ఎదురింటి గోడకు ఎగబాకిన మనీప్లాంట్
పలకరిస్తుంది ప్రతీ ఉదయం
అది చిగురు వేసినప్పుడల్లా
నాలో ఒక పరవశం!
రోజూ ఆవేళకు వచ్చి
కబుర్లాడే గువ్వపిట్ట
ఏనాడైనా వేళ తప్పితే
ఏమైపోయిందోనని
ఒక కలవరం!
మా ఖానిగీరు బడి నానుకొని పూచే
బొండు మల్లె చెట్టు ఇప్పుడెక్కడన్నా కనపడితే
బాల్యనేస్తాన్ని చూసిన
ఓ ఆనందం !
ఒట్టి కాళ్ళతో నేల మట్టి అంటగా
తడిపొడి నేలపై తిరుగాడుతుంటే
ఇంకా వెంటాడుతుంది చిన్నప్పుడు
చేతికంటిన ఆ మట్టిబొమ్మల సహజ పరిమళం !
నేస్తాల్లారా! మీ అనురాగం నిరుపమానం
మీ స్నేహం అపురూపం!
కానీ ఒకటి చెప్పనా !
మీరు సాటి మనుషులు కానందుకు
జీవితానికి ఒక తెలీని సౌకర్యం
మిమ్మల్ని చూసి హాయిగా నవ్వే
పెదవికి ప్రశ్నలెదరవవు
మీరు నాకేమవుతారని..??.
ప్రేమగా తాకే చేతుల
చేతలని చికాకుపెట్టవు
మీరు నాకెలా చనువని…??
ప్రతీ బంధానికి
పేరుండాల్సిన దౌర్భాగ్యం
నామకరణం లేని
బంధుత్వం లేని
అనుబంధాలంటే
సమాజానికి అభద్రతాభావమేమో
అందుకే చెప్పలేని భీతి లోకానికి
స్వచమైన అనుభూతిని
పేర్లతో పరిధులు గీస్తూ
ఈ లోకానలాగే బతకనీ…
స్నేహాల్లారా..
మనమిలాగే ఉందాం…
రేపోకనాడు నేను
నీటి చుక్కనై నేల రాలి
తీగన ఆకునవుతా
కొమ్మన పువ్వునవుతా
పిచ్చుకకు గింజనవుతా.
అభినందనలు పూర్ణిమ సిరి
పూర్ణిమ గారు,
బాగుంది కవిత ఎత్తుగడ, కానీ ఈ క్రింది వచనం తీసేస్తే కవితకు గాఢత పెరుగుతుంది
“నేస్తాల్లారా! మీ అనురాగం నిరుపమానం
మీ స్నేహం అపురూపం!
కానీ ఒకటి చెప్పనా !
మీరు సాటి మనుషులు కానందుకు
జీవితానికి ఒక తెలీని సౌకర్యం
మిమ్మల్ని చూసి హాయిగా నవ్వే
పెదవికి ప్రశ్నలెదరవవు
మీరు నాకేమవుతారని..??.
ప్రేమగా తాకే చేతుల
చేతలని చికాకుపెట్టవు
మీరు నాకెలా చనువని…??
ప్రతీ బంధానికి
పేరుండాల్సిన దౌర్భాగ్యం
నామకరణం లేని
బంధుత్వం లేని
అనుబంధాలంటే
సమాజానికి అభద్రతాభావమేమో
అందుకే చెప్పలేని భీతి లోకానికి
స్వచమైన అనుభూతిని
పేర్లతో పరిధులు గీస్తూ
ఈ లోకానలాగే బతకనీ…
స్నేహాల్లారా..
మనమిలాగే ఉందాం…”
గరికపాటి పవన్ కుమార్