‘ రఘు మాందాటి ’ రచనలు

గజల్

గజల్

‘అప్పటికే ముగ్గురొచ్చారు. దాని ఒళ్ళంతా నీరసంగా ఉంది బాబు. అది చిన్న పొల్ల ఏదో పొట్ట కూటికే మా తిప్పలు గాని, దాని ఒళ్లమ్మి మిద్దెలు కట్టాలని నాకు లేదు నాయన. ఈ పొద్దుకు దాన్ని వొదిలెయ్..’
‘లేదండి నేను తనని ఇబ్బంది పెట్టను. కాసేపు తనతో మాట్లాడి వెళ్తాను.’
‘సరే అది పడుకుంది. అదో ఆ గదిలో..’
మక్కా పావురాలు ఇక్కడదాక వస్తాయి కాబోలు. గోడలు మొత్తం రెట్టలమయం. పాతికపైనే గురుకు గురుకుం అంటూ గూన పెంకుల చివర కొనలను, బట్టలారేసే దండాలను తాపీగా ఆక్రమించేసుకొని, నైజం ఆనవాలని కొద్దో గొప్పో చాటి చెప్తూ, శిధిలానికి చేరువలో, నవీనానికి దూరంలో,…
పూర్తిగా »

చనిపోవడమంటే?

14-జూన్-2013


చనిపోవడమంటే?

నా గతం తో ముడిపడిన విషయాల్లో చావు కూడా ముఖ్య పాత్ర వహించింది..

నా చిన్నప్పుడు అందరిల్లలో ఎప్పుడో ఒకసారైన శుభకార్యానికి సన్నాయి మేళం మొగుతుండేది. కాని మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పే.. మా బాపుని మా బాపమ్మ తాతయ్య దత్తత తీసుకున్నారు మా తాత వాళ్ళ అన్న దగ్గరినుండి.

ఆ రకంగా మా బాపు తరపున నాకు ఇద్దరు తాతయ్యలు ఇద్దరు బాపమ్మలు ఎం జరిగిందో ఏమో నాకు ఊహ వచ్చే సరికి మేము బాపు పుట్టిన ఇంట్లో ఉన్నాం..

ఇక మా బాపమ్మకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమంటే డబ్బా నిండా కిరోసిన ఒంటి పై పోసి కాల్చే అంత..…
పూర్తిగా »

పోయిన ఉగాదికి…

పోయిన ఉగాదికి…

నేను పుట్టక ముందే మా పాలోల్లాయన కొత్త కుండని సైకిల్ మీద పట్టుకొస్తుంటే దేనికో తగిలి పగిలిందంట. కుండ పగలటంలో సోధ్యం ఏముంది. అని ఎవ్వలైన అనుకుంటారు కాని గక్కడ్నే మొదలయింది ముచ్చటంత. ఆ కుండ పగలడం సంగతి జూషినోల్లు చెవులు కోరుక్కోవడంతో నిమిషంలో గల్లి గల్లంత పాకింది.

ఒక్కో ముసలోడు ఒక్కో మాట అన్నాడు. అమ్మమ్మలు, అమ్మలక్కలంత అయ్యో అయ్యో అన్నారు. గిదంత కాదు గాని పంతులు దగ్గరికి పోతేనే ఏం జేయాల్నో ఎర్కైతది అనుకొని కుల పెద్దలంత కలిసి పంతులు గార్ని కలిసి జరిగిన ముచ్చటంత అప్పజెప్పిండ్లు. నొసలు చిట్లించి ఏవో బొక్కులు ముందేసుకొని తిరిగేసి తిరిగేసి ఒక్క ఇషయం తెగేసి సెప్పిండు.…
పూర్తిగా »

శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఏప్రిల్ 2013


శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఇంగ రేప్పొద్దున పండగని తెల్వంగనే మా ఇస్కూలు దోస్తులవందరం కట్ట గట్టుగొని సైన్సు టీచర్ రాకపోయేసరికి కితాబులను సంచిలోకి ఎట్టి కిలాసు గలాసు లేదన్నట్టు కూసోని ప్లాన్ల మీద ప్లాన్లు ఏసుకొని గుండం వాడ అఫ్జలు, అర్షద్, డబ్బకాడి అమ్జదు దుదేకుల అఫ్సరు, కాకతీయ కాలని రవిగాడు, ఆరిఫ్ గాడు, ముడ్డబ్బాల కాడి హరి గాడు, ఇంకా నలుగురవైదుగురం ఒక్క ముచ్చటకొచ్చినం రేపు మాత్రం ఫుల్లుగా శివరాత్రి పండుగను పండగ జేసుకొవాల్నని. ఇంకేవుంది రవి గానికి ఆరిఫ్ గానికి సైకిల్ ఉండనే ఉండే ఇంగ నాకేం రంది ఊరంతా తిప్పి ఆల్లే ఇంట్ల పడగొడ్తారు అనుకొని ఇగ నేను గూడ సై అన్న.

ఆ రోజుకూడా…
పూర్తిగా »

నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

ఫిబ్రవరి 2013


నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

పూర్తిగా ఆవహించిన చీకట్లో వెలుగుతున్న ముసలి దీపం ముందు పెట్టుకొని మట్టి నేలపై సంచి పరుచుకొని పుస్తకాలను ముందేసుకొని, ఇక అన్నయకి తెలియకుండా తన తెల్ల నోటు బుక్కులోనుండి చింపుకున్న ఓ మూడు జంట కమ్మలు నెమ్మదిగా మడతలు పెడుతూ అరచేయి సైజు లో కత్తిరించుకొని పెన్సిల్ తో తోచిన బొమ్మలు గీయడం మొదలుపెట్టా.  ఓ ముప్పై వరకు తయారయ్యాక ఒక్కో బొమ్మకి పక్కన వదిలిన ఖాళీస్థలం లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ నేస్తం రఘు అని రాసి రేపటికి సిద్ధంగా ఉంచుకోనేవాన్ని.

ఎంత ఇంగ్లీష్ పండగైన మా బోటి పిలగాండ్లందరికి చిన్నపాటి పెద్ద పండగే.. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు. మా…
పూర్తిగా »