‘ ఆలమూరు సౌమ్య ’ రచనలు

ఎన్నెన్నో వర్ణాలు!!

ఆగస్ట్ 2013


ఎన్నెన్నో వర్ణాలు!!

“ఇవాళ లక్ష్మివారం…హమ్మయ్య ఇవాళ, ఇంకొక్కరోజు. అంతే, తరువాత వీక్ ఎండ్. బోల్డు పనులున్నాయి చేసుకోవడానికి” అనుకున్నాను ఆఫీసులో అడుగుపెడుతూనే. “సుహేబ్ అప్పుడే వచ్చేసాడే!”

“హాయ్ సుహేబ్!”

ఎందుకో కొంచం దిగులుగా ఉన్నట్టు అనిపించాడు. ముభావంగా “హాయ్” అన్నాడు. ఈమధ్య సుహేబ్ పనితనం మెరుగవ్వడం, డైరెక్టరుకి ప్రీతిపాత్రుడవ్వడం మా ఆఫీసులో కొందరికి మింగుడుపడట్లేదు. ఆ అబ్బాయికి ఏదో విధంగా తలనొప్పులు తేవాలని కొందరు సీనియర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ విషయమై తను కొంచం బాధపడుతున్నాడు. ఆ ప్రస్తావన నాదగ్గర తెచ్చినప్పుడల్లా “నీ పని నువ్వు సవ్యంగా చేస్తున్నంతకాలం నిన్నెవరూ ఏం చెయ్యలేరు లేవోయ్” అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సుహేబ్ నాకన్నా జూనియర్. నాలుగేళ్ళుగా ఒకే…
పూర్తిగా »

వాళ్ళ నృత్యం

వేడి, విపరీతమైన వేడి, కొజ్జావాళ్ళు నాట్యం చేయడానికి వచ్చేవరకు
పావడాలు గిర్రున తిరుగుతున్నాయి, చేతాళాలు
సొగసుగా మోగుతున్నాయి, కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు
ఘల్లుమంటున్నాయి…గుల్‌మొహర్ పువ్వుల వెనుక
అటూ ఇటూ ఊగుతున్న పొడవైన జడతో, మిలమిలలాడే కళ్ళతో నాట్యం చేస్తున్నారు
చేస్తూనే ఉన్నారు నెత్తురు ఎగజిమ్మేవరకూ…

బుగ్గలమీద పచ్చబొట్లు, జడలో మెల్లెపూలు,
కొందరు నల్లగా, కొందరు తెల్లగా.
స్వరాలు గంభీరంగా, ఖిన్నమైన పాటలు; పాడుతున్నారు
ప్రేమికుల మరణాల గురించి, పుట్టుక నోచుకోని శిశువుల గురించి….

కొందరు డప్పులు బాదుతున్నారు, కొందరు వికసించని రొమ్ములు బాదుకుంటున్నారు
ఏడుస్తున్నారు, వేదనాభరితమైన పారవశ్యంతో గిజగిజలాడుతున్నారు.
వాళ్ళు…
పూర్తిగా »

ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!

ఫిబ్రవరి 2013


ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!

“మన సమాజం మహా క్రూరమయినది….కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది కథలో వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే!” అని నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విమర్శకులకు జవాబు చెప్పగల మేటి కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. కథా రచయితగా అమిత అనుభవజ్ఞుడు. ఈయన కథల్లోని కథా వస్తువు మన చుట్టు జరిగే సంఘటనలే. మనం నిత్యం వాడే వస్తువులే. కళ్ళజోడు, ఇంగువ, ముసురు, మబ్బు విడిచిన ఎండ ఇలాంటివన్నీ ఆయన కథా వస్తువులే. మధ్యతరగతి బతుకు బాధల్ని విన్నంత, కన్నంత అక్షరీకరించారు. సుబ్బరామయ్యగారి కథలు మధ్య తరగతి జీవితాలలో సమస్యలకు అద్దాలు. అలాంటి ఒక అద్దమే “నీళ్ళు”. కరువు ప్రాంతాలనుండి నీళ్ళు…
పూర్తిగా »