‘ వి. మల్లికార్జున్ ’ రచనలు

ఆ ఒక్క మనిషి

‘‘అర్జున్‌.. అర్జున్‌.. అర్జున్‌..’’ అని ఎవరో పిలిచినట్టనిపిస్తుంది. అర్జున్‌ లేచి కూర్చుంటాడు. తెల్లారినట్లు అనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరక్కడ. ఎవరు పిలిచారో అర్థం కాదతడికి. ఆరోజుకి తన జీవితంలో ఉన్న మనుషుల గొంతులన్నీ ఆ పిలిచిన గొంతుకి మ్యాచ్‌ చేస్తూ పోతాడు. ఏదీ మ్యాచ్‌ అవ్వన్నట్టు అర్థమవుతూ ఉంటుంది. ఎవరిదై ఉంటుంది ఆ గొంతు? గతంలోకి వెళతాడు. ఆ గొంతును మ్యాచ్‌ అయ్యే గొంతును వెతుకుతూనే ఉంటాడు. దొరుకుతుంది. ఒక్కసారిగా ఏడుస్తాడు. వెంటనే ఏదో లాగినట్టనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. మళ్లీ ఏడుస్తాడు. వెంటనే ఎవరో లాగినట్టనిపిస్తుంది. వచ్చి మళ్లీ ఇక్కడే పడిపోతాడు.

***

ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాల…
పూర్తిగా »

పాప్‌కార్న్

అక్టోబర్ 2017


జీవీకే వన్ మాల్..

మధ్యాహ్నం మూడవుతోంది. కానీ అప్పటికే సాయంత్రం ఆరు దాటి చీకట్లు పడుతుందన్నట్లు ఉందక్కడ. వర్షం పడేలా ఉంది. అప్పుడే మాల్‌లోకి అడుగుపెడుతోన్న అర్జున్‌కు టికెట్ కౌంటర్ దగ్గర కనిపించింది రమ్య. ‘తనేనా?’ అని చూస్తూ అక్కడే ఆగిపోయాడు. టికెట్ తీస్కొని వెనక్కి తిరిగిన రమ్య, ఎదురుగా నిలబడి ఉన్న అర్జున్‌ను చూసింది.

ఆమె కళ్లు మెరిసాయి అర్జున్‌ను చూడగానే.

‘‘ఇక్కడ..?’’ అడిగాడు.

నవ్వింది.

‘‘రెండళ్లయింది మనం కలిసి!’’ అలాగే చూస్తూండిపోయిన అర్జున్‌ను కదిలిస్తూ మాట్లాడింది రమ్య.

‘‘యా! రెండేళ్లయిపోయింది’’ నవ్వాడు అర్జున్.

‘‘సమాధానం చెప్పలేదు.. ఇక్కడ..?’’ తన మాటలను కొనసాగిస్తూ మళ్లీ అడిగాడు.

‘‘పనుండి వచ్చా. ఫ్రెండ్ ఈవినింగ్ వస్తాని చెప్పి…
పూర్తిగా »

తను-నేను

తను-నేను

తల గిర్రున తిరుగుతోంది. దాంతో పాటే కళ్ళూ. మెల్లిగా మూతలుపడుతున్న కళ్ళ ముందు దానంతట అదే తెరుచుకునే ఎలక్ట్రానిక్ డోర్ గుండా వస్తూ కనిపించిందామె. నీలం రంగు డ్రెస్ వేసుకుందన్న విషయం తప్ప మరేదీ కనిపించలేదు. అంతా మసక మసకగా ఉంది.

కళ్ళు పూర్తిగా మూతలు పడ్డాయి. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందామె. ఎంతందంగా ఉందీ!?

రిసెప్షనిస్ట్‍ను ఏదో అడిగి వచ్చి, పక్కనే కూర్చుంది. ఇప్పుడింకా అందంగా ఉంది.

5, 10, 15, 20.. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి. రాని మెసేజ్ కోసం ఈ గ్యాప్‍లో ఓ పదిసార్లు ఫోన్ చూసుకొని ఉంటా. ఆమెను చూడ్డం కోసమే! ఒకమ్మాయిని చూడ్డమంటే, చూడ్డమనే పనితో…
పూర్తిగా »

కారు చెప్పిన కథ

కారు చెప్పిన కథ

ప్రతీవారంలానే ఈ వారమూ ఊరికని బయలుదేరా. ప్రపంచంలో నన్ను అత్యంత సంతోషపెట్టేదేదైనా ఉందంటే.. అది కచ్చితంగా మా ఇల్లే. అదేంటో మనం వెళ్తున్నామనగానే వెళ్ళాల్సిన ప్రదేశానికి సంబంధించిన గాలి మహత్తేదో ఇక్కణ్ణుంచే పని చేయడం మొదలుపెడుతుందనుకుంటా.. ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. రాత్రంతా నిద్ర లేకున్నా కళ్ళు ఎర్రబడవ్, పొద్దుణ్ణుంచి ఏం తినకున్నా ఆకలవదు, చేరాలనుకుంటున్నదీ , చేరేదీ అక్కడికే అన్న విషయం తెలిసి కూడా ప్రతీసారీ, క్రమం తప్పకుండా ఇలాగే జరుగుతుంటుందెందుకో?

రెండు సిటీ బస్సులు మారాక.. ఊరికి పోయే బస్సందుకున్నా. ఎల్బి నగర్ దాటిన బస్సు వేగంగా దూసుకెళుతోంది. గంట క్రితం దూరంగా ఉన్న జనాలకీ, గంట ప్రయాణం…
పూర్తిగా »