లాఫింగ్ ‘గ్యాస్’

యోగా గొప్పతనం

యోగా గొప్పతనం

“ఏటా సంక్రాంతికి మా వూళ్ళో రివాజుగా జరిగే జాతరలో ముఖ్య ఆకర్షణ తిండిపోతుల పోటీ. చెయ్యి ఆపకుండా.. అరగంటలో ఎవరెక్కువ ఇడ్డెన్లు చట్నీల్లేకుండా లాగిస్తాడో.. వాడే ‘భీముడు’. వంద కొబ్బరికాయలను వంటి చేత్తో పగలేసి లోపలి గుజ్జుతో సహా నీళ్ళన్నీ చుక్క కింద పడకుండా అతి తక్కువ సమయంలో స్వాహా చేసినవాడు ‘బకాసురుడు’. తొక్క వలవకుండా అరటి పండ్లు తినడం, టెంకె వదలకుండా మామిడి పండ్లు మింగడం, పెంకు తియ్యకుండా కోడిగుడ్లు నమలడం.. లాంటి విన్యాసాలన్నీ చిన్నతనంనుంచే మా దగ్గర ప్రోత్సహించే విద్యలు. మా ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ తిండిపొటీలో ‘భీముడు’ ‘బకాసురుడు’ బిరుదులు సాధించడమే అంతిమ లక్ష్యం. ఐఐటీలో దేశం మొత్తం మీదా…
పూర్తిగా »

ఇదో ఆదాయ మార్గం!

ఇదో ఆదాయ మార్గం!

“స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయిట కదా.. ఓ మూలలా కూర్చొని మూలక్కపోతే ఎంచక్కా అలా పోయి ఓ సారా ముసలయ్య గారిని కలిసి రారాదా!” అని మా ఆవిడదొకటే నస. తప్పుతుందా! వెళ్ళి కలిసాను.

మనసులోని మాట పెదాల మీదకు పూర్తిగా రాకముందే పెద్దాయన చప్పట్లు కొట్టి పియ్యేని పిలిచి నన్నప్పగించేశాడు. “అయ్యగారికివాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ ముఖ్యమైతే తప్ప రిసీవరూ బౖటికి తీయరు. ఏమిటీ విషయం?” అనడిగాడా పియ్యే. ” మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనుకుంటున్నాను. ముసలయ్యగారి పార్టీ సహకారం కావాలి” అన్నా టూకీగా.

“మరైతే వట్టి చేతులతో వచ్చారేమిటండీ బాబూ! మీ జాతక చక్రం..సూర్యమానం ప్రకారం వేసిందొకటి..చంద్రమానంతో…
పూర్తిగా »

కొత్త సంవత్సరంలో… కొన్ని పాత ముచ్చట్లు

కొత్త సంవత్సరంలో… కొన్ని పాత ముచ్చట్లు

పాత యముడా? కొత్త యముడా? అన్నది ఓ పాత తెలుగు సినిమా ఫేమస్ డైలాగు. ‘పాతా?.. కొత్తా? రెండింటిలో ఏది మెరుగు?’ అన్న ధర్మసందేహం సత్యయుగంనుంచే వస్తున్నట్లున్నది!

పాత కొంత మందికి రోత. కొత్త కొంతమందికి చెత్త. పాత కొత్తలతో నిమిత్తం లేకుండా నాణ్యతను బట్టి రెండూ స్వీకరణీయమే- అని మరికొందరు మధ్యేవాదుల వాదన. ఎవరి మాటల్లో ఎంత బలముందో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా కొద్దిగా సరదాగా విచారిద్దామని ఉందీ సారికి.

కొత్తనీరు నెమ్ము చేస్తుంది. కొత్త చింతకాయకు పులుపు తక్కువ. కొత్త చెప్పుల్లో కరిచే ప్రమాదం జాస్తి . కొత్త కారు తోలడం కడు శ్రద్ధతో కూడిన వ్యవహారం. కొత్తబియ్యం ఓ పట్టాన…
పూర్తిగా »

మైండ్ బ్లాక్

మైండ్ బ్లాక్

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో.. వాడే పండుగాడు” అని ‘పోకిరీ’ లో మహేష్ బాబు డైలాగ్. ఆ డైలాగును బట్టి మైండు బ్లాకుకి మహేష్ బాబే ఆద్యుడు అని పౌరాణిక, చారిత్రక, జానపద నేపథ్యాలను ఆట్టే పట్టించుకోని ఆయన అభిమాన సందోహం కేరింతలు కొడితే కొడుతుండవచ్చు గాక .. వాస్తవానికి ఈ ‘మైండు బ్లాకు’కీ అన్నింటిలోలాగా బ్రహ్మదేవుడే ఆద్యుడు. బ్రహ్మాండ పురాణం నిండా దీనికి ఎన్నో ప్రమాణాలున్నాయి కూడానూ.

వేద వేదాంగాలను సృష్టించిన అలసటలో బ్రహ్మదేవుడు కాస్త మాగన్నుగా కన్ను మూసిన వేళ ఆ తాళపత్ర గ్రంధాలన్నీ ప్రళయ జలాల్లో జారిపడిన కథ ఓ సారి గుర్తు చేసుకుంటే మైండు…
పూర్తిగా »

గడ్డం ఓ ప్రత్యేకం

గడ్డం ఓ ప్రత్యేకం

గడ్డం ఇంటి పేరున్న వాళ్లందరికీ గడ్డాలుండాలని రూలు లేదు. దేవుడి మొక్కులకు, పెళ్లాం ప్రసవానికి, తగ్గని జబ్బులకు, క్షౌర బద్ధకానికి, పంతానికి, దేశాంతరంనుంచి అప్పుడే దిగబడ్డ్డానికి, దిగులుకి, దీక్షకు, దీర్ఘ చింతనకు, యోగులకు, బైరాగులకు, క్షురశాల దాకా తీసుకెళ్లే ఆధారం లేని ముసలి వాళ్ళకు, ముసల్మాన్ సోదరులు కొంత మందికి- గడ్డం ఒక సంకేతం.
పూర్తిగా »