‘ హెచ్చార్కె ’ రచనలు

నిద్రాహారాలు

జూన్ 2017


నిద్రాహారాలు

అది యిది అని కాదు
యేదయినా ఫరవా లేదు
కుంచెం అన్నం కావాలి
కప్ప కాళ్లతో చేసిన కూరయినా
యే జంతువు మాంసమయినా
అన్నం తిని యెంచక్కా నిర్భయంగా
పీడకలల్లేకుండా కాసేపు నిద్దరోవాలి

యిప్పడు యీ యిళ్లన్నీ వున్న చోట్లలో
వొకప్పడు యిళ్లు లేవు
చిన్నవీ పెద్దవీ గుడిసెలు కూడా లేవు
పొదలలో కుందేళ్లు బిక్కుబిక్కుమనేవి
చెట్ల మీద కొండచిలవలు జారుతుండేవి
యెండుగడ్డిలో చిరుతలు పొంచి వుండేవి

అప్పుడూ యిదే యావ
కుంచెం అన్నం పచ్చి పచ్చిదే మాంసం
యే జంతువుది అని చూసుకున్నానా

పూర్తిగా »

మీడియా… సోషల్ మీడియా

మార్చి 2017


మీడియా… సోషల్ మీడియా

ఇవాళ అచ్చు పత్రికలు ఎలా వున్నాయో ఒకసారి చూడరాదూ. తెలుగు నాట ఒక కులానికి, ఆ కులానుకూల రాజకీయాలకు సేవ చేసి తరించేవి కనీసం రెండు పత్రికలున్నాయి. ఇంకో కులానుకూల రాజకీయం కోసం ఒక పత్రిక. మరొకటీ వుంది గాని అది కేవలం న్యూస్ ప్రింటు వ్యాపారి. ఇవి కాకుండా తెలుగు నాట పత్రికలున్నాయా? ఆఁ ఇంకొకటుంది. ఒక కులం వాళ్ల వుద్యోగాల కోసం. ఒకాయన, ఫరినస్టెన్స జగన్ మాట్లాడిందేమిటో తెలుసుకోవాలంటే కనీసం రెండు పత్రికలు చదవాలి. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివి తక్కువతనం మాత్రమే వుంటుంది. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివితేటలు మాత్రమే వుంటాయి. దానికి తగినట్లు ఫోటోలు, కార్టూన్లు వుంటాయి.
పూర్తిగా »

అడివి పిలుపు

ఫిబ్రవరి 2017


అడివి పిలుపు

పొద్దట్నించీ
విసురు గాలి
కిటికీ తెరవమని గోల చేస్తోంది
నిరుటిదే
ఈ ఏడాది మళ్లీ
అదే హోరు
ఒక ప్రాచీన సముద్రానిది
పూర్తిగా »

ఏ వాదం లేని వారెవరు?

ఆగస్ట్ 2016


ఏ వాదం లేని వారెవరు?

స్తీవాద, దళిత వాద, శ్రామిక వాదాల రూపంలో స్త్రీలు, దళితులు, శ్రామికులు తమ తమ బంధనాల నుంచి విముక్తి కోసం పోరాడుతున్న కాలంలో ఇస్మాయిల్ జీవించారు. తను ఆ సంగతులేమీ మాట్లాడకపోగా… స్వేచ్ఛకు వున్న పరిమితులను రొమాటిసైజ్ చేయడం ద్వారా…. ఇస్మాయిల్ యొక్క ‘శుద్ధ ఆనందవాదం’ శిష్ట వర్గానికి (బ్రాహ్మణ వాద, పిత్రు స్వామిక వాదులతో సహా శిష్ట వర్గానికి) పసందుగా వుంటుంది. వారితో చాల త్వరగా ‘వహ్వా’ అనిపించుకుంటుంది. స్త్రీలు, దళితులు, శ్రామికులు విసురుతున్న సవాళ్లను… అవి పచ్చి బౌతిక వాంఛా (వల్గర్ మెటీరియలిస్టిక్) వాదాలుగా తిరస్కరించడానికి వుపయోగపడుతుంది. కొందరు కవులూ రచయితలు జీవితం విసిరే ప్రశ్నలను తప్పించుకుని తమ సుఖం తాము చూసుకోడానికి…
పూర్తిగా »

నా రాం చిలక

జూన్ 2016


రాత్రంతా వాన కురుస్తున్నట్టే వుంది
ఇక్కడ చిక్కడిపోయాను నేను
ఆమె వచ్చిందేమో మా చెట్టు కిందికి
తీగె మీద పిచ్చుక తెగ అరుస్తోంది
అది అక్కడి నుంచే వచ్చుంటుంది
దాని రెక్కలు పొడి పొడిగా వున్నై
రాత్రి వాన కురిసింది బయట కాదేమో
నా ఆరాటమే గాని ఆమె రాలేదేమో
వచ్చి నుంచోడానికి ఆ చెట్టు లేదేమో
రాత్రని ఏమిటి, పగలని ఏమిటి
వాన నిరతం కురుస్తూనే వుంటుంది
తాగుబోతు నేల దాహం తీర్చలేక
హృదయ మేఘం నెత్తురు కక్కుకుని
రాంచిలకై నా బుజం మీద వాల్తుందిపూర్తిగా »

భ్రూం భ్రూం

ఆకాశం భళ్లున దూసుకుపోతోంది
దిగంతాల మీద ఒక ఎర్రని చారిక

కిటికీలోంచి ఇనుప రెక్క మీదుగా
రెండు కళ్లను మోస్తూ ఒక చూపు

నేను అనుకుంటూనే వుంటాను
బొమ్మను ఫట్మని విరగ్గొడ్దామని

గుప్పున కొన్ని పిట్టలు ఎగుర్తాయి
అంగీ భుజ మ్మీద ఒక బర్డ్ పూప్

పాత పాత మాటలను ఏరుకురా
పాపం, చందమామకు ఇచ్చొద్దాం

ఆకాశ వీధిలో దూది కొండలలోన
సూర్యుని సూదిని వెదుక్కుందాం

భ్రూం భ్రూం భ్రూం భ్రూ-భ్రమణం
బొంగరం భళ్లున పగిలి పోతోంది

ఇంటి పిట్టను ఇచ్చేస్తామన్నారు
అది పాపాయి మాటినడం లేదు

నా క్కూడా ఎగ్గిరి పోవాలనుంది

పూర్తిగా »

సుతి మెత్తని సవ్వడి

జనవరి 2016


సుతి మెత్తని సవ్వడి

మలుపు అని ఒక పదం వుంది. “టర్నింగ్ పాయింట్’కు తెలుగు. ఒకటి రెండు మలుపులయినా లేకుంటే కథ ఏం బాగోదు. మనకు తెలీకుండానే కథలో మలుపు కోసం ఎదురు చూస్తాం. మలుపు ఎదురయ్యే వరకు కాస్త అసహనంగా కూడా వుంటాం. మలుపు వల్లనే కథ కథ అవుతుంది. దేర్ఫోర్, మనం ఎదురు చూస్తున్నది మలుపు కోసం కాదు, కథ కోసమే అని లాజిక్. రివర్స్ లాజిక్. ఈ రివర్సల్ ని నేటి బతుకు డొల్లతనాన్ని చెప్పడానికి స్వాతి కుమారి వుపయోగించుకున్న తీరు బలే బాగుంటుంది. “ఎక్కడో ఒక చోట కథ ఎదురవడమే మలుపు” అంటారామె. మొదట అదేంటి అలా అంటారూ అనిపించి, ఆ వెంటనే ఔను…
పూర్తిగా »

ఈ కాలపు శ్రుతీ స్మృతి: జర్నలిజం

డిసెంబర్ 2015


అప్పుడు కాలానికి కన్నం వేసి కొన్ని క్షణాల్ని దొంగిలించి మన కిష్టమైనట్టు బతకడానికి వీలుండేది. ఇప్పుడు కాలం ఒక పేద్ద దిమ్మె. ఎక్కడా కన్నం పడదు. ఇప్పడు రాబిన్ హుడ్ లు బతకలేరు. హెల్దీ దొంగతనం కుదరదు. దొంగిలిస్తే మొత్తం ఇంటినే దొంగిలించాలి. ఊరినే/దేశాన్నే దొంగిలించాలి. అట్టా దొంగిలించినోడిదే అధికారం. నువ్వు నేను లాంటి చిల్లరి దొంగలకు ఏమీ మిగిలి లేదు, గజదొంగల కోసం పని చెయ్యడం తప్ప. మనం దొంగతనానికి ప్రయత్నిస్తో దొరికితే, ఏకంగా మరణ శిక్షే. శిక్ష పడిందని,మన మెడను చుట్టినది పూదండ కాదు వురి తాడని తెలియదు, పూర్తిగా బిగుసుకునే వరకు.
పూర్తిగా »

వాడుంటే బాగుండు

సెప్టెంబర్ 2015


నాకు తెలుసు, కాదు తెలవదు
అంతా తెలుసు, అసలేం తెలీదు

నుదుటి లోపల పురుగులు
చేతులు చొప్పించి తీసెయ్యాలి

సీతాకోక చిలుకలకై
మిణుగురు మెరుపులకై
రెక్కలున్న ఆకాశాలకై
ముసిముసి పువ్వులకై
కపాలాన్ని ఖాళీ చెయ్యాలి
కలవరించాలి పలవరించాలి
పర… వశమై విలపించాలి

రాసిందంతా కొట్టేసి
బొద్దింక మీసాల్తో
తడుముకోవాలి
బొద్దింకలే చెప్పగలవు
చీకటి రుచీ వాసన

***

చనిపోవడమంటే బయ్యం
చావు తెలుస్తుంది
పుట్టడానికి బయమెయ్యదు
అది తెలవదు
తెలియనట్టు కూడా తెలవదు

ఆట, అంతా తొండి అట
దాక్కున్న వాళ్లు…
పూర్తిగా »

తీపి ఆకలి

సెప్టెంబర్ 2014


తీపి ఆకలి

ఖరీదైనవేవీ వద్దు, సుదూరమైనవి, విచిత్ర
మైనవి, సచిత్రమైనవి కూడా వద్దు.

బెల్లం కలిపిన నువ్వుల పిండి కూరిన కొన్ని
పచ్చ జొన్న కుడుములు చాలు

మందపు గోధుమ రేకుల మధ్య శనగ పప్పు
బెల్లం ఫూర్ణం కూర్చినవైతే, వావ్

పండగ చేసుకోవాలి, కాసేపైనా

మిద్దె మీద చింత కొమ్మలు వుత్సవ జెండాలై
ఎగిరి ఎగిరి నవ్వాలి, పల్చని
ఆకులు గాలి నోటి బూరాలై

ఏముంది? ఇక్కడ ఏదేదే వున్నట్లు రంగు రంగుల
భాషలతో పెంధూళి చల్లి కళ్లు
కప్పొద్దు, ఉన్న దిగులు చాలు

తెల్లారడానికి బాగా ముందు పెట్రొమాక్స్ లైటు కాంతిలో
వూరుమ్మడి రుబ్బు…
పూర్తిగా »