కళ్ళల్లో యుద్ధ చిత్రాలు
ఒక్కో అవయవం తెగిపడుతోంది
దృశ్యీకరిస్తున్న కనుపాపలు
మౌనంగా రోదిస్తున్నాయి
కన్నీళ్ళను ఆనవాళ్ళగా పంపుతున్నాయి
ఎర్రటి రక్తాన్ని శ్రవిస్తూ
సడి చేయకుండా పడమటి కొండల్లోకి
గాయపడిన సూర్యుడు
జారుకుంటున్నాడు
రేపటి దారుణాలను భరించే శక్తితో రావలని
మరణించిన అస్తమానం కోసం
శ్రద్ధాంజలి ఘటించేందుకు
నిశ్శబ్ధంగా ఎదురుచూస్తున్న నిద్ర
రేపటి ఆశతో
స్వార్థపు మెదళ్ళ
కర్కశపాదాల కింద నిర్విరామంగా నలుగుతూ
చప్పుడు చేయకుండా భీతిల్లుతూ
మౌనంగా రోదిస్తూ సేద తీరుతున్న రాతిరి
కళ్ళూచెవులను బంధించింది
నాలోని నిశ్శబ్ధం లోకి తొంగి చూసే
ప్రతి చూపుతో
అంతుచిక్కని ఓ రహస్యం
మౌనంగా సంబాషిస్తూ
తన మౌనభాషను పంచుతోంది
అటుగా సాగే ప్రతి మృతదేహాన్నీ
జాలిగా చూస్తూ
ఓ కన్నీటి చుక్కను రాలుస్తోంది
నిశ్శబ్ధంగా దారి చివర నిలుచున్న వీధిలైటొకటి
ఓదారుస్తున్న నాలుగు రోడ్లకూడలి
excellent … fantastic,,
సురేష్ గారూ – ఈ వాక్యాలు లేకుండా పద్యం చూడండి!
స్వార్థపు మెదళ్ళ
కర్కశపాదాల కింద నిర్విరామంగా నలుగుతూ
చప్పుడు చేయకుండా భీతిల్లుతూ
మౌనంగా రోదిస్తూ సేద తీరుతున్న రాతిరి
కళ్ళూచెవులను బంధించింది
ఇట్లాంటి cliche లు పద్యాన్ని పలుచన చేస్తున్నాయేమో చూడండి.
చిన్న సందేహం… రెండవ పాదంలో… మరణించిన అస్తమానమా? అస్తమయమా?
సారీ, మూడవ పాదంలో..!!