కరచాలనం

అవార్డులు ప్రతిభకి కొలమానాలు కావు నిజమే…కాని, మనలో ఒకరు ఒక అవార్డు గెల్చుకున్నప్పుడు మనసంతా వసంతమే! అలాంటి వసంతాలు తెచ్చే రచయితలతో కరచాలనం.

కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని

నవంబర్ 2017


కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని

మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్థవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ. ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్థం కాలేదు. స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!

చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని… చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ… ఇలా… సరిగ్గా ఇదే…
పూర్తిగా »

నా ఉద్విగ్న మానస సంభాషణ

నా ఉద్విగ్న మానస సంభాషణ

నాకు భాషమీద, భాషకున్న పరిమితులమీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలు చుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. నా మిత్రులు ,కుటుంబ సభ్యులు చాలా మంది తరచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు.

అదేమంటే ‘నువ్వు కవిత్వమెందుకు రాస్తావ’ని. బహుశా ఇదే ప్రశ్న కొన్నిసార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడ చెప్పుకుంటూ వుంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనమెందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరపున నియమించుకున్న లాయర్‌ నా కవిత్వం.

“సహజ మానవునికి,…
పూర్తిగా »

తెంపులేని దేవులాటే నా సాహిత్య విమర్శ: కాసుల ప్రతాపరెడ్డి

తెంపులేని దేవులాటే నా సాహిత్య విమర్శ: కాసుల ప్రతాపరెడ్డి

కాసుల ప్రతాప్ రెడ్డి నిక్కచ్చిగా మాట్లాడే సమకాలీన సాహిత్య విమర్శకుడు. ఎట్టి స్థితిలోనూ నీళ్ళు నమలడం అతని వల్ల కాదు. మొహమాటంగా మాట్లాడడం అంటే ఏమిటో తెలీదు. చాలా నిర్మొహమాటంగా నిష్టగా తన అభిప్రాయాల్ని పంచుకోవడం ప్రతాప్ విమర్శ మార్గం. ఈ ఏడాది అతని విమర్శ కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీ విమర్శ పురస్కారం లభించడం సమకాలీన సాహిత్య విమర్శకే గౌరవం ! ప్రతాప్ నేపధ్యం వినండి.

*

నిజానికి, నా బాల్యంలో నా చుట్టూ ఏ విధమైన సాహిత్య వాతావరణం లేదు. పాఠ్యపుస్తకాల్లోని గొప్ప వ్యక్తుల గురించి, వారి జీవితాల గురించి మబ్బు జామున మోట కొడుతూ ఆలోచిస్తూ ఉండేవాడిని.…
పూర్తిగా »

మనుషుల కంటే అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు

ఏప్రిల్ 2013


మనుషుల కంటే  అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు

ఒక కృష్ణుడు పొద్దున్నే లేచి రాత్రి దాకా వార్తల వేటలో రాజధానిని గాలిస్తూ వుంటాడు. ఇంకో కృష్ణుడు ఆ వార్తల కింద నలిగిపోతున్న పీడితుల గుండె చప్పుళ్లని అక్షరాల్లోకి తర్జుమా చేసి తన గుండె తడిని వాటికి అద్దుతూ వుంటాడు. ఆ మొదటి కృష్ణుడూ ఈ రెండో కృష్ణుడూ ఇద్దరూ ఇద్దరే! రెండు భిన్నమయిన రంగస్థలాల్లో నిలబడి రెండు చేతులా లోకాన్ని ఆవాహన చేసుకొని, నిండు గుండెలు పట్టేటంతగా ఆ లోకాన్ని ప్రేమిస్తూ, అప్పుడప్పుడూ కాస్త కోప్పడ్తూ…! కొప్పడేటప్పుడు ఎంత ప్రేమించామో చెబ్తూ, ప్రేమించేటప్పుడు ఎంత కోప్పడ్డామో చెప్తూ…ఈ లోకం లయ తప్పకూడదని తపన పడుతూ…! కృష్ణుడు కవిత్వంలాగా కబుర్లు చెప్తాడు, కబుర్లలాగా కవిత్వం చెప్తాడు.…
పూర్తిగా »

పల్లె జీవితమే నా జీవరాగం :కె.వరలక్ష్మి

ఏప్రిల్ 2013


పల్లె జీవితమే నా జీవరాగం :కె.వరలక్ష్మి

నవల,వ్యాసం, పొయెట్రీ  రాసినా కూడా సాహిత్య ప్రక్రియల్లో నాకు ఇష్టమైంది కథ.

రచనలు నా జీవితానికొక అర్థాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. అంత వరకూ నాలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాయి.

రవీంద్రుడి గీతాంజలి నాకు ఇష్టమైన పుస్తకం. శరత్ సాహిత్యం ప్రభావంతో పత్రికల్లో ఏదైనా మంచి కథలు చదివినప్పుడు నేను కూడా రాస్తే బావుణ్నని అనిపించేది. ముఖ్యంగా రంగనాయకమ్మ, కాళీపట్నం రామారావు గారి కథలు చదివినప్పుడు పట్టి కుదిపి వేసి రాయకుండా ఉండలేకపోయాను. హైస్కూల్ లో చదువుతున్న రోజుల్లో రంగనాయకమ్మ గారి బలిపీఠం సీరియల్ గా వస్తూ ఉండేది. ఆ కథా వస్తువు,రచనా శైలి చాలా నచ్చి నేను అలా రాయడానికి ప్రయత్నించాను.

ప్రచురింపబడిన మొదటి కథ…
పూర్తిగా »

ఈ తరం కథల్లో ఆర్ద్రత తగ్గింది

ఈ తరం కథల్లో ఆర్ద్రత తగ్గింది

పెద్ది భొట్ల సుబ్బ  రామయ్య……

ఈ  పేరు వినగానే దిగులు మేఘపు  చాటు గుబులు జాబిలీ గుండెలను పిండి వేస్తుంది. మనసు కరుణ రసప్లావితమై  కరిగి నీరయ్  పారిపోతుంది ఒక దుఖపు తెర  మనసు మీద అలా పర్చుకుంటుంది. రవ్వంత జాలి, గోరంత సానుభూతి కొండంత కరుణ జమిలి గా ఒక దాని మీద మరొకటి ఆవరించుకొని ఏ  భావోద్వేగానికీ  అందని దృశ్యం ఏదో మనో యవనిక మీద అల  లాగా తారాడుతుంది. మనం మనంగా ఉండలేము. మన లోపల సున్నితమైన  కరుణ అనే సూత్రం ఒకటి హృదయాన్నీ బుద్దినీ ఏకం  చేస్తుంది. కరుణ ఆయన కధాత్మ . కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమి ఈ సంవత్సరం…
పూర్తిగా »

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!

నీరు పల్లమెరుగు,నిజము దేవుడెరుగు-అన్నది సామెత. మానవ జీవన మనే ప్రవాహం ఏ గతిలో సాగుతున్నదో  తెలుసుకోవాలనుకుంటాడు రచయిత. ప్రవాహదశలోని ఒక దశను -ఒక చిన్న మార్పును -ఆ మార్పు చెందుతున్న క్షణాన్ని తన రచన ద్వారా పట్టుకోడానికి పోరాటం చేస్తాడు. రచయితగా తనకుండే సాహిత్య సాధనాల్తో మార్పు చెందుతున్న క్ష ణాన్ని  సాహసంతో పట్టుకుంటాడు.

అయితే ఈపని జరుగుతున్న స్వల్పకాలంలోనే మానవ జీవితవాహిని మలుపుకు తిరిగేసి , మరో దిశకు మారి, ఇప్పుడేమంటావంటూ రచయితను సవాలు చేస్తుంది.మళ్ళీ రచయిత అప్పుడు తయారైన మార్పును అర్థం చెసుకునే పనికి సమాయత్తం అవుతాడు.ఇలా సాహిత్యానికీ,మానవజీవితానికీ మధ్యలో నిరంతరంగా జరుగుతున్న ఈ పోటీలో , వ్యక్తిగా జీవితపరిణామాలకు మారుతూ, రచయితగా…
పూర్తిగా »

నన్ను కదిలించిన మనుషులే నా కథలు!

ఫిబ్రవరి 2013


నన్ను కదిలించిన మనుషులే నా కథలు!

సామాన్య… .చాలా అరుదైన పేరు. అంతకన్నా అరుదైనవి ఆమె రచనలు.ఆదునిక తెలుగు కథానిక సరికొత్త మలుపు తిరగటం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో సామాన్య తనదైన స్వంత శైలి తో సాహిత్య రంగం మీదికి అడుగు పెట్టారు.జీవితంలో కనిపించకుండా మిగిలి పోయిన ఖాళీలను   సామాన్య  తన   కథానికల ద్వారా పూరిస్తూ వస్తున్నారు.ఈమె రాస్తున్న కథలు కొత్తవి.కథనాలు కొత్తవి.శిల్ప సంవిధానం కొత్తది. మారుతున్న కాలంలో మారుతున్న మనవ సంబందాలు ఈమె కథా  వస్తువులు సామన్యమైనవిగా కనిపించే అసామాన్యమైన అంశాలు ఈమె కథలకు ముడి సరుకులు. పాత్రల ద్వారా ఆకారాలను సంతరించుకొన్న అనుభవ విశేషాలే ఈమె కథలు. నిరాడంబరమైన శైలిలో నిశ్చలమైన సాంద్రత.సరళమైన శైలిలో విశాదాశ్రు తుశారాల తేమ నిండిన…
పూర్తిగా »

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది.

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది.

నా కవిత్వం నేను నా పాఠకుడితో జరిపే ఉదాత్త సంభాషణ. జీవితం ప్రసాదించే దు:ఖాన్ని స్వీకరించి, నేను నా పాఠకుడి సమక్షంలో – జీవితాన్ని ప్రేమించటంలోకీ, జీవితం లోలోతుల్లోని విలువల్లోకీ చేసే ప్రయాణం. కఠినమైన శిలలాంటి నిద్రనుండి, పూవులా కోమలమైన మెలకువలోకి నడుస్తూ, పాఠకుని నడవమని మృదువుగా చేయందివ్వటం. అయితే, ఈ కవిత్వం వెనుక ఉన్న జీవితానుభవం ఏమంత అందమైనదీ, ఆసక్తికరమైనదీ కాదనుకొంటాను. ఈ క్షణానకూడా, నేపధ్యమెందుకు, నా కవిత్వం చదివి చూడండని చెప్పాలని బలంగా అనిపిస్తూ వున్నా, పాఠకుడికి కవి నేపధ్యంపై ఉండే సహజమైన ఆసక్తిని కాదనలేక, నా సంక్షిప్త చిత్రాన్ని పరిచయం చేస్తున్నాను.
సాహిత్యం పట్ల ఒకరికి  ఆసక్తి ఎందుకు కలుగుతుంది.…
పూర్తిగా »

గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!

జనవరి 2013


గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!

మనసుతో మొదలైన నా సాహిత్య యాత్రగురించి నేనెంత వరకు మాటల్లో న్యాయంచేకూర్చగలనో నాకూ సవాలుగానే వుంది.కవిత్వం పైన ఆసక్తి ఎందుకుఅనేదానికి సమాధానం నా దగ్గర లేదు.

కానీ డిగ్రీ చదివేరోజులనుండి మొదలయింది అన్నట్టుగా గుర్తు. ఆంధ్రజ్యోతి,ఆంధ్ర భూమి ఇతరత్రా వారపత్రికలు తీసుకొచ్చేవారు మా నాన్నగారు. అందులోకవిత / కలం / ఓ కోయిలా(పేర్లు ఖచ్చితంగా గుర్తులేవు) అని ఒక పేజీవుండేది కవితలతో. పత్రికలు ఇంటికి రాగానే, మొట్టమొదటిగా కవితలు చదివాక గాని, మిగతా పేజీలకువెళ్ళేదాన్ని కాదు.

చదువుతున్నప్పుడు ఒక మంచి అనుభూతి మిగిలేదినాకు అర్ధమైనంత వరకు. అసలు కవిత్వమెలారాస్తారో అనేది నాకు అప్పట్లోఅతి పెద్ద ప్రశ్న.అలాకవిత్వంతో పరిచయం మొదలయింది. వేరే కవిత్వ పుస్తకాలేమీ చదవలేదు, తెచ్చుకుని చదవాలి…
పూర్తిగా »