‘ తిలక్ బొమ్మరాజు ’ రచనలు

ఇలానో ఇంకోలానో!

ఇలానో ఇంకోలానో!

నేనిలానో ఇంకోలానో ఉంటాను
ఉండాల్సిందేగా
నీకు నచ్చేలా ఉండడాన్ని నిరసిస్తూ ఎంతకాలం ఇంకా
నా దారిలో నేను బతుకుతూ ఉంటే ఏమైందో తెలియని ఒకానొకచోట ఇద్దరం కూర్చున్నట్టు
అనిపిస్తూ ఉండడం ఏమిటి?
నేను మళ్ళా అంతరంగీకరించుకోవడం ఎందుకు?
పగలో రాత్రో పుడతాను నాకు నేనుగా
మళ్ళీ ఎప్పుడో రమిస్తాను నాలో నేనే
ఇక నీ గురించి ఏం చెప్పను
నా చేతులన్నీ నిన్ను తాకడం, తాకినట్టు భ్రమించడం నావల్ల కాదు
పైకి మాత్రం ఇద్దరం ఒకేలా కనిపిస్తాం
ఎప్పటికీ మారం
కొత్తగా చెప్పేదేముంది ఇంకా ఎప్పుడూ ఉంటూనే ఉంటాం…
పూర్తిగా »

గది కిటికీ

అక్టోబర్ 2014


గది కిటికీ

ఒక్కోసారి సగం తెరిచిన గది కూడా మాట్లాడుతుంది
తన కడుపులో ఉన్న కిటికీలు బయట ప్రపంచాన్ని పూర్తిగా మింగనూ లేవూ కక్కనూ లేవూ
అటూ ఇటూ కర్టన్లతో కప్పుకుంటూ చూస్తుంటాయి నిన్నో నన్నో
ప్రతిరోజూ కొన్ని ఉదయాలనూ సాయంత్రాలనూ నా కళ్ళలో పోసి పోతుంటాయి

నుసులు పట్టిన నుదురు కన్నాల్లో నులుముకుంటూనే ఉంటా
నిన్నటినో రేపటినో తలుచుకుంటూ కూర్చుంటాను బూజు పట్టిన మూలల్లో
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలు కొన్ని గోడ మీద పాకుతూ కనిపిస్తాయి నా ముందు
వాటి రక్తపు చుక్కలు నా పక్కగా నదులవుతాయి

అందంగా కూస్తూన్న బల్లిపిల్లల పలకరింపు నాకు కొత్తేమీ కాదు

పూర్తిగా »

ఒక మనం

అక్టోబర్ 2014


ఒక మనం

ఒకసారి సంభాషించడం కూడా కష్టమే మన ముఖాలు ఒకరికొకరు అలవాటు పడిపోయాక
పొద్దున్నే లేవడం
న్యూస్ పేపరుతోనో
నీలపు రంగున్న ఆకాశంతోనో
మనం మాట్లాడుకుంటాం
మనిద్దరం అనుకుంటూనే ఉంటాం బోల్డు చెప్పుకోవాలని కానీ తెరచిన కిటికీ రెక్కలమే అవుతాం ఎప్పుడో తెరుచుకుంటాం ఒకరికొకరం
ఎదురుపడుతున్నప్పుడల్లా నీ ముఖంలోకి నా ముఖం చొచ్చుకుపోవడం
అంతర్లీనంగా నీకేదో నేను చెప్పాలనుకోవడం నువ్వు నాతో…

అప్పుడు ఇలా ఉంటాం
hey
హా చెప్పు

అదీ…
ఏంటి?
సాయత్రం అలా నడుద్దామా మనం ఒకసారి
ఒక smiley
గుండెలో జీర నాలో

ఇదేంటిప్పుడు…
పూర్తిగా »

అర్దావయవం

సెప్టెంబర్ 2014


అర్దావయవం

నీ చేతులిక్కడ తెగిపడ్డాయి చూడు
అరచేతుల్లో గీతలిప్పుడు మఱ్ఱి ఊడల్లా తిరుగాడుతున్నాయి

అక్కడెక్కడో పారేసుకున్న ఎర్రదనం కొన్ని చోట్ల చూస్తుంటావు
పువ్వుల్లోనో
అస్తమించే ముసలి సూరీడులోనో
గుండెగోతుల్లో గతుకుల మురికి బయట ఎవరి మీదో

కస్తూరి దుర్గంధం మాటల ఉద్యానవనంలో
ఏరుకుంటున్న బండరాళ్ల కొసరు
కడుపులో ఆకలి దేవులాడుతున్నదేంటో అగుపించనే లేదు
ఎరువు వేస్తూనే కూర్చున్న నగ్న కళేబరం

ఇంకోసారెప్పుడో ఊరిచివర కొన్ని జీవాలు పుడతాయి మరణిస్తాయి
ఉదయం సాయంత్రం /పూల మెడలు విరిచేసారు నీలాగే ఇంకెవరో
ఇప్పుడు మళ్ళీ అంటుకట్టాలి చీడలు పట్టకుండా ఈసారి

అక్కడక్కడా నా అవయవాలు విడివడుతూనే ఉన్నాయిపూర్తిగా »

చీకటి వాసన

చీకటి వాసన

ఇంకొన్నాళ్ళు ఆగాలేమో కొత్త రెక్కలు విచ్చుకోవడానికి
అన్నం మెతుకులు చేతులకంటనే లేదు అప్పుడే ఆకలిసముద్రాన్ని దాటేస్తే ఎలా
చీకటి తైలం ఇంకిపోయిన నేలంతా రాత్రి వాసనను కప్పుకొని బయటకొచ్చింది
చేతుల్లోకి కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని చదును చేసుకుంటూ ఇంకో క్షణం
మట్టి గొంతులో కుక్కబడిన వేర్ల చిరునామాలన్నీ ఆకులతో కుప్పపోసాక
లోన మిగిలిన ఓకింత ఖాళీ
నవ సమాధుల నిర్మాణం జరుగుతూనే ఉంది ఎక్కడోచోట ప్రతి రోజు
పాత శాసనాలను కొత్తగా లిఖిస్తూనే ఉన్నా

మరో రెండు శరీరాలు కోరికల ముసుగులో మరణించాక ఇంకో ఆకలి పుడుతూ వెంట తేలేని లిప్తపాటు కాలాన్ని నీతిప్రమణాలతో…
పూర్తిగా »

అర్థాల వసారా

అర్థాల వసారా

పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు
వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి

అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను
నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు

నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు
రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం

ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే
ఎప్పుడూ పాత నీడలే

మునుపెన్నడో నేశాను
అంతరంగ పరికిణీని
ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు
ఎండిపోయిన పూల సుగంధంలా
నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ

నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటానుపూర్తిగా »

ప్రసవం

ఏప్రిల్ 2014


ప్రసవం

1
గర్భం దాల్చిన నిండు మేఘాలు
చినుకులను ప్రసవించడానికై ఉరుములు

2
ఆకాశం(లో)తో ప్రతి నిత్యం మబ్బుల అధరీకరణం ధరణిలో కూరుకుపోవడానికి

3
కొన్ని వెలుతురుల ప్రసరణ ఈనాడు మళ్ళా
పుడమిపై సంతృప్తిగా ఓ నిట్టూర్పు

4
చెట్ల కొమ్మల మధ్యగా జరుగుతున్న పిడుగుల ప్రక్షాళన వాటి మొదళ్ళను కుదించేస్తూ

5
కొన్ని చేతులు చాపిన ఆవరణం ప్రకృతి ఒడి
ఎన్నిమార్లు ఇంకిపోయాయో గుర్తుపట్టని పదార్థాలు

6
కణాలు
ప్రతి కణాలు
అంతమవుతూ మళ్ళీ ఆవిర్భావం.


పూర్తిగా »

ఇంకొన్ని జ్ఞాపకాలు

ఇంకొన్ని జ్ఞాపకాలు

నేను గదిలో ఒక్కడినే కూర్చున్నప్పుడు సముద్రమంత నిశబ్దం అలుముకుంది నా చుట్టూ

నేనెక్కడొ అగాధంలో పడిపోతున్నట్టుగా కొన్ని ఆలోచనా సరళ రేఖలు నా ఖగోళంలో
గీసుకుని వాటి మీద నడుస్తున్నప్పుడు

దూదిమేడలా నేను కూలిపోతున్నపుడు నాకు ఆసరా ఇస్తూ ఇంకొన్ని జ్ఞాపకాలు
ప్రహరీలా నిర్మించినపుడు

వాటి కింద ఏనాడో శిధిలమైపోయిన కొన్ని పిచ్చుకగూళ్ళు
అందులో నేనో మూల నన్ను నేను తడుముకుంటున్నపుడు

ఏమితోచక తోకచుక్కలా రాలుతున్న నా కన్నీళ్ళు కొన్ని అక్కడక్కడా
నీటిచెమ్మలుగా నిద్రాణమైపోతుంటాయి నువ్వొచ్చేసరికికి

నేను కరుగుతూ నిన్ను కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటాను నువ్వు
గుర్తొచ్చినప్పుడల్లా…


పూర్తిగా »

చిరునామ

డిసెంబర్ 2013


అంతర్లీన సరిహద్దు రేఖేదో
చెరిగిపోతోంది లోనెక్కడో…
సంతోషం తరువాత దు:ఖంలా
స్నేహం తరువాత సాంత్వనలా

కనులు పారేసుకున్న
చూపుల నవ్వులేవో జారిపడ్డట్టు

కొన్ని వింజామరలా తలపులేవో
తనుసీమలపై నుండి తరలిపోయినట్టు

చేతివేళ్ళతో పారే నీటి
ఉపరితలాన్ని స్ప్రుసించినట్టుగా

ఎనలేని ప్రేమామృత పరిదిలేని
పరువాలను మనసుతోనే శోదిస్తూ
శాశ్వత చరితల తయారిలో
వాడిపారేసిన వచనంలా
వేచిచూస్తోంది ఈ క్షణం.

నిన్ను కనలేని ఈ కనులెందుకు
నీ పేరు పలుకని పెదవులెందుకు
తీసుకెళ్ళు నీతోనే…
కనీసం నువ్వెళ్ళే దారిలో
నీకు కాపలాగ పడుంటాయి

నేను కనిపించని నాలో

పూర్తిగా »