణ్ణి తోసుకుంటూ
గంగవేసే ఉరకలు
కాళ్ళక్రింద మట్టిని కోస్తూ
నన్నూ నా శివుణ్ణీ బ్రమింపచేసాయి

నా జ్ఞానాన్ని
అజ్ఞానంలోకి నెట్టేస్తూ, ప్రశ్నిస్తూ
ఒక బీభత్సం

గల్లంతైన దేహాలు
కూకటివేళ్ళతో కొట్టుకుపోయిన భవనాలు
లయతప్పిన ప్రకృతి నృత్యం
వరదవదిలెళ్ళిన బురద

కాళ్ళు ఆరనివ్వని నీటి మధ్య
గొంతు తడుపుకోలేక కన్నీటిని చప్పరిస్తున్నాను


పూర్తిగా »

వస్తూపోయే జీవన జీవితచక్రం

సముద్రతీరంలో అలలు వచ్చినట్టు
ఎవరో ఒకరు
వస్తూవుంటారు, పోతూవుంటారు

తీరంపై వ్యవహాళికి నడినట్టు
పాదముద్రలను వదిలిపోతారు
రెప్పపాటులో
ఏ ఒక్కటీ కన్పడదు

కొన్ని జంటలు
కలలుతెచ్చి పరచిపోతారు

నిత్యం అలల్ని
ఆటుపోటుల్ని చూసే తీరవాసులు
ఏమీ పట్టనట్టే తిరుగుతుంటారు

పిల్ల కాల్వల్ని
పంట కాల్వల్ని
ఎన్నడూ చూడని కన్ను
ఆశ్చర్యాన్ని నోరు తెరచి ప్రకటిస్తుంది

అలలు వస్తూవుంటాయి పోతూవుంటాయి

చీకటివేళ గూడువెతుక్కునే పక్షులు
వెన్నెలను ఆశ్వాదించమని
సమయాన్ని ఒంటరిగా వదిలిపోతాయి

కొన్ని రంగుల్ని, కొన్ని చలనక్షణాలను
కెమేరాలో బంధించానని తృప్తిపడతారు

అనంత సాగరంలో
మోకాళ్ళ…
పూర్తిగా »

వర్షం…నీటి దారాల కండె

వర్షం…నీటి దారాల కండె

చాలా కాలం క్రితం చదివిన తుమ్మల దేవరావు గారి ఈ కవిత చాలాసార్లు నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇందులో వున్న పదచిత్రాలు నన్ను బాగా అకర్షించాయి.

వర్షానికి నిర్వచనాలు, సూత్రీకరణలు, కొన్ని చిత్రాలు, అనుభూతి చెందడం ఎలా!, వాటివెనుక కొన్ని జ్ఞాపకాలు కన్పిస్తాయి. బీద ధనిక, గుడిసెలపైన భవంతులపైనా వకేలా కురుస్తుందని చెప్తూ

“వర్షం ఒక సమతా సూత్రం
భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి దారాల కండె”

ఆకాశానికి భూమికి మధ్య వున్న వేలకిలోమీటర్లను లెక్కిస్తున్న శాస్త్రపరిజ్ఞాన్ని చాలా సులువుగా సూత్రీకరిస్తున్నట్టు కన్పిస్తుంది. సమాంతరంగా వుండే రెండిటినీ కలిపి వుంచడానికి కలిపికుట్టే దారపుకండె అని ప్రతిపాదిస్తాడు.
మన నిత్యజీవితంలో దారం జీవన…
పూర్తిగా »

మరణం తరవాత తెలుస్తున్న రమణ!

ఫిబ్రవరి 2013


మరణం తరవాత తెలుస్తున్న రమణ!

కొద్ది సార్లు ఆయన్ని యూనివర్సితీలో కలిసాను. పరీక్షల నిర్వహణా విభాగంలో వున్నప్పుడు చాలా చేసేపు ఎదురెదురుగానే పనివత్తిడివల్ల సమయం గడిచిపోయింది. నా కవిత్వం రాయటంలో కొన్ని సూచనలు ఇచ్చారు. 2004 హసీనా – దీర్ఘ కవితగా రాయడం ఆయన ప్రోత్సాహమే.

మాటల్లో ఒకసారి మీరు పిహెచ్ డి ఎందుకు చేయకూడదూ అని అడిగారు. ఎం.ఎ. చెయ్యలేదని చెపాను. ఆయన ప్రోత్సాహంతో 2010-12 ఎం.ఎ. జాయిన్ అయ్యాను. ఇక్కడ ఆయనే అధునిక కవిత్వం అనే అంశాన్ని బోధించారు, కాని నా గుండె ఆపరేషన్ వల్ల ఆయన తరగతులు హాజరు కాలేకపోయాను. అదో అంసృప్తి నాకు. డిశెంబరు 2012లో  యెస్.పి కాలేజిలో చిన్న ఫేర్ వెల్ జరిగింది.…
పూర్తిగా »

పొరపాటే!

వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే!

సాహసాల సంచిని భుజాన వేసుకొని
రహదార్లు, విద్యుత్తుదీపాలులేని
గుబురు అలుముకున్న చెట్లలోంచి
మెలికలు తిరిగిన కాలిబాటను
ఒంటరిగా నడవడమే!

బాల్యంలో విన్న దెయ్యంకథలు
వెనుకనుంచి విసిరే గాలిలోంచి
చెవిలో గుసగుసలాడొచ్చు

దారితప్పిన గువ్వపిట్ట
గుబులు గుబులుగా పాడేరాగం
వెన్నంటే రావొచ్చు

తప్పిపోయిన కుమారుడు
దూరాన నెగడై ఎందరికో వెచ్చదనానిస్తూ
పిలుస్తున్నట్టే అన్పించొచ్చు

మిణుగురులు పంపే ప్రేమసంకేతాలు
కన్రెప్పలను గుచ్చి గుచ్చి
ఆదమరచిన చెలిజ్ఞాపకాలు
మువ్వల సవ్వడై ముందు నడవనూవచ్చు

పేగుచివర రేగిన ఆకలిమంట
విద్యుల్లతలా ఆవరించి
దేహాన్ని…
పూర్తిగా »