‘ కె. విజయభాను ’ రచనలు

మంచుపూల పగటికల

జనవరి 2014


మంచుపూల పగటికల

అంతులేనంత అద్భుతమైన ఆవిర్భావంగా
ఇరుకు సందులే లేనంత విశాలంగా
దారులంతా విత్తనాలుగా వెదజల్లిన సిద్ధాంతాలుగా
పచ్చటి పచ్చికంతా తలలూపుతూ చాటిచెప్పే నిజాలుగా
ఆకాశమంత పరిజ్ఞానం భూమికి అణువణువునా పంచినట్లుగా
విశ్వవ్యాప్త వసుధైక కుటుంబశైలి
మక్కువగా పేర్చిన హారంగా విరాజిల్లినట్లుగా
కాలక్రమంగా కాలాలు…
నాగరికత చక్రాలపై దొర్లిపోతున్నట్లుగా
ప్రతి మేఘం ధరిత్రికోసమే పురుడుపోసుకున్నట్లుగా
నింగి నుండి వర్షించగా
ఆయుధాల అవసరమే రాని అవనిగా
అంతర్మధనాల ఆలకింపులే లేని అంతరాత్మలుగా
చేయి చేయి కలిసి నడిచే సుదీర్ఘ ప్రయాణంగా
ఒకరికొకరు ఆపద్బాంధ సేతువులుగా
ఒకరికొకరు వినమ్ర క్రియాధాతువులుగాపూర్తిగా »

ఒక సోలడు నూకలిప్పించు

02-ఆగస్ట్-2013


ఒక సోలడు నూకలిప్పించు
చెరువు గట్టుపై
ఎండుటాకుల గలగలల మధ్య
రావిచెట్టుకి జారబడి
పక్షులను నా వద్దకు రప్పించుకుంటాను!

పరిష్కారం లేని సమస్యలతో
నా దగ్గరకు రాకు
కిట్టప్ప ఉరిపోసుకున్న రావి కొమ్మింకా
రక్తమోడుతోంది
ఒక్క మరణంతో
విరిగిపోయిన చిన్ని బాల్యమింకా
కన్నీరు కార్చుతోంది

చెదిరింది బొట్టో….జీవితమో తెలియక…
మతి మాత్రం చెదిరిన భద్రమ్మింకా బ్రతుకుతోంది

కూలిపోయిన గూటి శిధిలాలింకా
ఊరి వైఫల్యానికి సాక్ష్యాలిస్తున్నాయి

ఒక గుప్పెడు గింజలిప్పించు
ఇంటి వాకిట్లో
నడుం వంగిన నులక మంచానికి ఆనుకుని
కోళ్ళను నా చుట్టే తిప్పుకుంటాను!


పూర్తిగా »

భాషాపరమైన ఆదర్శాలు సాధ్యమా?

భాషాపరమైన ఆదర్శాలు సాధ్యమా?

మార్పు అనేది నిత్యం జరిగే ప్రక్రియ! అదొక్కటే కాంన్స్టెంట్ (నిత్యమైనది) అనే మంచి పదం కూడా ఉంది. మార్పు జరుగుతూనే ఉంటుంది. భాష ఒక ఉత్తమ సామాజికాంశం. సమాజ భాషా విధానాలు, వాడకం అభివృద్ధి ఈ సూచికను పరిపూర్ణం చేస్తుంది. ఆరోగ్యకరమైన భాష మనుగడకు, సమాజ వ్యక్తీకరణ మార్గాలకు ఇది ఒక సూచిక.

అంతర్జాతీయ భాష మన వాడుకు భాషను, విద్యనూ, అధికారిక కార్యాచరణను సైతం ఆక్రమించుకున్న నేపథ్యంలో భాషాపరమైన ఆదర్శాలు అంటూ మాట్లాడితే, ఖచ్చితంగా మాతృభాషలోనే సంభాషించాలి అని అనుకోవాల్సి వస్తుంది. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, ఇతర భాషను నెత్తికెక్కించుకోవడం లాంటి మాటలను వదిలేద్దాం. నిష్కర్షగా నిజాన్ని మాట్లాడుకుంటూ, భాషా ఆదర్శాలను ఎలా పాటించవచ్చో…
పూర్తిగా »