1.
కొన్నిసార్లు తడిని అనుభూతి చెందేలోపే
తాకిన నీటి తుంపర ఆవిరైపోతుంది
ఏమో పొడిబారిన హృది ఉంటేనే గానీ
తగిలిన తడి సాంద్రత తెలీదేమో..
కోల్పోయే స్థిమితం శక్తి ఉంటే కదా..
పొందగల తెగువ ప్రదర్శించటానికి ..
ఐనా పొందటానికేమి కొత్తగా లేదనుకున్నప్పుడు..
మరి కోల్పోవడానికేముంది కొత్తగా..
అనుకోవడమే ! అంతా అనుకోవడమేనా?
అనుకోవడంలోనే ఉందంతా!?
పొందడము
కోల్పోవడము
క్షణిక అనుభూతేనా!?
మరెందుకిదంతా??
2.
నువ్వోస్తావా అసలు
నా నువ్వు ఉన్నావా అసలు
నమ్మకం లేక కాదులే
నమ్మేంత అనుభవం లేకనే ఈ తిప్పలు
వస్తే…
వస్తు వస్తూ…
నాకు నేను కనిపించని
కాసిన్ని క్షణాలు తీసుకురా..
నువ్వు నేనుల నుండి
బయట పడేసే
బంగారు క్షణాన్ని మోసుకు రా..
అన్నీ ఆశలే కదూ
నువ్వెలా ఉండాలో
చెప్పే ఆంక్షలే కదూ
సరే మరి
నువ్వు రామాకు !
3.
నువ్వు వద్దు..
నీ తలపు వద్దు
తక్షణం ఆక్రమించిన స్థలిని
భేషరతుగా ఖాళీ చేసిపో
అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..
అవును..
వీడ్కోలు చెప్పాలంటే
నువ్వుండాలి గా
రావాలని ఆశిస్తున్నానంటే
నువ్వక్కడ లేనట్టేగా
ఆత్మసఖుడా !
మరి ఇంతకీ
నువ్వున్నట్టా??
లేనట్టా??
-పూర్ణిమా సిరి
(శ్యామల కల్లూరి)
Soul-mate
At times by the time you experience
The moisture the shower that touches you evaporates
Who knows, unless you know a dry heart
You cannot understand the depth of that moisture
Unless you have a heart and a balanced mind to lose
You cannot take the risk to gain
If you think there is nothing more to gain
What is there to lose afresh?
Think about it, feel it?
It is all in the way you think and feel
If both losing
And gaining are
Transitory experiences,
What is all this about?
Will you come at all
Are you, my you, there at all?
Not that I don’t believe
Only I don’t have enough experience to believe?
If you are coming
Bring with you
All those moments when I cannot
See myself!
Bring that one golden moment
Which can bring us out of the trap-
The gap between ‘you’ and ‘me’!
All these are hopes, no?
And demands,right?
They dictate
How you should be!
Okay then,
Don’t come!
I don’t want either you
Or the thought of you!
Just leave immediately, unconditionally,
The space that you have occupied.
Bid me farewell
In the wonderful state
Where neither request nor anger
Has any place!
But… you should be there
To bid farewell
If I hope for your presence
Does it not speak of your absence?
My soul-mate
Tell me
Do you exist at all or not?
- Poornima Siri
*
Translated by: Shyamala Kallury
Chaala bagunnayi
ఉన్నవాడిని ఉన్నట్టా లేనట్టా అనడం సందేహంతో కాదు. సహవాసంలోని రీ అష్యూరెన్స్ కోసం. అంతే.
Congratulations Poornima Siri and Shyamala Kallury
Really Excellent…
వస్తే…
వస్తు వస్తూ…
నాకు నేను కనిపించని
కాసిన్ని క్షణాలు తీసుకురా..
I like this lines పూర్ణిమా సిరి gaaru
To be are not to be లాంటి నేపథ్యం., వ్యక్తీకరించిన పద్దతి కూడా అలాగే అనిపించింది.
ఉదహరించడానికి కొన్ని మంచి వాక్యాలు ఉదా:
ఐనా పొందటానికేమి కొత్తగా లేదనుకున్నప్పుడు..
మరి కోల్పోవడానికేముంది కొత్తగా..
అడగటాలు,అలగటాలు లేని
అద్భుతస్థితి లో వీడ్కోలు చెప్పి వెళ్ళిపో..
వస్తు వస్తూ…
నాకు నేను కనిపించని
కాసిన్ని క్షణాలు తీసుకురా..
ఇలాంటి అనుభూతుల్ని వ్యక్తీకరించినపుడు, మంచి పరిణితి కనిపించింది.
అబ్సరిడిటి, సర్రయలిజం ధోరణి లో చెప్పడానికి ప్రయత్నించారు.
ఐతే, కొన్ని చోట్ల తేలికైన వాక్యాలు ( ఈ కవిత కు ) ఉదా:
పొందడము
కోల్పోవడము
క్షణిక అనుభూతేనా!?
మరెందుకిదంతా??
తక్షణం ఆక్రమించిన స్థలిని
భేషరతుగా ఖాళీ చేసిపో
నువ్వు నేనుల నుండి
బయట పడేసే
బంగారు క్షణాన్ని మోసుకు రా.. ఇలాంటివి-
రచన వేగాన్ని మందగించేలా చేసాయి.
తొలి అడుగులు ఎప్పుడూ కాస్త తడబడుతూనే వుంటాయి. ఇలాంటి ప్రయత్నాలు మిమ్మల్ని సరైన గమ్యం వైపుకే నడిపిస్తాయి. all the best పూర్ణిమ గారు.
నువ్వు వద్దు..
నీ తలపు వద్దు
తక్షణం ఆక్రమించిన స్థలిని
భేషరతుగా ఖాళీ చేసిపో….baagundhi
నైస్ –
రావని తెలిసి కూడా ఎదురు చూసీ నా
మనసు కి ఊరడింపు ఎవరు ఇస్తారు – మన ఇద్దరి మద్య వున్నా అందమైన ఘాడియాల ?? లేక నాలో చిగురింప చేసిన నీ ప్రేమ మీద నమ్మకమా ??