‘ ముకుంద రామారావు ’ రచనలు

ఓరియో స్వగతం

ఓరియో స్వగతం

ప్రపంచవ్యాప్తంగా
కుక్కలెన్ని లేవు
ఏ కుక్క ఎక్కడికి చేరుతుందో
ఎవరికి ఎరుక
నేనూ అంతే
ఎక్కడో చైనా సంతతి నాది
అమ్మను చూసిన జ్ఞాపకం తప్ప
నాన్నెవరో నాకు తెలియదు
చల్లటి పచ్చిక ప్రాంతంలో పెంచి
ఎవరో నన్ను పెంచుకుందా మంటే
వారికి ఎందుకిచ్చారో కూడా తెలియదు

అయితేనేం వారిది
గొప్ప ఇల్లు
నాకు ప్రత్యేకమైన తిండి వైద్యంతో
వారు నన్ను ప్రేమగా చూసుకున్నారు
బయట వాతావరణం ఎలా ఉన్నా
క్రమం తప్పకుండా నన్ను షికారుకు తీసుకుపోయేవారు
బయటకు…
పూర్తిగా »

తగవు

అతనినీ ఆమెనీ
వారి పెంపుడు కుక్క చూస్తూనే ఉంది

ఎప్పటినుంచో వారు
ఒకరి మీద ఒకరు అరుచుకుంటూనే ఉన్నారు

వారిలో ఎవరు ముందు మొదలెట్టారో
ఏ కారణంతో మొదలయిందో
ఇద్దర్లో ఎవరికీ తెలియదు ఎప్పుడూ
తెలిసినా ఎవరూ ఒప్పుకోరు

విసిగిపోయి ఆమెకు ఆపేయాలనున్నా
అతను రెచ్చిపోతాడని అనుమానం

అతనికీ ఎక్కడో ఆగిపోదామని ఉన్నా
అలుసై పోతాడన్న భయం

ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేసుకుని
ఒక ప్రపంచం నుండి అతను
మరో ప్రపంచం నుండి ఆమె
శబ్దాల్ని నిశ్శాబ్దాల్నీ
విసుగులేకుండా విసురుకుంటూనే ఉన్నారు

చూసి చూసి
వారిద్దరి మధ్యకూ పోయిపూర్తిగా »

తెరిచిన తలుపులు

13-డిసెంబర్-2013


తెరిచిన తలుపులు

ప్రపంచం తలుపులన్నీ తెరిచే ఉన్నాయి
నువ్వు కొన్ని తెరిచుంటావు
నేను కొన్ని తెరిచాను
మనిద్దరం కలిసి ఎన్ని తెరిచామో
తతిమావి ఎవరెవరు తెరిచారో

పూర్తిగా »

ఏకాంతమది

ఏకాంతమది

అడవిలోని చెట్టులా
కొమ్మమీద పూవులా
నేను

అయినా రాత్రిలా
ఏకాంతంలోకి నిన్ను నెట్టలేను
ఏకాంతాన్ని నీతో పంచుకోనూలేను

అది నీకోసమో నాకోసమో
ఆనందమో విషాదమో
నాకూ తెలీదు

నాకు నేనుగా
నాలో సంలీనమై
ఏకాంతమైపోతాను
ఒద్దొద్దు
నువ్వందులో భాగంకావద్దు

నా ఏకాంతం నాది
నీ ఏకాంతం నీది
ఏకాంతాన్ని ఎవరు పంచుకోగలరు చెప్పు


పూర్తిగా »

రాయాల్సింది ఇంకా రాయనేలేదు

05-ఏప్రిల్-2013


రాయాల్సింది  ఇంకా రాయనేలేదు

కవిత్వానికీ వయసు వేడికీ ఎంతో  కొంత చుట్టరికం వుండే వుంటుంది. చాలా మంది కవిత్వం అనగానే కాలేజీరోజుల కుర్రకారులోకి వెళ్లిపోతారు. కానీ, వొక కవి లేటు వయసులో ఘాటుగా కవిత్వ ప్రేమలో పడితే…! కవిత్వ సహజమైన ఆవేశ తీవ్రతా, నెమ్మదిగా నిదానిస్తున్న వ్యక్తిత్వ సమతౌల్యమూ వొక చిత్రమయిన రేఖ దగ్గిర కలిసిన  ఉదాత్తమయిన సన్నివేశం ఏదో కనిపిస్తుంది. అంటే, ఆవేశతీవ్రత తగ్గిపోతుందని  కాదు…చెప్పాల్సిన విషయంలో చెప్పే విధానంలో వొక ఆనుభవికమైన సొగసేదో కనిపిస్తుంది. ముకుంద రామారావు గారి కవిత్వంలో వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా అలా అనిపిస్తుంది.

స్నేహితుల హృదయాల్లోకి  ‘వలస’ వెళ్ళే మందహాసం. ప్రతిక్షణమొకమజిలీగా మలుచుకునే శాంత కెరటం…ముకుందరామారావు.

తక్కువ రాస్తూ తక్కువ మాట్లాడుతూ…
పూర్తిగా »

అన్నా అఖ్మతోవా

అన్నా అఖ్మతోవా

ఆనా ఆఖ్మతోవా (23 జూన్ 1889 – 5 మార్చి 1966) రష్యన్ సాహిత్యంలో ప్రముఖ కవయిత్రి. ఆమె అసలు పేరు ఆనా అండ్రెయేవ్నా గోరెంకో. 11 ఏళ్ల ప్రాయం నుండి కవిత్వం రాయడం మొదలెట్టారు. కవిత్వం మూలాన, ఇంటిపేరుకు అపకీర్తి తీసుకురావద్దన్న తండ్రి కోపానికి, పదెహేడేళ్ల ప్రాయంలోనే, ఆనా ఆఖ్మతోవా గా మార్చుకున్న పేరే చివరివరకు స్థిరపడిపోయింది. ఆ పేరు ఆమె తల్లి ముత్తాతది. అప్పుడొస్తున్న కవిత్వంలోని గూఢత్వం, అస్పష్టత, సాంకేతికత, కృత్విమత్వాన్ని నిరసిస్తూ, సౌందర్యం, స్పష్టత, సాంద్రత, సరళత, సమగ్ర రూపంతో కూడుకున్న విభిన్న కవిత్వానికి ఆద్యుడైన నికోలయ్ గుమిల్యొవ్ ని 1910 లో వివాహం చేసుకున్నారు. 1918 లో విడాకులూ తీసుకున్నారు.…
పూర్తిగా »

లిఫ్ట్

నాముందు మోకరిల్లి
పైకి చేరాలనో
కిందికి పోవాలనో
ఎవరో ఒకరి
ఎదురు చూపులే

తయారై వచ్చాక
ఎవరికి వారు నమ్మకంతో
నాకు బందీలవుతారు

ఎలా కావాలంటే అలా
తీరికలేకుండా చేరుస్తూనే ఉన్నా
హఠాత్తుగా ఎక్కడో ఆగిపోతే
సరిహద్దుల్లో ఉండని సహనం

ఎవరు నానుండి విడిపిస్తారో
ఎపుడు బయటపడతారో
ఎవరి ప్రయత్నాలు ఏపాటివో

బయటపడ్డాక వెంటనే
నిర్జీవమైన మొహాలు
నిర్లిప్తమైన గుంపులో కలిసిపోతాయి

అయితేనేం
ఎప్పట్లానే మళ్లీ నాముందు
అదే ఆబగా

*
ఏకాంతమది
అడవిలోని చెట్టులా
కొమ్మమీద పూవులా

పూర్తిగా »