ముఖాముఖం

సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. – డా. ప్రసాద మూర్తి

డిసెంబర్ 2015


సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. – డా. ప్రసాద మూర్తి

అలతి అలతి పదాలతో అనల్పమైన భావప్రకటన అతని సొత్తు. “మాట్లాడు కోవాలి”, “కలనేత”, “ నాన్నచెట్టు“ ఇప్పుడు అవార్డ్ తెచ్చిన “పూలండోయ్ పూలు” అతని కవిత్వానికి చిరునామాలు. వస్తువేదైనా అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల నేర్పు ఉన్న డా. ప్రసాద మూర్తి గారు 2015 ఫ్రీవర్స్ ఫ్ర౦ట్ అవార్డు అందుకున్న సందర్భంగా కవిత్వం గురించి వాకిలి రెండు మాటలు మాట్లాడినప్పుడు, మనసు పరచి మనకి వినిపించిన అభిప్రాయాలు ఇవి.

Q: కవులకూ మిగతా వారికీ ఉన్న తేడా ఎలా అనిపిస్తుంది మీకు?

జ. అందరూ మనుషులే. కాకుంటే కవి చూపు మిగిలిన వారికంటే భిన్నంగా…
పూర్తిగా »

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

రంజని-కుందుర్తి అవార్డ్, ఆంధ్రసారస్వత సమితి అవార్డ్, రమ్యభారతి కథా పురస్కారం, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత కవయిత్రి రేణుకా అయోల గారితో ముఖాముఖం.

Q: కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి తేడా ఎమిటి? దాన్ని మీరెంతవరకు సాధించగలిగారు? మీకు నచ్చిన తెలుగు మరియు తెలుగేతర కవిత్వము, కథలు రచయతలు/త్రులు గురించి చెబుతారా?

కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి కావలసింది నిజాయతి, అది నేను సాదించేనని అనుకుంటున్నాను. కవిత్వాన్ని ప్రేమించే నేను అందరి కవిత్వం ఇష్టపడతాను. అనువాదాలు అంతగా చదవలేదు. కధలు, నవలలు విరివిగా చదివినా, నేను ఎక్కువగా ఇష్టపడ్డ రచయతలు; కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాధ్.

ఉద్యోగరీత్య మధ్యప్రదేస్ లో వుండం వల్ల గజల్స్ వినడం, వాటిపై…
పూర్తిగా »

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

చిన్నప్పట్నించీ చదివే అలవాటుతోపాటు రాయాలన్న కోరికా బాగా ఉండేది. ‘72 లో బంగ్లాదేశ్ యుధ్ధం నేపథ్యంలో “ దేశంకోసం “ అనే కథ రాసాను. బియ్యేలో ఉండగా మరో నలుగురు స్నేహితురాళ్ళూ, ఒకరిద్దరు టీచర్ల ప్రభావంతో “ స్నేహం “ అన్న నవలా రాసాను. అంతకు ముందే నాన్న సలహా మీద “ మనోవాణి “ అన్న లిఖిత పత్రిక నడిపాను. బియ్యే రోజుల్లోనే కవిత్వమూ రాసాను. 1976 లో విశ్వనాథ వారి “ సహస్ర చంద్ర దర్శనం “ సందర్భంగా విజయవాడలో జరిగిన సెమినార్లో “ గిరి కుమారుని గీతాలు “ మీద ఆయన సమక్షంలోనే ఓ విమర్శా వ్యాసం చదివాను. కానీ 1978-80…
పూర్తిగా »

కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత

డిసెంబర్ 2014


కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత

అప్పుడెప్పుడో చదువుకుంటున్న రోజుల్లో ‘వార్త’ లో సతీష్ చందర్ అందమైన ‘ఇంట్రొ’తో ఒకే సారి రెండు మూడు పద్యాలు అచ్చేసి, అరె ఎవరీ అమ్మాయి బాగా రాస్తుందే అనిపించుకుని, ‘దిశ పబ్లికేషన్స్’ వాళ్ల కోసం సత్యజిత్ రే కథలు ఓ పదింటిని అనువదించి, ఈ అమ్మాయి ఈ పని కూడా బాగా చేస్తుందే అనిపించుకుని.... .... ఆ తరువాత చాన్నాళ్లు ఎక్కువగా కనిపించకపోయినా, కలం సన్యాసం చెయ్యలేదని... ఈలోగా, తన వాక్కు పదును దేరిందని, తన బాధ కవిత్వమయిందని ఇటీవలి పలు పద్యాలతో మనలో చాల మందిని ఒప్పించి, ఇప్పుడు ఎంచక్కా ఇస్మాయిల్ అవార్డు గ్రహీతల వరుసలో చేరిపోయిన కె. మమత ఇదిగో ఈ అమ్మాయే....…
పూర్తిగా »

భూమధ్యరేఖ

భూమధ్యరేఖ

కాశిగాడిగురించి మాట్లాడమంటే చాలా మాట్లాడొచ్చు.. అందరిలో కలిసిపోతాడు. అన్నం మెతుక్కి అతుక్కుపోతాడు. ఎవన్నీ వదలకుండా love you లతో హింసపెడతాడు. ఎటువంటి మనుషుల్తో అయినా అల్లుకుపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సర్దుకుపోవడం తెల్సినవాడిగా కనిపిస్తాడు. "చేపలకి ఎవడైనా వలవేస్తాడు, సముద్రానికే వలవెయ్యాలి" అన్నట్లు ఉంటుంది వాడి వ్యవహారం. అదే అదే. వాడి ఫ్రెండ్ లిస్ట్ సంగతి చెప్తున్న. తనని ఎవరు ఏమనుకుంటున్నారనే స్పృహలేకుండా ఎంతమందినైనా ప్రేమించగలవాడు, ఎవరు అన్నం పెట్టినా మర్చిపోకుండా కన్నీళ్ళతో అమ్మని తల్చుకునేవాడు, అదేంపెద్ద విషయం కాదన్నట్టు ఎంతదూరమైనాపోయి మనుషుల్ని కలిసొచ్చే ఓపిక ఉన్నవాడు కాశిలో ఉంటాడు. ఎంతకి అంత ఎటకారంగా సమాధానం చెప్పేవాడూ వాడిలోనే ఉంటాడు.
పూర్తిగా »

తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువ. – సోమ శంకర్

తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువ. – సోమ శంకర్

అనువాదం చేయడమంటే చేతిలో కర్రకు బదులు మూల కథను ఒకచేతిలో అనువాద కథను మరో చేతిలో పట్టుకుని తీగమీద నడవడం. విభిన్న శైలులతో ఉండే కధలను ఆయా మూలకథల ఆత్మ ఏమాత్రం ధ్వంసం కాకుండా తెలుగు భాషలోకి అనువదించటం నిజంగా కత్తిమీద నడవడం లాంటిదే! అలాంటి అనువాదాలు ఒక్కటి కాదు రెండు కాదు.. పూర్తిగా నూరు కథలను తెలుగులోకి అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ వాకిలి ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ:

1. సోమ శంకర్ గారు, ముందుగా మీకు వంద కథల అనువాదం పూర్తయిన సందర్భంగా అభినందనలు!

థాంక్యూ. నమస్కారం. ముందుగా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నా వందో అనువాద కథను…
పూర్తిగా »

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితల అనుభవాలను ఒక కూర్పుగా చేసి ఆటా సావనీర్లో వేద్దామనే ఉద్దేశంతో రచయితలకు ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకు ఆయా రచయితలు చెప్పిన సమాధానాలు, వారి అనుభవాలు ఇక్కడ మీకోసం (ఆటా వారి అనుమతితో):
ప్రశ్నలు:

1. డయాస్పోరా రచయితగా మీరు చేసిన రచనలు, మీరు పడ్డ ఇబ్బందులు, మీ సాహిత్య ధోరణిలో/గమ్యంలో వచ్చిన మార్పుల గురించి చెప్పండి? ప్రవాసదేశంలో మీరు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని ఎంతవరకు సాహిత్యీకరించగలుగుతున్నారు?

2. అమెరికాలో మీరు భిన్న దేశాల సాహిత్యాలు చదువుతుంటారు కదా! అవి చదువుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఒక రచయితగా అంతర్జాతీయ పటం మీద మీరు ఎక్కడ ఉన్నారనుకుంటారు?


పూర్తిగా »

కవిత్వమనేది, కవికి పాఠకునికి మధ్య జరిగే ప్రత్యేకమైన సంభాషణ

కవిత్వమనేది, కవికి పాఠకునికి మధ్య జరిగే ప్రత్యేకమైన సంభాషణ

ఏ రాజకీయాలకూ తావీయకుండా అరణ్యంలో సాగిపోయే ఒక సెలయేరు తన చుట్టూ ఏర్పడి ఉన్న ప్రకృతితో పాటూ… ప్రతి రోజూ తన వద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే జంతు మరియు పక్షి జీవుల కు దాహం తీర్చడం మొదలు ఎంతో సన్నిహితంగా వాటి కదలికలు, సొగసులు, ఒక దానితో మరొకటి కలబోసుకునే కబుర్లు, పాడుకునే పాటలు, వాటి మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న పొరపొచ్చాలు/పోట్లాటలు, దినదినం కనిపించే వాటిలోని వైరుధ్యాలు మున్నగు అనేక సహజ సమాజ/సందర్భ/వస్తువుల సందర్శనాన్ని తనదైన ధోరణిలో మనతో పంచుకుంటే ఎలా ఉంటుందో రవిశంకర్ గారి కవిత్వం కూడా అలా ఉంటుంది. ఏ మాయా మర్మం తెలియని బాల్యంలో మనం చేసిన…
పూర్తిగా »

కవిగా ఉండటమే ఇష్టం – సిరాశ్రీ

నవంబర్ 2013


కవిగా ఉండటమే ఇష్టం – సిరాశ్రీ

కవిగా ‘శత కిరణాల’తో సాహితీ యాత్ర మొదలెట్టి, సినీ విమర్శకుడిగా నలుగురి నోళ్ళలో నాని, మంచి గీత రచయితగా అందరి గుర్తింపు పొంది…
రామ్ గోపాల్ వర్మ గారిని ఒక్కసారి కలిస్తే చాలు జీవితం ధన్యమైనట్టే అనుకునే ఫేజ్ నుంచి ఏకంగా వర్మ ప్రాణస్థానంలో ఆప్త మిత్రుని హోదా సంపాదించి,  ‘వోడ్కా విత్ వర్మ’ అనే పుస్తకంతో సంచలనం సృష్టించిన ప్రముఖ సినీ విమర్శకుడు, కవి, గీత రచయిత సిరాశ్రీ గారితో వాకిలి ముఖాముఖం:

 

1. సిరాశ్రీ గారు ముందుగా మీ పరిచయం- మీ నేపథ్యం- చదువు, బాల్యం, కుటుంభం వివరాలు, మీ కలం పేరు గురించి.. వగైరా…

- జననం రాజమండ్రి.…
పూర్తిగా »

ప్రత్యామ్నాయ కవిత్వం ద్వారానే అణచివేతను ఎదుర్కోగలం – జూపాక సుభద్ర.

సెప్టెంబర్ 2013


ప్రత్యామ్నాయ కవిత్వం ద్వారానే అణచివేతను ఎదుర్కోగలం – జూపాక సుభద్ర.

తెలంగాణ అస్తిత్వానికీ, దళిత అస్తిత్వానికీ నిలువెత్తు కవితా రూపం జూపాక సుభద్ర. ఈ రెండు అస్తిత్వాలకు తన స్త్రీ అస్తిత్వం కూడా తోడయ్యి ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక వినూతనమైన, విలక్షణమైన సొంత గొంతుకగా సుభద్ర మార్మోగుతున్నది. పైటను తగలెయ్యాలన్న ఆధునిక అర్బన్ స్త్రీవాదానికి ప్రత్యామ్నాయంగా దళిత శ్రామిక స్త్రీవాద దృక్పథాన్ని తెలంగాణ గొంతుతో వినిపించింది సుభద్ర . 1989-95 ల మధ్య వామపక్ష ఉద్యమాలలో చురుకుగా పనిచేసిన సుభద్ర తనదైన అస్తిత్వాలని కనుక్కున్నది. నిజానికి ఇవాళ్ళ తెలంగాణ, దళిత, స్త్రీవాద అస్తిత్వాలతో రాస్తున్న సుభద్ర లాంటి కవులు, రచయితల ఆవిర్భావం వెనుక 90 వ దశకం మలిభాగంలో మారోజు వీరన్న కృషి ఎంతో ఉన్నది.…
పూర్తిగా »