1.
కొన్నిసార్లు తడిని అనుభూతి చెందేలోపే
తాకిన నీటి తుంపర ఆవిరైపోతుంది
ఏమో పొడిబారిన హృది ఉంటేనే గానీ
తగిలిన తడి సాంద్రత తెలీదేమో..
కోల్పోయే స్థిమితం శక్తి ఉంటే కదా..
పొందగల తెగువ ప్రదర్శించటానికి ..
ఐనా పొందటానికేమి కొత్తగా లేదనుకున్నప్పుడు..
మరి కోల్పోవడానికేముంది కొత్తగా..
అనుకోవడమే ! అంతా అనుకోవడమేనా?
అనుకోవడంలోనే ఉందంతా!?
పొందడము
కోల్పోవడము
క్షణిక అనుభూతేనా!?
మరెందుకిదంతా??
2.
నువ్వోస్తావా అసలు
నా నువ్వు ఉన్నావా అసలు
నమ్మకం లేక కాదులే
నమ్మేంత అనుభవం లేకనే ఈ తిప్పలు
వస్తే…
వస్తు వస్తూ…
నాకు నేను కనిపించని
కాసిన్ని క్షణాలు తీసుకురా..
నువ్వు నేనుల నుండి
బయట పడేసే
బంగారు క్షణాన్ని మోసుకు రా..
అన్నీ ఆశలే కదూ
నువ్వెలా ఉండాలో
చెప్పే ఆంక్షలే కదూ
సరే మరి
నువ్వు రామాకు !
3.
నువ్వు వద్దు..
నీ తలపు వద్దు
తక్షణం ఆక్రమించిన స్థలిని
భేషరతుగా ఖాళీ చేసిపో
అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..
అవును..
వీడ్కోలు చెప్పాలంటే
నువ్వుండాలి గా
రావాలని ఆశిస్తున్నానంటే
నువ్వక్కడ లేనట్టేగా
ఆత్మసఖుడా !
మరి ఇంతకీ
నువ్వున్నట్టా??
లేనట్టా??
అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో…….baagunnaayi ee lines kavita oka maanasika dasa ki pratibimbam kanuka sahajangaa undi baagundi poornee …love j
అభినందనలు
//వీడ్కోలు చెప్పాలంటే
నువ్వుండాలి గా
రావాలని ఆశిస్తున్నానంటే
నువ్వక్కడ లేనట్టేగా//
fantastic lines awesome !
“అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..”
అంతగా అడిగితే ఉన్నట్టే…ఖచ్చితంగా…
“అనుకోవడమే ! అంతా అనుకోవడమేనా?
అనుకోవడంలోనే ఉందంతా!?
“అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..”
పూర్ణిమ గారూ: పైని రెండే కాదు, ఈ కవితలో ప్రతి పంక్తీ నాకూ నచ్చింది. నాదే అన్నంత తీవ్రమయిన వొత్తిడితో చదివాను. వొక సాహిర్ లూధియాన్వీ పాటని లతా మంగేష్కర్ పాడుతున్నంత హృద్యంగా వుంది ఈ కవిత. మనసులోపల వొక ప్రపంచం వుందనుకుంటే ఆ ప్రపంచం మనదే అవుతూ, మళ్ళీ పరాయిదవుతూ పడే తపన…ఆ రెండీటీ మధ్యా లిపి నేర్చుకుంటున్న వేదన…నా దృష్టిలో ఇది వొక ఆత్మీయమయిన కవిత.
చాలా బాగుంది పూర్ణిమ. keep writing
adbutangaa undi