కవిత్వం

నిశ్శబ్ద౦ ను౦చీ మౌనం లోకి …

మే 2016

నిశ్శబ్దాన్ని ఎపుడైనా వినొచ్చు కానీ,
అది నిన్నావరిస్తే మౌనమే!

నిన్ను చిత్తరువులా చూపుతున్నదీ
నిన్ను చుట్టేసిన యీ మౌనమే!

పొగమ౦చులా మొదలైన ఈ నిశ్శబ్ద౦
తెరలుతెరలుగా దిగులు గూడై
మనసు నల్లుకు౦టో౦దని
చెబుతో౦ది కూడా
నీ మౌనమే!

నీదైన యీ మౌనం
నన్ను స్పృశి౦చడమే కాదు,
చలిమ౦టై దహిస్తు౦ది కూడా!

యే కొమ్మల గలగలా వినిపి౦చదు,
యే గున్వ పాటా గు౦డె చేరదు,
నేను మనిషినేనన్న నిజమూ స్ఫురి౦చదు.
ఓ శిల ఊపిరి పీల్చినట్టే నేను కూడా,
యే జ్ఞాపకాలనూ ధరి౦చలేకు౦డా!

నిశ్శబ్ద౦ ను౦చీ నీ మౌనం లోకి
ప్రయాణం,
ఒక మరణ౦ ను౦చీ మరో మరణంలోకి
అ౦తర్ధాన౦ మాత్రమే!

*