‘ రేణుక అయోల ’ రచనలు

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

రంజని-కుందుర్తి అవార్డ్, ఆంధ్రసారస్వత సమితి అవార్డ్, రమ్యభారతి కథా పురస్కారం, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత కవయిత్రి రేణుకా అయోల గారితో ముఖాముఖం.

Q: కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి తేడా ఎమిటి? దాన్ని మీరెంతవరకు సాధించగలిగారు? మీకు నచ్చిన తెలుగు మరియు తెలుగేతర కవిత్వము, కథలు రచయతలు/త్రులు గురించి చెబుతారా?

కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి కావలసింది నిజాయతి, అది నేను సాదించేనని అనుకుంటున్నాను. కవిత్వాన్ని ప్రేమించే నేను అందరి కవిత్వం ఇష్టపడతాను. అనువాదాలు అంతగా చదవలేదు. కధలు, నవలలు విరివిగా చదివినా, నేను ఎక్కువగా ఇష్టపడ్డ రచయతలు; కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాధ్.

ఉద్యోగరీత్య మధ్యప్రదేస్ లో వుండం వల్ల గజల్స్ వినడం, వాటిపై…
పూర్తిగా »

ఏకాంత ఛాయ

జూన్ 2014


ఏకాంత ఛాయ

ఏకాంతంలోనే దృశ్యాలనీడలు
సమూహలలో ఒంతటిరితనం
కలిసి పెనవేసుకున్న శరీర చిత్రం
క్రీనీడలలో ఎండలో విడిపోయి
నేలమీద వాలిపోయిన రూపం
ఎప్పుడో గాని పలకరించదు

నడక కింద జారిపోయి
దూరంగా జరిగి శరీరంతో వేరుపడని నీడ
గోడలని నీళ్ళని అద్దలుగా చేసుకుంటుంది
ఏముంది చీకటి రూపంలో
వెలుతురు అంటని నలుపు
దీపాలు కొండెక్కిన నలుపు

వెలుగుని గాలించినా
కంచుకాగడలతో వెతికినా
కొంచంకూడ నక్షత్రంల్లా వెలగదు

శరీరంలో రూపం
ఏకాంతంలో వులి శబ్దం
చెక్కుతున్న విషయాలు
రంగులు కలుపుకుంటున్న కుంచెలు

నల్లని నీళ్లని కదిల్చినా
వెలుగుని…
పూర్తిగా »

ప్రాచీన కధా లహరికి ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల సరాగమాల డా. ముక్తేవి భారతి

ప్రాచీన కధా లహరికి  ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల  సరాగమాల డా. ముక్తేవి భారతి

తెలుగుతో పాటు చరిత్రలోనూ స్నాతకోత్తర పట్టభద్రులై భాష శాస్త్ర౦ అభ్యసించి చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసిన సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతల నిర్వహణతో పాటు సవ్య సాచిలా సాహిత్య ప్రపంచంలోనూ మని రత్నంలా వెలిగారు. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కధా సంపుటాలు ,ఎనిమిది నవలలు ,ఎనిమిది సాంఘిక నవలలు ,5మోనోగ్రాఫ్ లు ఒక కవితా సంకలనం నాలుగు వ్యాస సంకలనాలతో వివిధ పత్రికలలో ఎన్నో కాలమ్స్ రాసి , రాస్తూ సాహితీ సదస్సులలో నిరంతరం పాల్గొంటూ అత్యుత్తమ సత్కారాలు పొంది నిరంతరం సాహితీ క్షేత్రం లో విరాజిల్లుతున్న విదుషీమణి డా. ముక్తేవి భారతి.

చిరునవ్వుతో ఆప్యాయత కలగలిపి…
పూర్తిగా »

ఇంక చదువుకుందాము బాల్యాన్ని….

22-మార్చి-2013


ఇంక చదువుకుందాము బాల్యాన్ని….

కవిత్వానికి ఒక సంభాషణ వుంటుంది దానిలో ఒదిగిపోయి మనం కవిత్వంతో పాటూ ప్రయాణిస్తాము.

ఏలాంటి సంఘటన అయినా అది మనకే జరిగిందా లేక మనం గమనిస్తున్న మనుషుల మధ్య జరుగుతోందా అన్నంత సహజంగా పాఠకులను తీసుకువెళ్ళినప్పుడే ఆ పద్యం మనల్ని వెంటాడుతుంది. ఆ పోలికలు వున్న ఏ సందర్భాన్ని చూసినా వాళ్ల భావాలు మన మనసులోకి ఆ పదాలతోపాటు సీతాకోకచిలకల్లా వచ్చి వాలిపోతాయి. అప్పుడు ఆకవి పేరు గుర్తుకి రాక పోవచ్చు కాని ఆకవిత్వం మనల్ని వెంటాడుతుంది. అలాంటి పద్యమే గంటేడ గౌరునాయుడి పద్యం”బాల్యం”.

బందులదోడ్దీ అంటే పల్లె టూళ్లలో దొంగతనంగా చేల్లొ పడి మేసిన పశువులని బందులదోడ్డిలొ కట్టేస్తారు.
అందమైన బాల్యం హాయిగా…
పూర్తిగా »

పాలరాతి ఏనుగుబోమ్మ

జనవరి 2013


పాలరాతి ఏనుగుబోమ్మ చేజారి పడిపోయింది నర్మదానది  జలపాతం విరిగిన బోమ్మ గుండెలోంచి  దూకింది బొమ్మ శిధిలంలో మూడేళ్లకోసారి సంచారజీవితంలా కొత్త నగరాల ప్రవేసాల జ్జాపకం   నగరం తనువులోకి వచ్చిపడ్దాక కొత్త ఉదయం మొదలైంది కొత్త భాష కొత్తపరిసరం పలకమీద అ ఆ లు  దిద్దుకోవడమే రోజులు గడిచాక నగరం అలవాట్లు ఒంటబట్టాక కోత్త దారులను వెతుకుతుంటే  నగరంలో ఒదిగి నిశ్శబ్ధంగా పారే నది ఇసుక తీరాలవెంట పాలరాతి బొమ్మల అంగడిలిలో నది కొత్త స్వరూపం తెలిసింది   పాలరాతి కొండలమధ్యలో ఇరుకు దారిలో నది నాజూకుగా వంపులు తిరిగి పలకరింస్తుంది అనందంగా ఎగిరిపడే జలపాతాలు పాలనురుగులు సూర్యుడి వెలుగులో నల్లని నీటి చీర అంచులలో…
పూర్తిగా »