ప్రత్యేకం

కీట్స్… మూడు స్మృతిగీతాలు

నవంబర్ 2014


కీట్స్… మూడు స్మృతిగీతాలు

(అక్టోబరు 31 కీట్సు 220వ జయంతి సందర్భంగా నివాళి)

జాన్ కీట్స్ (31 October 1795 – 23 February 1821) సౌందర్యారాధకుడు. అయితే ఆ సౌందర్యం బాహ్య /భౌతిక స్వరూపం కాదు. సత్యస్వరూపమైన సౌందర్యం. అందుకే, Truth is beauty and beauty is truth. That is all you know on earth; and that is all you need to know అంటాడు. భౌతికమైన సౌందర్యపు క్షణికత ఎరిగినవాడవడం వల్లే, A Thing of beauty is joy forever అని అనడంలోనూ, Heard Melodies are sweet, unheard melodies are sweeter అనడంలోనూ, రసాత్మకమైన సౌందర్యం…
పూర్తిగా »

రామాయణం –పటికబెల్లం పలుకులు

సెప్టెంబర్ 2014


రామాయణం –పటికబెల్లం పలుకులు

ఎప్పుడూ లేనంతగా “వైటింగ్ ఫర్ గోడో” స్థితిలో ఇరుక్కుపోవడం వల్ల కావొచ్చు – గత రెండేళ్లగా గాఢంగా శబరే మదిలో మెదులుతోంది.

ఏదైనా అడ్డంకి మూలంగా ముందుకెళ్ళలేకుండా ఆగిపోవడం, లేదా దేన్నో ఆశిస్తూ ఎదురుచూడడం కన్నా నరకం ఇంకోటుండదు. ఎర్రలైటుదగ్గర కారు కదలకుండా ఆగే ఉన్నా, పెట్రోలు మాత్రం ఖర్చుఅవుతూనే ఉంటుంది విషవాయువులు దాని ముక్కులోంచి ఎగుస్తూనే ఉంటాయి – వైటింగ్ స్థితి ఇట్లాంటిదే. It produces negative energy. అందుకే, మా గురువుగారు It doesn’t matter what decision you make, make a decision and move on అంటుండేవారు.

శబరి రాముడి రాక కోసం “ఎదురుచూస్తూ” ఉండిపోయిందంటారు.…
పూర్తిగా »

బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా

బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా

ఆధునిక భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు తెలుగువారు గర్వించదగిన మహానుభావుడు. ఆధునిక భాషా రంగంలో అనితర సాధ్యమైన గుర్తింపు పొందిన మహా వ్యక్తి. ఆయన మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. భద్రిరాజు కృష్ణమూర్తి, తూమాటి దొణప్ప తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన చేకూరి రామారావు తెలుగు వారికి చిరస్మరణీయులు. ఆయన వాడుక భాషా వ్యాప్తికి చేసిన కృషి ప్రశంసనీయం.

అందరికి ‘చేరా’గా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లిందుల పాడు గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేశారు. డిగ్రీ, యం.ఏ. తెలుగు హైదరాబాదులో పూర్తి చేసి, అమెరికా…
పూర్తిగా »

భాషే మనుషుల్ని కలిపివుంచే బలమైన సాధనం – విశ్వేశ్వర రావు

భాషే మనుషుల్ని కలిపివుంచే బలమైన సాధనం – విశ్వేశ్వర రావు

విజయవాడ శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారంటే తెలియని తెలుగు కవులు, రచయితలు ఉండరు.
కమ్యూనిస్టుల కుటుంబం నుండి వొచ్చిన విశ్వేశ్వర రావు గారు పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, స్వయంగా తాను కవి / రచయిత కాకపోయినా, తెలుగు కవిత్వం పట్ల ఆయన చూపించే ప్రేమ, కవులు, రచయితల పట్ల ఆయన చూపించే అభిమానం మనల్ని అబ్బురపరుస్తాయి.
శ్రీ శ్రీ అంటే, ఆయనకు ఎంత వెర్రి అభిమానం అంటే, ‘వ్యాపారం కలిసొస్తుంది – ప్రమీల ప్రింటర్స్ అని పేరు పెట్టండి’ అన్నా పట్టించుకోకుండా, తనకు ఎంతో యిష్టమైన శ్రీ శ్రీ పేరునే పెట్టుకున్నారు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ విసిటింగ్ కార్డ్…
పూర్తిగా »

వాకిలి పాఠకులకు జయ నామ సంవత్సర శుభాకాంక్షలు …

వాకిలి పాఠకులకు జయ నామ సంవత్సర శుభాకాంక్షలు …




రోజులు గడవటం కాల గమనం కోసమే ఐతే వికసించే ప్రతి ఉదయ కుసుమంలో ఇన్ని కాంతుల పరాగం ఎందుకు? అస్తమయాలన్నీ లెక్క పూర్తిచేసుకుని వెళ్ళిపోయే ముగింపులే ఐతే ప్రతి సంధ్యలో ఇన్ని రంగుల రసహేళితో లోకమంతా రాగరంజితం అవ్వడం ఎందుకు? కదలడమే కాలం స్వభావం ఐతే, నడిచి పోవడమే నిర్ణయమైతే ప్రకృతినిండా ఆకు గలగలల అందెలమోతలు, సుతిమెత్తనై తాకే చిరుగాలుల చీర అంచులు అవసరమే లేదేమో!

బహుశా సృష్టి స్వభావం సౌందర్యమేనేమో. అడుగుతీసి అడుగు వేస్తే ఒలికిపోయే మధుపాత్రలా నిండుగా జీవరసాన్ని నింపుకుని ప్రతిసారీ అంతే ఆనందంతో, అదే అందంతో ఒక్కో కొత్త ఋతువుని ఆవిష్కరిస్తుంది. ఎన్నిసార్లు చవిచూసినా వెగటులేని అవేరుచుల్ని కొసరి…
పూర్తిగా »

జయభేరి మొదటి భాగం – కవితలు

జయభేరి మొదటి భాగం – కవితలు

రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

 


పూర్తిగా »

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?
ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి…
పూర్తిగా »

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

కవిత్వం నాకేమిస్తోంది? 

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని…
పూర్తిగా »

ప్రవాస యాత్రారతి

ప్రవాస యాత్రారతి

మోహన్ రుషి కవితా సంపుటి 'జీరో డిగ్రీ' కోసం అంబటి సురేంద్రరాజు గారు రాసిన ముందుమాట:

"ఒక్క నిట్టూర్పు వోలిక
ఒక్క మౌనభాష్పకణమటు
ఒక గాఢవాంఛ పగిది"

-కృష్ణశాస్త్రి ('నా నివాసమ్ము...') - 'ప్రవాసము' / 'కృష్ణ పక్షము' నుంచి.
పూర్తిగా »

ఉద్యమాలేవి విఫలం కావు

ఉద్యమాలేవి విఫలం కావు

జర్నలిజం, సాహిత్య విమర్శ, కవిత్వం, కథా రంగాల్లో కృషి చేస్తున్న కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రెండు కథా సంపుటాలను, మూడు విమర్సనా గ్రంథాలను,ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. తెలుగు సాహిత్యోద్యమంలో భాగంగా ఆయన వివిధ రచయితల వ్యాసాలతో వెలువడిన తెలంగాణ తోవలు, తెలంగాణ కథ -దేవులాట, మే 31 వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రంగాలపై 2001లో వెలువరించిన తెలంగాణ తోవలు వ్యాససంపుటి మలి ముద్రణను వెలువరించారు. ఈ సందర్భంగా కాసుల ప్రతాపరెడ్డితో ‘వాకిలి’ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు డా. కాసుల లింగారెడ్డి చేసిన ఇంటర్వ్యూ:

1. ‘తెలంగాణ తోవలు’ మలి ముద్రణ…
పూర్తిగా »