వాన చినుకులు
నుదిటిన
కనులపై
పెదవులపై
తనువంతా
ముద్దుగా
గుచ్చుకునీ
విచ్చుకునీ
హత్తుకునీ
నీలా
పూర్తిగా »
వాన చినుకులు
నుదిటిన
కనులపై
పెదవులపై
తనువంతా
ముద్దుగా
గుచ్చుకునీ
విచ్చుకునీ
హత్తుకునీ
నీలా
పూర్తిగా »
కొన్ని వెలుతురు నీడలు
కొన్ని చీకటి కిరణాలు
అల్లుకున్న ఒక వెదుకులాట
ఆటస్థలంలో
ఎపుడూ మనదో
కొత్తపలకరింత
పూర్తిగా »
ఇపుడా కెమ్మోవి తేనెల సోనై
ఊరించడం లేదు
యవ్వనపు పొంగులేవీ
కెరటాలై చుట్టేయడంలేదు.
హంసతూలికా తల్పాన విస్తరించిన
సుకుమార సౌందర్య జ్వాలలో
దహింప బడేందుకు
మనసు ఏ కోరికల కట్టెనూ
ఎగదోయడం లేదు.
ఒక తెలియని దుఃఖమేదో ఆవేదనై
మనసును ముంచెత్తుతోంది.
ఒక్కొక అహంకారపు ఆభరణాన్నీ
ఆభిజాత్యపు వస్త్రాన్నీ తొలగిస్తూ,
తననే మాత్రమూ కదిలించని
నిదురిస్తూన్న ఆ సౌందర్యప్రవాహాన్నీ
పక్కనే అమాయికపు పొత్తిగా కలలుగంటున్న
పసితనాన్నీ
నిర్వికారంగా చూస్తున్నాడతను.
ఇపుడే ముఖాన్ని చూస్తున్నా కలవరమే
ప్రతి శరీరమూ కోరికల తుట్టే,
పూర్తిగా »
ఒక సమాంతర దశ నుంచీ
మరో అసమాంతర దశలోకి
మళ్ళీ యింకో దాన్లోకి
మళ్ళీ మొదటికి -
యిలా తిరుగుతూనే
తర్కిస్తూనే వుంటాను.
ఎటెళ్ళినా
నన్ను చుట్టిన వంటరితనమే
యేదో రూపంలో
నా చుట్టూనే శ్వాసిస్తూ
నేను కల్పించుకున్న పనిలాగా కూడా -
‘నాతో ఇంకొకరు కూడా’
అనుకుంటూ
పాటతోనో, మాటతోనో
చెలిమి కడతాను.
ఎందరిలో యెక్కడున్నా
ఎక్కడినుంచో పిలిచినట్లు
నాలోంచే పలికి
పక్కనే చేరుతూ
మళ్ళీ నా వంటరితనమే,
నా శ్వాసలా నీడలా
నాతోనే!
…
పూర్తిగా »
ఎందుకు
ప్రేమించిందో
యేమో
చివుళ్ళతో పూసిన ఆ అడవిని,
ఆ వయారి రంగుల పిట్ట.
'కూవూ' అని పేరు పెట్టింది!
పూలతోటయిందాకా
పూర్తిగా »
చూడు,
ద్రవిస్తూ
ఒక బిందువులా మొదలై
చుట్టుముడుతున్న
నీ అనవసరావసరాల
ఆధునిక సుప్రభాతాన్ని.
నిను సంభ్రమింపజేస్తూ
ఆవిష్కృతమౌతున్న
ఓ సమ్మోహన యుగాన్ని.
చూడు,
ఆర్ద్రతను కోల్పోతున్న
గుండెల తెరల మీద
వ్రేలి కొసలతో లాగబడుతున్న ఆనందంలో
వెఱ్ఱితనాన తూగి
తాంత్రిక బాణామతి గుంపులై
వూయలూగుతున్న
అవ్యక్త జగాల్ని.
చూడు,
గొలుసు తెంపుకున్న మృగాలై
దారి పొడవునా సృష్టిస్తున్న
మత్తెక్కిన, అలవిమాలిన
అతిశయాల్ని,
దారి తప్పి
గమ్యమెరుగని తిమిరసర్పాలై
పోటీ పడి తిరుగుతున్న
అహంకారపు…
పూర్తిగా »
నిశ్శబ్దాన్ని ఎపుడైనా వినొచ్చు కానీ,
అది నిన్నావరిస్తే మౌనమే!
నిన్ను చిత్తరువులా చూపుతున్నదీ
నిన్ను చుట్టేసిన యీ మౌనమే!
పొగమ౦చులా మొదలైన ఈ నిశ్శబ్ద౦
తెరలుతెరలుగా దిగులు గూడై
మనసు నల్లుకు౦టో౦దని
చెబుతో౦ది కూడా
నీ మౌనమే!
నీదైన యీ మౌనం
నన్ను స్పృశి౦చడమే కాదు,
చలిమ౦టై దహిస్తు౦ది కూడా!
యే కొమ్మల గలగలా వినిపి౦చదు,
యే గున్వ పాటా గు౦డె చేరదు,
నేను మనిషినేనన్న నిజమూ స్ఫురి౦చదు.
ఓ శిల ఊపిరి పీల్చినట్టే నేను కూడా,
యే జ్ఞాపకాలనూ ధరి౦చలేకు౦డా!
నిశ్శబ్ద౦ ను౦చీ నీ మౌనం లోకి
పూర్తిగా »
ఎన్నాళ్ళిలా
ఒక భ్రమను దాటి మరొక భ్రమ లోకి
యీ సంక్రమణం,
ఆశ్చర్యార్ధకంగా మారుతూ
యీ పయనం?
నడు, బయటకు నడు…దాటాల్సిన కర్తవ్యాల తీరాలు చాలానే వున్నై
కనపడని విచ్చుకత్తులూ
పరిధిని విస్తరించుకు
పరీక్షించేందుకు సిధ్ధంగా వున్నై
అంతరంగ మథనమూ
పరిహసిస్తూ వుంటూనే వుంది.నీ గాయాల్ని నలుగురికీ పంచి
బాధోన్ముఖుల్ని చేయనక్కర్లా
కనుబొమతోనే శాసిస్తున్న
స్వార్ధాన్ని కదనానికి పిలిచి మరీ నడు
నడువు నీ సహన జ్వాలను మండిస్తూ…
నీవు చీల్చుకొచ్చిన పరాభవాల వల నిజమే!
గెలిచిన పరిహాసమూ నిజమే!
నీ వెనుక…
పూర్తిగా »
ఆ రోజెందుకో సెలవు కావడంతో, వేరే పనులేవీ లేకపొవడంతో, కాఫీ తాగి ప్రొద్దున్నే టీవీ ముందర, సోఫాలో కూలబడ్డాడు పరాంకుశం. భార్య మండోదరి పిల్లల్ని బడికి పంపే హడావిడిలో వంటింట్లో వుంది. పేపరు అటు ఇటు తిరగేసి టీవీ లో చానల్స్ మార్చి మార్చి చూస్తూ ‘రాసి-వాసి’ దగ్గర సెటిల్ అయ్యాడు. అన్ని రకాల బొట్లూ పెట్టి, చిత్రంగా నుదిటి మధ్య రూపాయంత నల్ల చుక్క బెట్టి, గడ్డాలు పెంచిన, నల్ల తలపాగా పెట్టిన, ఎర్ర గుడ్డల సిధ్ధాంతి ఒకడు ఆ రోజు రాసి ఫలాలగురించి చెప్తున్నాడు. రాశుల వారీగా చివరెక్కడో ఉన్నా తన రాశి ఫలం వచ్చే వరకు ఓపిగ్గా వినడం మొదలెట్టాడు పరాంకుశం.
…ఏ భగీరధుడి ప్రయత్నానో
జారి,
ఏ కొండల గుండెల పైనో పారాడి,
ఏ చెలమల సాన్నిహిత్యానో పెరిగి,
ఒక్కొక మలుపులో
కదాచిత్ గా ఒక అద్భుత చిత్రమై,
స్వేచ్ఛా ప్రవాహమై సాగుతూ…
జడి వానై వచ్చిన
హర్షపు వడి నడకలు
తనువంతా ముసురును పట్టిస్తే,
వాగై, వంకై ,
ఆరాటమై, ఆవేగమై ముంచెత్తుతూ,
సుఖ శిఖరాలపైనుండి జలపాతపు హోరై
లోతులను చూసి,
సుఖించో, దుఃఖించో,
సుడిగుండాలలో తిరిగి,
మనసెండినపుడల్లా
క్రొత్త అర్ధాలకు యత్నిస్తూ,
ద్వీపాలకు తావిస్తూ,
కన్నీరై ఇంకుతూ…
గ్రీష్మానికీ,చలికోరల…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్