‘ నారాయణ గరిమెళ్ళ ’ రచనలు

ప్రకృతీ, ప్రేమల ఆత్మీయ నెమరువేత: పునశ్చరణం

డిసెంబర్ 2014


ప్రకృతీ, ప్రేమల ఆత్మీయ నెమరువేత: పునశ్చరణం

కొన్ని మాధుర్యాలుంటాయి. ఎలా అంటే- అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తడిమి తడిమి అదే పనిగా చూసుకోవటం, పరాయి దేశంలో అనుకోకుండా కలిసిన చిన్ననాటి ఆప్తమితృడిని తరచి తరచి ఆనంద పారవశ్యంలో పరామర్శించడం, ఏళ్ళకు ఏళ్ళు ప్రియురాలికి దూరమైన ప్రేమికుడు ఆమెను కలిసినప్పుడు పదే పదే ఆలింగనం చేసుకోవడం వంటి తన్మయత్వము కల్గించే విషయాలు. ఇంతటి గొప్ప మాధుర్యాన్ని కొందరు ‘మనసుపెట్టి ఇష్టంగా పూర్తి చేసిన పనిలోనూ, హృదయ పూర్వకంగా వ్రాసిన కవితలోను, సర్వస్వమూ లగ్నం చేసి ప్రదర్శించిన కళ వంటి విషయాల లోను, ముఖ్యంగా వాటి పునశ్చరణము (పునర్-సందర్శనం) లో పొందగలరు. అంకిత భావంతో నిర్వహించిన పనులకున్న విశేషణము అంతటిది. తిరిగి సందర్శించినప్పుడు మాధుర్యాన్నిచ్చే…
పూర్తిగా »

స్వప్న దారీ జీవితమే జీవనం… వనం…

స్వప్న దారీ జీవితమే జీవనం… వనం…

నిజంగానే
స్వప్నాలు లేని ప్రయాణాలు ఉండనే ఉండవు

జీవితాన్ని
స్వప్న దూరాలలో మాత్రమే
కొలవడం సాధ్యమని తెలిశాక కూడా
స్వప్నాలు లేకుండా ఎలా ఉంటాయి?

మనిషి త్రోవలని ఎన్నిసార్లు తడిమినా
మిణుకు మిణుకు మిణుగురుల్లా
స్వప్నాలు ఆశగా కనిపిస్తూనే ఉంటాయి

ఒక్కోసారి
కొన్ని స్వప్నాలు కిందనపడి రాలిపోవచ్చును
మరికొన్ని అమాంతంగా పగిలి ముక్కలైపోవచ్చును
చేతికంతనంత దూరాలకు చెల్లాచెదురైపోవచ్చును
అంత మాత్రం చేత కొత్తవి మొలకెత్తడం మానేయకూడదు.

స్వప్నాల సేధ్యం లో ప్రతినిత్యం
మనిషి
ఆరితేరి పోవాలి
మైమరచి పోవాలి

మొక్క మొక్కకూ ప్రయాణిస్తూ
నీరు పోసినట్టూ,…
పూర్తిగా »

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

కవిత్వం నాకేమిస్తోంది? 

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని…
పూర్తిగా »

జీవితం చాలా చిన్నది

జీవితం చాలా చిన్నది

పరుగెత్తి పాలు తాగే పాకులాటలకి
నిలబడి నీరు తాగే నిరడంబరాలకీ
జాగింగ్ చేస్తూ జావ తాగొచ్చని
చేసి చూపించేయ్..

కొరడాతో తనే కొట్టుకు ప్రదర్శించే
నడివీధి గాడి నుండి అందుకుని
కొట్టుకుంటుంటే భుజాలెగరేసుకు పండగ చేసుకునే
వాళ్ళందరినీ అలా వదిలేసెయ్..

ఇంద్రధనుసునొకటి అందిపుచ్చుకుని
రంగురంగుల రిబ్బన్లు తుంచి
ఆడపిల్లలందరకూ పంచిపెట్టేసేయ్.
జడలలో వాలమని సీతాకోకలకు కబురెట్టేసేయ్..

బతికించే ప్రాణవాయువూ
ఊపిరులూదే మనుషులు పరిసరాలు పరిస్థితులూ
ఎక్కడ కనిపించినా
మట్టి నీరులతో నేసిన శాలువాలు కప్పి మరీ సన్మానాలు చేసేసేయ్..

నిలువెత్తులను కూల్చడం కన్నా
నిలవలుంచే కట్టడాల మీదే…
పూర్తిగా »

ఉష్ణోగ్రత

02-ఆగస్ట్-2013


నిఖార్సైన అత్యల్ప ఉష్ణోగ్రత (అబ్సల్యూట్ జీరో) అది..!!
ధృవాలనే ఆశ్చర్యపరిచే టండ్రాతి టండ్రాల స్థితి…!!
అత్యంత లోపరహిత అసాధారణ స్థితి…!!

గది నుండి విడివడి
నిదానంగా అక్కడకు పోతే…
చేయి మొదలు కాలి వేళ్ళ వరకు
శరీరం నిలువెల్లా
కొంకర్లు పోతూ పోతూ
ఒక్కసారిగా
రాతి పుల్లగా మారిపోయే ఘన-ఘనీభవనం….

అక్కడ
పదార్ధాలన్నీ
లోపాల్నివదులుకుంటూ పోయి
సర్వసంగ పరిత్యాగులౌతాయట!
పరమాణువుకీ పరమాణువుకీ
మధ్య ఎడం పూర్తిగా పోయి,
తల్లినంటి పెట్టుకుని పడుక్కున కుక్కపిల్లలౌతాయట!

***

పరమాణు-కంపనాలు కూడా ఉడిగిపోయి
చుట్టూ పరిభ్రమించే ఋణావేశ కణాలు…
పూర్తిగా »

బలీయమైన అనుభూతిని కేంద్రీకరించి చెప్పడం కవిత్వ లక్షణం

బలీయమైన అనుభూతిని కేంద్రీకరించి చెప్పడం కవిత్వ లక్షణం

(డా. వైదేహి శశిధర్ గారితో ముఖాముఖం – డా. నారాయణ గరిమెళ్ళ)

‘నగరమంతా నిద్రించే సమయంలో……తదేకంగా, చంద్రుడిని చుట్టేసిన చుక్కలను లెక్కపెట్టుకుంటూ…అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అనుకోకుండా ప్రవాసం వరకూ చేరి పోయాక….’అరే దారి తప్పి పోయానేమో?’ అని ఆశ్చర్యపడి; అంతలోనే, ఆ పరిసరాలకు అలవాటు పడుతూ… అక్కడి ప్రకృతిని దర్శించి, వానలో తడిసి, మంచు పూలను పదిలంగా ఏరి మూట కట్టుకుని….. తిరిగి వెనుకకు అమ్మ-వడి లాంటి మాతృభూమిని చేరుకుని అక్కడ అందరికీ తన జ్ఞాపకాల సంపదను పంచి ఇచ్చే ప్రయాణాల ఊయల డాక్టర్ వైదేహి శశిధర్ గారి కవిత్వం. వెన్నెలలో ఉయ్యాలలూగుతూ కబుర్లు చెప్పుకున్న బాల్యమంత అహ్లాదంగా కవిత్వీకరించడం ఆమె శైలి. తీరిక…
పూర్తిగా »

ఆవు-పులి…2013

ఫిబ్రవరి 2013


ఆవు-పులి…2013

విశాలమైన గడ్డి బీడు లో ఆదమరచిపోయి మరీ మేస్తోంది ఆవు.

అప్పుటికే బీడంతా అనేకసార్లు కలియతిరిగిన పాలేరు రంగడు ఆవు దగ్గరకి చేరుకున్నాడు.

దానికి భయమనిపించకుండా, సుతారాంగా తట్టి, గంగడోలు రాస్తూ అనునయంగా చెప్పడం మొదలు పెట్టాడు.

వాడి వయస్సు ఇంచుమించు పదహారేళ్ళు ఉంటుంది. ఎనిమిదో తరగతి వరకూ చదివాక, తండ్రి బలవంతం మేరకు చదువాపేసి ఆ ఊరి-పెద్ద చంద్రయ్య ఇంటిలో పాలేరు గా చేరిపోయాడు. ఆ మాత్రం చదువుకే వాడి నడకలోను, నడతలోనూ పరిణితి వచ్చి అది మాటల్లోను చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది.

“నీకు తెలియదని కాదు. ఐనా సరే మరోసారి చెబుతున్నా విను…” అని మొదలు పెట్టి, ఆవు…
పూర్తిగా »

పాటల పినలగర్రా… పాడూ!

ఫిబ్రవరి 2013


పాటల పినలగర్రా… పాడూ!

ఆర్. రామకృష్ణ గారి, పినలగర్ర కవితా సంపుటి 1986 నుండి 1999 ల మధ్య వ్రాసిన 36 కవితల సమాహారం. పినలగర్ర అంటే (ఉత్తరాంద్ర లోని బొబ్బిలి ప్రాంతానికి చెందిన మాండలికం ప్రకారం) పిల్లనగ్రోవి.  మూగ వారు లేదా మురళి-ఊదే-కళాకారులు తమ హృదయ-భాషని లేదా హృదయ-ఘోషని పంచుకోడానికి ఉపయోగించే పిల్లనగ్రోవిని శీర్షికగా తీసుకోవడంతోనే ఈ కవితలలో హృదయాంతరాల సందేశమేదో కవి దాచి ఉంచారని అనిపిస్తుంది.

పొలం దున్నుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన లో మాధుర్యం;  దుక్కి దున్నే రైతు చిందించే స్వేదజలం వెనుక వున్న విలువ, అందులోని శ్రామిక సౌందర్యం;  పొలం పనికి పసి బిడ్డను ఇంటిదగ్గర వదిలి వచ్చిన తల్లిపడే మానసిక వేదన;  పల్లె…
పూర్తిగా »

ఆట-విడుపు

ఎక్కడ చూడు…!
ఆ రెండే….!

భూతద్దం పెట్టి చూసినా,
కళ్ళద్దాలు పెట్టుకుని కదిపి చూసినా
అసలు ఏ అద్దాలు లేక పోయినా కూడా……

మామూలు కళ్ళకి, మసక కళ్ళకి, గుడ్డి కళ్ళకి కూడా
నానో నుండీ పర్వత పరిమాణం వరకూ
చిమ్మ చీకటి దేవులాటల్లో సైతం
కొట్టొచ్చినట్టు మరీ ఆ రెండే కనిపిస్తుంటాయి

‘ఒక పై చెయ్యి’,
‘ఒక కింద చెయ్యి ‘.

పై చెయ్యెప్పుడూ హుకుం జారీ చేస్తానంటుంది
మీసం మెలేస్తుంటుంది.
కిందది బానిసలా పడుండి
కిందనే,
కింద కిందనే అణిగిమణిగి ఉండాలంటుంది.

ఒకవేళ, ఎప్పుడైనా ఎప్పటికైనా

పూర్తిగా »