1. వానలా నీవు
వాన చినుకులు
నుదిటిన
కనులపై
పెదవులపై
తనువంతా
ముద్దుగా
గుచ్చుకునీ
విచ్చుకునీ
హత్తుకునీ
నీలా
2. ఐదు హైకూలు
నీటి అద్దాల
నీడలలో జగతి
వాన కానుక
పూలుతొడిగి
రాతిరి చెట్టు
నక్షత్రాలగొడుగు
నిద్రలో
పాపాయి నవ్వులు
అమ్మ పెట్టిన ముద్దులే
వచ్చింది నీవని
తలుపు తీసి చూస్తే
నీ తలపే
నీటి అలలై
ఆకాశం చెట్టూ పుట్టా
నవ్వుతూ వాన
బ్యూటిఫుల్..