‘ తాడికొండ కె. శివకుమార శర్మ ’ రచనలు

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఐదవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఐదవ భాగం

5

ఆ “యాక్సిడెంట్ ఇంపాక్ట్ డ్రైవర్ సైడ్ డోర్ ముందర అవడం చాలా అదృష్టం. అదే కొన్ని క్షణాల తరువాత అయ్యుంటే నిన్ను వంటినిండా గాయాల్తో చూడాల్సొచ్చేది!” అన్నారు మూర్తిగారు హాస్పిటల్లో హమీర్‌ని చూడ్డానికి వచ్చి.

రాత్రి పదకొండు గంటలప్పుడు జరిగిన ఆ యాక్సిడెంట్ స్థలానికి పోలీసులూ, ఆంబులెన్సూ, ఫైర్ ట్రక్కూ అయిదు నిముషాల్లోనే వచ్చినా, హమీర్‌ని బయటకు లాగడానికి గంటసేపు పట్టింది. ఆ ఇంపాక్ట్‌ని డోర్ హింజ్ వున్నచోట కారు ఫ్రేమే ఎక్కువ భరించినా, డోర్ కూడా వంకరపోయినందువల్ల అది తెరవడానికి సాధ్యమవలేదు. పైగా, అతని ఎడమ కాలు ఆ వంకర తిరిగిన కారు ఫ్రేములో ఇరుక్కుపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – నాలుగవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – నాలుగవ భాగం

4

“లెట్స్ గో ఫర్ ఎ బోట్‌రైడ్ ఆన్ ది పొటోమాక్ రివర్! దట్ వే యు డోంట్ హావ్ టు టీచ్ మి ఎనీథింగ్!” హమీర్‌కి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అమాని నుంచి డిసెంబర్ మొదటివారంలో. ఆమెకి వీలయినప్పుడే, ఆమె సూచనలని పాటిస్తూనే వుండాలి ఆమెతో తిరగాలంటే అని అతనికి ఎప్పుడో అర్థమైంది. మనిషి కనిపించకపోయినా గానీ కనీసం ఆమె గొంతు వినాలని అతనికి ఎంతవున్నా గానీ ఆమె అనుగ్రహిస్తేగా!

“ఎండాకాలంలోనో, స్ప్రింగ్‌లోనో, లేక ఫాల్‌లోనో అంటే అర్థముంది గానీ, ఈ చలిలోనా? పైగా, నీళ్లమీద ఇంకా చలిగా వుంటుంది,” జవాబిచ్చాడు.

“వాళ్లు బోట్లు నడుపుతూనే వున్నారుగా! అన్లెస్ యు…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మూడవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మూడవ భాగం

హమీర్ డెన్వర్‌నించీ వచ్చిన తరువాత అమానితో తరచుగా కలుస్తాననే అనుకున్నాడు. అయితే, అమాని అతని ఫోన్ కాల్స్‌ని ఎప్పుడూ ఆన్సర్ చెయ్యలేదు. అతనికి విసుగొచ్చి ఆమె గూర్చి ఆలోచించడం మానేద్దా మనుకున్నంతలో అక్టోబర్లో ఆమెనుంచీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది – “డూ యు వాంట్ టు డేట్?” అని.
“డేట్ హూ?” అని కోపంగా రిప్లై ఇద్దా మనుకున్నాడు గానీ, కొంచెం శాంతించి, “డోన్ట్ నో మచ్ అబవుట్ డేటింగ్!” అని జవాబిచ్చాడు.
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – రెండవ భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – రెండవ భాగం

2

డెన్వర్‌లో విమానం ఎక్కేముందూ, ఎక్కిన తరువాతా కూడా మీనా ఎయిర్‌పోర్ట్‌లో కనబడడం గూర్చి హమీర్ ఆలోచిస్తూనే వున్నాడు. కళ్లు మూసుకుంటే – యూనివర్సిటీ డైనింగ్ హాల్లో లైన్లో ఆమె వెనుక అతను … తరువాత ట్రేలో పిజ్జా పట్టుకుని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న ఆమె ముందు నిలబడి… డాన్స్‌లో ఆమెని రెండు చేతులతోటీ నడుము దగ్గర పట్టుకుని గాలిలో ఎగరేస్తూ, తిప్పుతూ… మెడ వెనుక ఆమె జుట్టుని చేత్తో పక్కకు తోసి చెవి వెనుక ముద్దు పెడుతూ …

లాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని అతను పనిచేస్తుంటే అతని జుట్టుని చేత్తో చెరిపేస్తూ ఆ ఒళ్లోనే వాలుతూ … కిచెన్…
పూర్తిగా »

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మొదటి భాగం

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – మొదటి భాగం

పక్కన ఐఫోన్లో అలారం మోతకి గబుక్కున మెలకువ వచ్చింది హమీర్‌కి. ఫ్లయిట్‌ని కాచ్ చెయ్యడంకోసం ముందుగా లేవడానికి అలారం పెట్టుకున్నాడన్న మాట నిజమే గానీ, అలా హఠాత్తుగా లేచేసరికి అతనికి తలకాయనెప్పి వచ్చింది. కలవల్లో లేక కంఫర్టర్ని కప్పుకుని వుండడంవల్లో గానీ బనీన్ చెమటతో తడిసిపోయింది. అది కల వల్లనే అనుకోవడానికి బలమైన కారణాలే వున్నాయి. ఎందుకంటే, ఆ కల సామాన్యమైనది కాదు. అది ఎవరి కయినా గానీ మెలకువ రాగానే ఆప్యాయంగా అక్కున చేర్చుకునే స్పర్శని అమితంగా కాంక్షించేలా చేసేది. శరీరంలోని నాడీ, తంత్రులనే గాక వాటికి మూలాలని కూడా గుర్తుచేసేది. అతని విషయంలో ఆ కోరిక మాటల కందనంత బలమైనదే గానీ,…
పూర్తిగా »

పెళుసైన అందం

పెళుసైన అందం

విక్రమార్కుడు మర్రిచెట్టుపైనుంచీ బేతాళుడి శవాన్ని కిందకి దించి భుజాన వేసుకుని నడవడం మొదలుపెట్టిన తరువాత బేతాళుడు, “విక్రమార్కా, నీకు శ్రమ తెలియకుండా భవిష్యత్తులోంచి పట్టుకొచ్చిన అనసూయమ్మగారి అద్దాల కథ చెబుతాను విను,” అని అతనికి “వద్దు!” అనే అవకాశా న్నివ్వకుండానే మొదలుపెట్టాడు.

***

“ఇప్పుడి దెందుకమ్మా?” అన్నారు శాస్తుర్లుగారు చదువుతున్న మంత్రాలనాపి. అటు చూడు – అన్నట్టు రాగిణిని మోచేత్తో పొడిచి శాస్తుర్లుగారివైపు చూపించాడు రఘు.

“మీక్కాదులెండి,” అని నవ్వి, “చదివింపు,” అన్నారొకళ్లు. (“అదసలు చదివింపే కాదు. వీళ్లలా ఆమెని ఆట పట్టిస్తుంటారు,” అన్నాడు రఘు రాగిణి చెవిలో.)

“ఇప్పుడేం చదివింపు? ఇంకా తాళి కట్టందే!” అన్నాడాయన చిరాగ్గానే అయినా కొద్దిగా…
పూర్తిగా »

డీటూర్స్

డీటూర్స్

“పనేరా బ్రెడ్‌కెళ్లి ఓ కప్పు కాఫీ తాగుదామా?” కారు వాషింగ్టన్ డల్లస్ ఎయిర్‌పోర్ట్‌నించీ బయటకు వెడుతున్నప్పుడు అడిగాడు మెహతా. సాయంత్రం అయిదుగంటల ప్రాంతం. అదే ఏడుగంటల తరువాత అయితే ఏదయినా బార్‌కెళ్లి బీర్ తాగుదామనేవాడేమో! సరేనన్నాను.

కారు హైవే ఎక్కిన తరువాత, “వేరార్యూ కమింగ్ ఫ్రం?” అడిగాడు. ” శాన్‌ఫ్రాన్సిస్కో నించీ,” చెప్పాను.

“నైస్ ప్లేస్. డూ యూ గో దేర్ ఆఫెన్?”

“నెలకోసారి – దాదాపుగా!”

“అయితే, హమీర్‌ని తరచుగా కలుస్తూంటారన్నమాట!”

“ట్రై చేస్తుంటాను.”

“ఈసారి కలిశారా?”

“ఏదీ, లాస్ట్ వీకెండేగా వచ్చెళ్లాడు? అందుకని వాడూ పెద్దగా పట్టించుకోలేదు, మొన్నెళ్లి ఇవాళ వస్తున్నాను గనుక వున్న ఒక్క రోజులో నాక్కూడా కుదర్లేదు.”

కాసేపు…
పూర్తిగా »

అక్కడక్కడా … ఒక్కడు

అక్కడక్కడా … ఒక్కడు

తాజ్‌మహల్ అందాన్నిచూసి తన్మయులైపోయేవాళ్లని, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో ఆలోచించమని శ్రీశ్రీ చెప్పారుగానీ, ఆ కట్టడంలోని అందంవెనుక బంధం మాత్రం ఎవరి ఆలోచనల్లోకీ అంత తొందరగా ప్రవేశించదు.

# # #

కనకధారాస్తవాన్ని వింటున్నప్పుడు ఫోన్ మోగడం వినిపించిందిగానీ, అది పూర్తి అయిన తరువాత మాత్రమే మా ఆవిడ నాతో సంభాషణ మొదలుపెట్టడం నా అదృష్టమనే చెప్పుకోవాలి. శంకరాచార్యుని సృజనాత్మకత నన్ను అబ్బురపరుస్తూంటుంది. ఆయన పుట్టిన కొన్నివేల ఏళ్ల తరువాత కూడా ఆయన స్తోత్రాల్లోని భాష సొబగులు, భావ సౌందర్యాలచేత ప్రభావితులయిన లక్షలమందిలో ఒకణ్ణయినందుకు గర్వపడుతుంటాను.

“సత్యనారాయణ గారమ్మాయి పెళ్లి లైవ్ చూపిస్తున్నార్ట కంప్యూటర్లో. ఆ పుస్తకాన్ని కాస్త పక్కనపెట్టి చూద్దురుగాని రండి!” అని…
పూర్తిగా »

డెడ్ మేన్ పేరడాక్స్

డెడ్ మేన్ పేరడాక్స్


పత్రికలలో వచ్చిన వార్తలు ఏమయినాగానీ, సత్యాది ఆత్మహత్యకాదు అని నేననుకోవడానికి బలవత్తరమైన కారణాలున్నాయి. అందులో మొదటిది, నా యాభయ్యేళ్ల సాన్నిహిత్యంలో వాడిదగ్గర పిరికితనం నాకు కనిపించకపోవడం. పులి మీదకు దూకితే వాడేంచేసేవాడో తెలియదుగానీ, వెన్నుమాత్రం చూపించడని నేను కరాఖండీగా చెప్పగలగడానికి ఒక కారణం నేను పక్కనున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. న్యూయార్క్ సబ్వేలో ఒక నల్లవాడు తుపాకీని వాడి నడుముకానించి వాలెట్ని ఇమ్మన్నప్పుడు, ప్రశాంతంగా దాన్నివ్వడమేకాక, “డబ్బులు తీసుకుని, వాలెట్ నాకు తిరిగిచ్చెయ్, అందులో డ్రైవర్స్ లైసెన్స్ కావాలి, అది లేకపోతే ఆ మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంటుకి వెళ్లడం కోసం అనవసరంగా ఒక వర్క్ రోజు వేస్ట్ చెయ్యాలి,” అని…
పూర్తిగా »

సాంత్వనములేక

సాంత్వనములేక

“మోహ్.” ఇందాక డ్రైవర్స్ లైసెన్స్ తీసుకెళ్ళాడుగదా, పేరు చూడకుండా ఎందుకుంటాడు?

“మో?”

అక్కడి కొచ్చేవాళ్ళకి జీవితాలమీద ఆశ వుండకూడన్నట్లుగా పెయింటింగులూ, ఫోటోలూ లేకుండా కావాలనే నిర్జీవం చెయ్యబడ్డట్లుగా వున్నది ఆ గది. ఆ గదిలో మోహ్‌తోబాటు ఒక తెల్ల అమెరికన్ మాత్రమే వున్నాడు. తోడుగా మాత్రం కాదు. ఎదురుకుండా వున్న అతడిని తేరిపారజూశాడు మోహ్. తెలుగు సినిమాలో చూపించే ఇంటరాగేషన్ దృశ్యాలు గుర్తొచ్చి మోహ్ వెన్ను జలదరించబోయి ఆగిపోయింది.

“మోహ్” – ‘హ్’ని వత్తి పలికాడు మోహ్.

“లైక్ లారీ, కర్లీ, మో?”

ఆ ప్రశ్న సుందరం గొంతులో ప్రతిధ్వనించింది. పేరులోనే సుందరం. మనిషి మాత్రం నల్లగా, మొహమ్మీద స్ఫోటకపు మచ్చలతో ఎత్తుపళ్ళతో కలలో కొచ్చేలా…
పూర్తిగా »