కవిత్వ వాక్యానికీ వొక శరీరం వుంటుంది. సరయిన పదం దొరకనప్పుడు ఆ శరీరానికి నొప్పెడుతుంది. దాని మనసు చిన్నబోతుంది. ఆ శరీరానికంతకీ వొక వ్యక్తిత్వమేదో వుంటుంది. దాని బాధలోపలికి తొంగిచూసే కన్ను శ్రీకాంత్ కి సొంతం. ఆ శరీర భాష శ్రీకాంత్ కి అర్థమయినంతగా ఇంకెవరికయినా అర్థమయిందో లేదో అనుమానమే. అందుకే వొక్కో సారి శ్రీకాంత్ వొక enigma. అతని కవిత్వ వాక్యం వొక సుదీర్ఘమయిన pain. తను బాధపడుతూ రాసే ప్రతి పదం మనల్ని ఖాయంగా బాధపెడ్తుంది. తనలోని బాధలోకి మనం వలసపోయి, మన బాధని కాసేపు మరచిపోతాం. కవిత్వం చేయాల్సిన పనులు నిజంగా ఏమయినా వున్నాయో లేదో కానీ, వొక బాధని ముల్లు తీసినట్టుగా నిపుణంగా నిదానంగా తీయగలిగితే, ఆ బాధ తరవాతి స్థితిని చెప్పగలిగితే అది వొక గొప్ప కవిత. ఏ బాధనీ ఎవరూ నిదానించలేరు, నిజమే! కానీ, బాధతో కనీసం మాట్లాడగలిగే సహనం మనకి వుందా అని అడుగుతుంది శ్రీకాంత్ ప్రతి కవితా…
శ్రీకాంత్ తో సంభాషణ
1. శ్రీకాంత్, మీ కవిత్వం అది కేవలం వొక సాహిత్య ప్రక్రియగా కాకుండా, వొక మానసిక ప్రక్రియగా పనిచేస్తుందని అనిపిస్తుంది? అసలు కవిత్వం ఏమిటి మీకు?
అన్ని ఇంటర్వ్యూలు పాక్షికంగానైనా ఆటోబయోగ్రాఫికల్ కనుక, అన్ని ఆత్మకథలూ ఒక కథ స్థానంలో మరొకటిని చెబుతాయి కనుక, ప్రతి ఆత్మకథా ముందుగా ఒక రహస్య ఒడంబడికతో ‘నన్ను నమ్ము. నేను సత్యమే చెబుతున్నాను’ అని నివేదిస్తుంది కనుకా, రచయితకీ చదువరికీ ఆ ఒప్పందం లేనిదే ఆత్మకథ మన్నదు కనుకా, అది ఆత్మకధ కాదు కనుకా, ఇవన్నీ genreకు సంబంధించిన ప్రశ్నలూ, రాజకీయాలూ కనుకా, ఇక ఈ మధ్య కొందరి/అందరి మనోభావాలు, ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ గాయపడతాయో తెలియదు కనుకా, ముందుగా ఒక disclaimer:
Do not take me seriously. All that which follows could be the truth. A truth in fiction. Or it could be a fictional truth too. Don’t you know that all poets tell the truth, in truth, except the truth?
నా జీవితంలో లేదా ఇతరులు జీవితం అని దేనినైతే అంటారో, దానిలో/ దానితో నేను ఎన్నడూ సౌకర్యవంతంగా లేను. జీవితంతో కానీ, నాతో కానీ. కానీ అందులో పెద్ద వైవిధ్యభరితమైన విషయం కానీ, వింతైన విషయం కానీ ఏం ఉంది?. (మనలో చాలా మంది తమ జీవితాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. అశాంతితోనూ ఉన్నారు. (What’s the big issue about it?) Anyway, ఏమిటంటే, ఇతరులు take it for granted గా తీసుకునే కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కావు. అవి పెద్ద తాత్వికమైన విషయాలు కానక్కర లేదు. చాలా మామూలు విషయాలు. ఇతరులని తమ దైనందిన జీవితంలో అస్సలు ఇబ్బందికి గురి చేయని విషయాలు. వాటి అవసరం లేకుండా, వాటి గురించి ఆలోచించకుండా చాలా మంది తమ జీవితాన్ని నిక్షేపంగా వెళ్ళబోసే విషయాలు. ఉదాహరణకు ఎవరైనా నాతో/మీతో ‘జీవితంలో సంతోషంగా ఉండటమే అన్నిటి కన్నా ముఖ్యం’ అని అన్నారు అనుకోండి, నా సమస్య అంతా ముందుగా ఆ పదాలతో, వాటి నిర్వచానాలతో మొదలవుతుంది. జీవితం అంటే ఏమిటి? జీవితం అని ఒకరు అన్నప్పుడు తద్వారా వాళ్ళు దేనిని సూచిస్తున్నారు? సంతోషం అంటే ఏమిటి? ‘ఉండటం’ మంటే ఏమిటి? ‘అన్నీ’ అని మనం అటున్నప్పుడు, ఆ ‘అన్నీ’ లో అన్నీ ఉన్నాయా? ఈ పదాలు – జీవితం, ప్రేమ, లేదా సంతోషం లాంటివి – can they exist in themselves? Equivocally? Or they exist in relation to something else? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, భావనా సంబంధమైన కొన్ని పదాలు (conceptual terms) కాలక్రమేణా సంస్థలుగా మారతాయి. సంస్థలుగా మారి సంస్థలుగా వ్యవహరిస్తూ కొన్ని (ప్రత్యేక) ‘విలువలని’ పరిరక్షిస్తూ అటువంటి ‘విలువలని’ వ్యాపింపజేస్తాయి. ఈ చిన్న ఉపోద్గాతం ఎందుకంటే, రాయటం అనేది నాకు మొదటిసారిగా ఇటువంటి ప్రశ్నలతోనూ – యవ్వనపు- అమాయకత్వాన్ని కనుమరుగు చేసిన ఘటనలతోనూ ముడిపడి ఉంది కనుక. ఆ ఘటనలు అన్నీ కూడా, ఒక స్థాయిలో వ్యక్తులకు సంబంధించినవీనూ మరో స్థాయిలో రాజకీయాలకు సంబందించినవీనూ కనుక. ఆ ఘటనలన్నీ కూడా – స్వాభావికంగా, అంతర్గతంగా – ఇతరత్వానికీ జాతికీ ముడిపడి ఉన్న అంశాలు కనుక. Incidents that are connected to the questions of the Nation and the Other కనుక.
నేను ‘రాత’ వద్దకి ఒక దేహం ద్వారా వచ్చాను. నేను ‘రాత’ వద్దకు ఒక దేహం ద్వారా, ఒక ముస్లిం దేహం ద్వారా, ఒక ముస్లిం స్త్రీ దేహం ద్వారా దేహమేమిటో, దేశమేమిటో రెండిటికీ ఉన్న సంబంధమేమిటో అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకునేందుకూ దేహంతో, దేహం ద్వారా ‘రాత’ వద్దకు వచ్చాను.
అదే సమయంలో, అటువంటి దేహం, అటువంటి స్త్రీ దేహం, అటువంటి స్త్రీత్వపు దేహం – ఉన్మాద హిందుత్వ రాజకీయాలకూ, హింసలకూ, హత్యలకూ అత్యాచారాలకూ చీలికలై విలవిలలాడటం, వెడలిపోవడం నా పద్దెనిమిది ఏళ్ల వయస్సులో నేను చూసాను. జీవితంలో బాగమైనదీ, భాగమే జీవతమైనదీ ఎలా కనుమరుగు కాగలదో, కనుమరుగయ్యీ ఇంకా ఎలా నిరంతరం మిగిలిపోగలదో, అనేదానికి నేను అప్పట్లో ఒక నిస్సహాయ సాక్షిని.
నా శరీరం పట్ల నాకు స్పృహ కలిగిన వయస్సు అది. శరీర రాజకీయాల పట్లా జీవిత రాజకీయాల పట్ల (bio and body politics) కూడా తొలిసారిగా కొంత అవగాహన కలిగిన వయస్సు అది. దేశం అనేది ఒక దేహమనీ, చరిత్రలూ సంస్కృతీ, రాజకీయాలూ శరీరాలపై లిఖించబడతాయనీ, శరీరాల ద్వారా ధ్వంసం చేయబడతాయనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవంలోకి వచ్చిన కాలమది. దేశంలో ‘ఇతరుని’ తుడిపివేయడం అనే ఒక process మొదలయ్యి బాబ్రీ మజీద్ విధ్వంసం దాకా వచ్చిన సమయమది. A continual process of erasing all that which belongs to the Other. ఈ క్రమంలో, చాలా వాటికి నేను సాక్షినే కాక, ‘ఇతరులు’ అయిన కారణానికి నేను చాలా మందిని కోల్పోయిన లోకమది. నన్ను నేను కనుగొంటున్న కాలమూ అదే. I have lost or more precisely I have been robbed of a lot of people for reasons that are political as well as ‘religious’. So many of them… ముస్లిం అయినందుకు, అకారణంగా దాదాపు తగలబడిపోయినంత పనైన రవూఫ్ నూ, దగ్ధమైపోయిన అతని న్యూస్ పేపర్ల షాపునూ, ఇర్ఫాన్ నూ, ముస్లిం అయిన కారణాన తనతో ఎవరూ మాట్లాడరని, ఈ ప్రదేశంలో ఒక కాందిశీకుడను అయ్యానని దుగ్ధతో విలపించిన నూరల్ హసన్ నూ, అజ్మత్ నూ, జువేరియా నూ, నాహీద్ నూ… ఇంకా చాలా చాలా మందిని కాలం లేని కాలాలలోకి కోల్పోయాను. వాళ్ళతో పాటూ నన్ను నేను కూడా పోగొట్టుకున్నాను. (Still I do not have a fixed identity, and still I do not know who I am).
ఇట్లా చాలామందిని పోగొట్టుకునే ప్రక్రియలో, మూస నిర్వచనాల నుంచి తప్పించుకుననే క్రమంలో, నన్ను నేను కనుక్కునే ప్రయతంలో, ‘రాత’/writing నాకు ఒక గూడు అయ్యింది. శరనార్ధీ అయ్యింది. Or rather, I became a refugee in writing. ఇట్లాంటి క్రమంలో నేను రాసుకోవడం మొదలు పెట్టాను కనుక, రెండు ప్రశ్నలు అప్పుడు నాకు చాలా ముఖ్యంగా మారాయి: ‘దేహం’ మరియు నామ్నీకరణం. The process of naming (read also as framing), and consolidating it through the ‘body’, texts and images. ఉనికికి సంబంధించిన ప్రశ్నలతో ఎంగేజ్ అయ్యి ఉన్న వాళ్లెవరికైనా, ఇటువంటి ఎంగేజ్మెంట్ ఖచ్చితమైన సాహిత్య ప్రక్రియగా కాకుండా, మానసికమైన tussle లాగా కూడా ఉంటుంది. అనివార్యంగానే అటువంటి రాత, (లిఖితం) ఒకరు తనతో తాను ఏర్పరుచుకునే సంభాషణ లేదా తన స్వగతం లాగానే, ఒక అంతర్గతమైన బాహిర్ మానసిక ప్రక్రియలాగానే ఉంటుంది అని నేను అనుకుంటాను. And hence I would like to say that my texts (I would like to call them texts, instead of poems/poetry) are my engagement with myself on the things that concern me through language and in language. ‘ఇక కవిత్వం (నాకు writing/లిఖితం) అంటే ఏమిటి మీకు’ అనే దానిని, కొద్దిగా మార్చి ‘ఎలా రాయాలి’ అని అనుకుంటో, Writing comes before me అని కూడా చెప్పుకుంటూ, ఇక ఇల్లా ఒక రచయిత్రి (Helene Cixous) భాషలో చెబుతాను:
“We should write as we dream; we should even try and write, we should all do it for ourselves, it’s very healthy, because it’s the only place where we never lie. At night we don’t lie. Now if we think that our whole lives are built on lying-they are strange buildings-we should try and write as our dreams teach us; shamelessly, fearlessly, and by facing what is inside very human being-sheer violence, disgust, terror, shit, invention, poetry. In our dreams we are criminals; we kill, and we kill with a lot of enjoyment. But we are also the happiest people on earth; we make love as we never make love in life.”
2. మీరు తొలినాళ్లలో రాసిన కవిత్వం నించి ఇప్పటిదాకా మీకు మీరు వొక గ్రాఫ్ లో చూసుకుంటే ఆరోహణలూ, అవరోహణలూ ఎలా అనిపిస్తున్నాయి?
నేను నా జీవితాన్ని, లేదా నా రాతలని (అవి రెండూ వేరే వేరే అయినట్టయితే) ఎన్నడూ ఆరోహణ, అవరోహణలతో చూసుకోలేదు. చూడను కూడా. For the simple reason that writing is not a career to me. And, I like to live this life – whatever it is – with intensity. (రెండు రోజుల ‘normal’ జీవన విధానం చాలు నాకు, నాకు నేనే విసిగెత్తి పోయి నన్ను నేను ముక్కలు చేసుకునేందుకు. Perhaps, a kind of masochism. Perhaps, all writing is a form of masochism.) నా వరకూ నాకు ముఖ్యమైనది ఏమిటంటే, ఈ జీవించడాన్ని పూర్తి సాంద్రతతో అనుభూతి చెందటం, తిరిగి అంతే సాంద్రతతో రాయాలనిపించితే రాసుకోవడం. There is nothing special about it. The only thing is that ఈ ‘జీవించడం’ అనేది ఏదైతే ఉందో అది – the understanding of this ‘living’ itself- takes a form of writing for me. Writing life, being written by life, and being written by writing itself అన్నమాట.
నేను రాయడం మొదలు పెట్టిన కొత్తలో (1992), ఉన్మాది లాగా రాసుకునే వాడిని. (Perhaps we all go mad in writing – at least- at some point of time in our lives). నా మొదటి పుస్తకం 2000లోనూ, రెండోవ పుస్తకం 2002లోనూ వచ్చాయి. ఆ తరువాత దాదాపు ఎనిమిది ఏళ్ళు నేను ఏమీ రాసుకోలేదు. (2002-2010). అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొన్నిసార్లు విసుగు పుడుతుంది – we are bored to death and are fed up with ourselves and our writings. ఇక ఒక రచయిత/కవి నిరంతరం రాస్తూనే ఉండాలి అనే వాఖ్యను నేను అస్సలు నమ్మని వాడను కనుకా, అలా అనుకోవడం నిన్ను ఒక ప్రెజర్ లోకి నెట్టివేస్తుందనీ ఆ ప్రెజర్ ఆ కంపల్సివ్నెస్ నీ రాతని చంపివేస్తుంది అని తెలుసిన వాడిని కనుకా, ఏమీ రాసుకోలేదు.
మరొకటి కూడా ఎందుకంటే నేను నా రక్తంతోనూ, ఎముకలతోనూ, మల మూత్రాలతోనూ, ఆకలితోనూ, ఆవేదనతోనూ, ఆర్తితోనూ, ఆత్మ పిగిలిపోయేటట్టు, దశ దశలోనూ నలుదిశలా చితాభాస్మమై నన్ను నేను వెదజల్లుకుంటూ రాసుకుంటాను కనుకా, పదిమందికీ నచ్చుతుందా లేదా, లేదా నేను రాసే దానిలో మెట్చ్యురిటీ ఉందా లేదా అని నేను తల పట్టుకోను కనుకా, నాకు తెలిసిందల్లా నాకు నచ్చినట్టుగా, నేను అనుభవించేదంతా, రక్త మాంసాలతో, కన్నీళ్ళతో, నవ్వులతో, గుండె డోక్కుపోయే పరిస్థితులతో, కాంతులతో చీకట్లతో పూలతో నక్షత్రాలతో, తనతో నిరంతరం మనలో ఉన్న ‘ఇతరుని’ గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ, అంతిమంగా ‘other’ is the self అని,భాష ముందూ, writing ముందు మోకరిల్లి చేసే ఒక మృత్యు జీవన ప్రార్ధనతో రాసుకోవడమే కనుకా, మళ్ళా ఇలా ఒకసారి చెప్పుకుంటాను.
Top of Form
Bottom of Form
Either you write with your blood, bones skin and teeth or do not write at all. I follow this: even now.
3. కవిగా, కవిత్వ పరమయిన ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ ఆలోచనల్ని ప్రభావితం చేసే విషయాలు ఏమిటి?
ముందుగా ఇది: నన్ను నేను కవిగా ఎప్పుడూ చూసుకోలేదు, అనుకోలేదు. చూసుకోను, అనుకోను కూడా: ఇప్పటికీనూ. కవి అంటే ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. Honestly, I don’t know what it means to be a poet: poetry, yes, but not a poet. కవి అని అనే పదమే నాకు చాలా వుల్గర్గా అనిపిస్తుంది. I don’t ascribe to it. కానీ, నేను ఆలోచిస్తాను. ఆలోచించడం ఇష్టం నాకు. ‘నా’ అని ఏదైతే ఉందో, ఆ భాగం ఆలోచిస్తుంది కానీ, ఒక ‘కవి’లాగా మాత్రం కాదు. I think. I like thinking but when I think, the ‘I’ of me thinks but not as a poet. మరొక ప్రాధమికమైన విషయం ఏమిటంటే, when one thinks, one is bound by many things: things that make up our thought process. నా ఆలోచనా విధానాన్ని ఒక deep suspicion ఎల్లప్పుడూ guide చేస్తూ ఉంటుంది. A deep suspicion of all that is given and is taken for granted. ఉదాహరణకు ‘కవిత్వం’ అనే పదమే తీసుకుందాం. ఒక కవిత ఎలా ఒక కవిత లేదా కవిత్వం అవుతుంది? What constitutes a poem? కవిత్వాన్ని ఎవరు నిర్వచిస్తారు/ నిర్వచిస్తున్నారు? అటువంటి నిర్వచనాలాలో, అటువంటి నిర్వచనాలను uphold చేసే సాహితీ విమర్శలలో ఉన్న రాజకీయాలు ఏమిటి? Who defines poetry? What are the standards of poetry? Who defines, guides and guards these standards and for what purpose? Whose interests are being served in safeguarding certain norms and values of genre? లాంటి ప్రశ్నలు.
నా మటుకు, ఇటువంటి ఆలోచనా విధానం నాకు అవసరం. ఎందుకంటే ఇటువంటి line of thinkingలో one clearly sees the connection between genres and literary criticism that upholds these genres (the purity of genres) for certain values- (Don’t we know that genre has gender too?) ఈ లంకెలు అన్నీ ఎందుకంటే, సాహితీ రూపాలు అనేవి నిస్పక్షపాతమైనవి కావనీ, సాహితీ ప్రక్రియల, సాహితీ విమర్శల యొక్క నీతి నియమాల వెనుక రాజకీయాలు ఉన్నాయనీ, అవి finalగా certain caste, class and community యొక్క interestని serve చేస్తాయనీ తెలుస్తుంది కనుకా, సాహితీ ప్రక్రియలకీ, సాహితీ విమర్సాకీ, సమాజానికీ, సమాజ సంబంధాలకీ, ఆ సంబంధాలకి ఆపాదించబడి కాపాడబడే విలువలకీ, ఒక విడదీయలేని సంబంధం ఉందనే ప్రాధమిక అవగాహన కలుగుతుంది కనుక.
4. మీరు ఇంగ్లీషు కవిత్వం బాగా చదువుకున్నారు. కొన్ని సార్లు మీ వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాస్తారని అనిపిస్తుంది. భాష విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
Ah… ఇది అనువాదానికి సంబంధించిన ప్రశ్న. కదూ? అనువాదం అనేది విస్త్రుతార్ధంలో వాడుతున్నాను. ఎవరో అన్నట్టు, I am one language. I am more than one language. I doubt if anyone thinks in ONE language as such. ఈ పరమిత spaceలో ఈ ప్రశ్నలను theoreticalగా elaborate చేయడం కష్టం కనుక, సరళంగా ఇలా చెబుతాను. ఇలా కూడా అడుగుతాను.
What do you mean by this word ‘English’? ఒకవేళ అది పూర్వార్ధంలో, నేరుగా ఆంగ్లంలో రాయబడ్డది, (read as Britain, too) అనే అర్థంలో వాడబడ్డట్టు అయితే, దానికి జవాబు నేను ఆంగ్ల కవిత్వం కానీ, ఆంగ్ల రచనలు కానీ చదవను, ఆంగ్లంలో ఆలోచించాను. కానీ “English” అనేది దాని విస్త్రుతార్ధంలో, అంటే writings that are translated into English, అని మీరు అన్నట్టు అయితే, Yes, నేను ఆంగ్ల రచనలు బాగా చదువుతాను. I read a lot of “World Poetry” translated into English. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నేను కవిత్వం చదివేది చాలా చాలా తక్కువ. వచనం ఎక్కువ. నేను కవిత్వాన్ని సీరియస్గా చదవడం చాలా కాలం క్రితం మానివేశాను. I stopped reading poetry seriously a long time back. గత ఎనిమిది ఏళ్లుగా నేను తరచుగా చదివేది, చదువుతున్నదీ కూడా వచనమే: ఆ వచనం ఏ రూపంలో ఉన్నదైనా కానీ. ‘ఆంగ్ల’ వచనాలు కాదు, అనువాదంలో ‘ప్రపంచ’ వచనాలు. ఇక ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం అంటారా… అది శైలికి సంబంధించిన విషయం అని అనుకుంటాను. సోకాల్డ్ కవిత్వం అయితే నేను ‘ఆంగ్లం’లో ఆలోచించి తెలుగులో రాయడం ఉండదు. If it is about presenting a critical thought in Telugu, I do that. ఎందుకంటే, తెలుగులో తాత్వికపరమైన కొన్ని విషయాలు మాట్లాడటానికీ, theoretical విషయాలు చర్చించదానికీ అవసరమయిన భాష నాకు అలవడలేదు కనుకా, ఇంకా అటువంటి భాష తెలుగులో విస్తృతంగా వాడుకలో లేదు కనుకా. ఇక భాషపై నాకు చాలా నచ్చిన వాక్యం ఇది. భాష విషయంలో ఇలా ఫీల్ అవుతాను: …”Language is for the other, coming from the other, the coming of the other” అని.
5. శివారెడ్డిగారిని వొక తండ్రిగా కాకుండా వొక కవిగా మీ వ్యక్తిత్వంలో ఎంత వరకూ చూస్తారు?
తత్వశాస్త్రం నుంచి సాహిత్యం దాకా, ఇంకా మనకి ‘పితరుడే’ కదా! It is the ‘father’ that always dominates us? Isn’t it? మన ఆలోచనల్లోనూ, మన వీక్షణాలలోనూ, మన ప్రాతిపదికలలోనూ, మన రాతలలోనూ, మన శైలులలోనూ, మన అర్థాలలోనూ, మన నిర్మాణాలలోనూ, ఇంకా మనకి ‘పితరుడే’ కదా? What happens to the mother, the Other who is always with us? The M/other? Hmmm… So you want to listen to the story of my Oedipus Complex? సరే. కానీ,- ముందుగా- తండ్రీ కవీ రెండూ అయిన ఒక వ్యక్తిని విడివిడిగాచూడటం ఎలా? What comes before? And what comes after? తండ్రా? కవా? కవా? తండ్రా? తండ్రి అంటే ఏమిటి? కవి అంటే ఏమిటి? అన్నిటికంటే ముందు, వ్యక్తిత్వం అంటే ఏమిటి? ‘నా’ వ్యక్తిత్వం అంటే ఏమిటి? కొద్దిగా కష్టం. ఇది Bios(జీవితానికి)కీ, biography (life writing or writing life)కీ, biologyకీ (read as bio+logos) సంబంధించిన విషయం కాబట్టి. ఎలా జవాబు చెప్పను? జవాబు చెప్పడానికి ఎలా ప్రయత్నించను? ఎవరైనా ఎలా జవాబు చెబుతారు? ఇటువంటి సంక్లిష్టతలలోకి వెళ్ళకుండా, at the risk of sounding naïve and simplistic, ప్రస్తుతానికి ఇలా చెబుతాను:
నా ‘తరం’పై ఉన్నట్టుగానే, అతని రచనల ప్రభావం, అతని ఆలోచనల ప్రభావం నా ప్రాధమిక రచనలపపై చాలా ఉండింది. దాని కన్నా కూడా, అతనేమిటో, అతని వ్యక్తిత్వం ఏమిటో ఆ ప్రభావం కూడా నాపై చాలా ఉంది. నేను ఇంకా కొద్దిగా మోసుకు తిరిగే మనుషుల పట్ల warmth, సహనం, కొంత ఇతరులని వినే గుణం, ఇవి నాకు అతని నుంచి వస్తే, possessiveగా లేకుండా మనుషుల పట్ల ఉండటం, ఓపికగా ఇతరులని అర్థం చేసుకోవడం, కొంత నింపాదిగా జీవితాన్ని చూడటం అనేవి తల్లి నుంచి అబ్బాయి. It sounds romantic కానీ మీకు ఇది కూడా చెప్పాలి: I have been a difficult son to bear with. Very very difficult. I had been a maniac depressive; I had been a drunkard – ఉదయం ఇల్లు వదిలి వెడితే, మళ్ళీ ఏ స్థితిలో నన్ను చూస్తానో తెలియని నా తల్లితండ్రులు వాళ్ళు. నేను ఇంటికి తిరిగి రావొచ్చు, రాకపోవచ్చు, ఎక్కడో పడిపోయి ఉంటే ఎవరో ఫోన్ చేయవచ్చు లేక ఒక పోలీస్ స్టేషన్లో లాండ్ అయ్యి ఉండవచ్చు. లేక ఏ అర్థరాత్రో ఏ ఆసుపత్రి నుంచో నా గురించి తెలుపుతూ సమాచారం రావొచ్చు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఎలా నన్ను నా తల్లి తండ్రులు భరించారా, భరించగలిగారా అని. వ్యక్తిత్వం లాంటి పదాల పట్ల నాకు నమ్మకం కానీ సదభిప్రాయం కానీ లేవు కానీ, ఆఖరుగా ఇలా చెబుతాను: Whatever I was, whatever I am, and whatever that is left of me- here, in this space and time- inscribed on this body, inscribed in this body, I owe it to him. I owe it to her. Perhaps I owe it to ‘We’.
(రెండో భాగం: వచ్చే శుక్రవారం)
hi. eagerly waiting for your ‘other’ second part. how truthful you are. relevant stupid questions.
WooooooooooooW. లిఖిత శ్రీకాంత్ గారిని ఇక్కడ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది.
ఎప్పుడో, బహుసా ఫిబ్రవరి 11 లో అనుకుంటా, ‘నూరుల్ హసన్ అనే వాడి కోసం’, అన్న కవిత శీర్షిక చూసి ఎందుకో ఆకర్షించబడి లిఖితతో పరిచయం చేసుకున్నాను. (అప్పటివరకు దాదాపు అదేలా పలికే వేరే బ్లాగ్ తో పొరపాటు పడి ఎప్పుడూ పట్టించుకోలేదు.) అంతే నూరుల్ హసన్ తో మొదలైన ప్రేమాయణం , ‘ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు’ అంటూ అక్కడే ఆగిపోయింది. ఆ పేజీ దాదాపు నా హోం పేజీ అన్నట్టుగా అయిపోయింది. ఎప్పుడు లిఖితని పలకరించినా అక్కడనుంచే. ఆయనకో చిన్న అజ్ఞాత ఫాన్ క్లబ్ కూడా ఏర్పడిపోయింది. ఆయన రాతలు చదవటం, ఆస్వాదించడం, నిట్టూర్చడం, కలవరపడటం ఓ నిత్యక్రుత్యమైపోయింది మాకు. ఆయన రాతల అలజడి తట్టుకోలేక, ఎవరో తెలుసుకోవాలని అసలు ఈ శ్రీకాంత్ గారెవరో, ఎవరికైనా తెలుసా అని గూగుల్ ప్లస్‌లో చాలా మందిని అడిగాను కూడా. ఒక్కోసారి అయితే అస్సలు తెలుసుకోకూడదు అని కూడా అనుకున్నాను, ఆ వూహించుకున్న చిత్రం వెలిసిపోతుందేమో అన్న భయంతో. కొన్నిసార్లు ఆయన కవితల్లోని ఘాడతని అందుకోలేక ఓ చిన్న నిట్టూర్పు. అసలు అలా పరకాయ ప్రవేశం చేసినట్టూ ఎలా రాసేస్తారా అని ఓ పెద్ద అనుమానం. అసలు సృశించని కోణం ఏదైనా ఉందా ఆయన రాతల్లో? ‘నల్లని పిర్రల వాడు’ నుంచి ‘ I like this night and Bacardi rum’ దాటి, ‘మహా మంత్రగత్తె’ ని పరిచయం చేసి, ‘క్షుద్రపదాలు’ ఏర్చి కూర్చి …..
రచనల్లోని సంఘటనలూ, అనుభూతులు మనసుకు ఇంకేలా రాయగలగటానికి అవి రచయిత స్వంతం అవ్వక్కర్లేదు అని ఎంత తెలిసినా కూడా, ఎంత మూర్ఖురాలిని కాకపోతే, కొన్ని రచనలు (కొన్నంటే కొన్నే కాదు, కొంచెం ఎక్కువే) చదివి, మీరు నిజంగా అనుభూతి చెంది రాసారా ఇవన్నీ, లేకపోతే ఇంతలా మమేకం చెంది రాయటం, ఆ భావాల తీవ్రత సాధ్యమా, నిజం చెప్పండి అని అడగాలని పిచ్చి కోరిక వచ్చేది. కానీ ఆయన రచనల్లోని వస్తు వైవిధ్యం , ఏ భావాన్నైనా అంతే అలవోకగా అంతే తాదాత్మ్యతతో వ్యక్తీకరించిన తీరు చూస్తే అదెంత సిల్లీ ఆలోచనో తెలిసొచ్చి నవ్వొచ్చేది.
ఈ సంవత్సర కాలంలో బహుశా ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు అన్న కవితని ఏ ఆరేడు వందల సార్లో చదివి ఉంటాను. చదివిన ప్రతీసారీ ఆఖరికి వచ్చేసరికి ఓ చిన్న అసంతృప్తి. కానీ అలా ఏ ఆరువందల ఇరవ్వయ్యేడో సారో చదువుతున్నప్పుడనుకుంటా, హటాత్తుగా ఆ ఆఖరి వాక్యాల్లో వేరే కోణం కనిపించింది నాకు. అప్పుడు దాన్ని పూర్తిగా నా ఆలోచనలతోనూ, అనుభవంతోనూ మమేకం అయ్యి, నాకు అన్వయం చేసుకోగలిగాను. అంతే ..ఉన్న అసంతృప్తి కాస్తా రెక్కలొచ్చి ఎగిరిపోయి,ఆ కవిత ఇంకా ప్రియమై కూర్చుంది. అదే విషయం చాలాసార్లు బ్లాగ్‌లో కామెంట్ రాయాలని అనుకుని కూడా ఆగిపోయాను.
ఇపుడు ఇక్కడ శ్రీకాంత్ గారి ఇంటర్యూ (అదే, ఆత్మకధ ) చదివాక, ఇష్టం ఇంకా పెరిగింది. అసలు అతని గురించి ఏమీ తెలుసుకోకూడదు …ఎప్పటిలాగే తిరిచిన పుస్తకం నిరాశ పరిచినట్టు అవుతుందేమో అన్న సంకోచం కాస్తా తీరిపోయింది. Glad to know about him from the otherside too. శివారెడ్డి గారి అబ్బాయన్న విషయం నాకు ఎక్స్ట్రా బోనస్.
“@@నేను నా రక్తంతోనూ, ఎముకలతోనూ, మల మూత్రాలతోనూ, ఆకలితోనూ, ఆవేదనతోనూ, ఆర్తితోనూ, ఆత్మ పిగిలిపోయేటట్టు, దశ దశలోనూ నలుదిశలా చితాభాస్మమై నన్ను నేను వెదజల్లుకుంటూ రాసుకుంటాను కనుకా”
“@@నాకు నచ్చినట్టుగా, నేను అనుభవించేదంతా, రక్త మాంసాలతో, కన్నీళ్ళతో, నవ్వులతో, గుండె డోక్కుపోయే పరిస్థితులతో, కాంతులతో చీకట్లతో పూలతో నక్షత్రాలతో, తనతో నిరంతరం మనలో ఉన్న ‘ఇతరుని’ గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ, ”
No need to spell it out. His writings represent all this commotion.
Thanks to one of my friend who alerted me about this article, otherwise I would’ve missed it.
Million thanks to vakili.
the best “oto”biography till 2day.. thanks to vakili..
ముందుగా ఇది: నన్ను నేను కవిగా ఎప్పుడూ చూసుకోలేదు, అనుకోలేదు. చూసుకోను, అనుకోను కూడా: ఇప్పటికీనూ. కవి అంటే ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. Honestly, I don’t know what it means to be a poet: poetry, yes, but not a poet. కవి అని అనే పదమే నాకు చాలా వుల్గర్గా అనిపిస్తుంది. I don’t ascribe to it. కానీ, నేను ఆలోచిస్తాను. ఆలోచించడం ఇష్టం నాకు. ‘నా’ అని ఏదైతే ఉందో, ఆ భాగం ఆలోచిస్తుంది కానీ, ఒక ‘కవి’లాగా మాత్రం కాదు. I think. I like thinking but when I think, the ‘I’ of me thinks but not as a poet. మరొక ప్రాధమికమైన విషయం ఏమిటంటే, when one thinks, one is bound by many things: things that make up our thought process. నా ఆలోచనా విధానాన్ని ఒక deep suspicion ఎల్లప్పుడూ guide చేస్తూ ఉంటుంది. A deep suspicion of all that is given and is taken for granted.
lothina aalochana chesthadee kavi
na ‘vana koila’pusthakavishkaranappu mee intlo chusanu…hai srikanth
eagerly waiting for the second part!
Hip..hip….hurrey..!!!! HAPPY TO SEE THIS..He is my all time fav..poet. I liked his works..they are…
1 st book: KONNI SAMAYALU[2000],
2 nd book: “ITHARA”….
It is my all time favourite…
WAITING for his 3ed book from many years..(almost 10 years)….I hope that his 3ed book will comeout in this year 2013..AS SOON AS POSSIBLE….
నాకు తెలిసిన శ్రీకాంత్ ను కాకుండా నేను వేరెవరినో చదువుతున్న, మౌనం వెనుక మహా ప్రపంచాన్ని చూపిస్తున్నాడు.Good
నడిరోడ్లో
నడుము మీద చేతులేసుకొని,
నగ్నంగా నిలబడి,
నా కళ్లలోకి సూటిగా,
నవ్వుతూ చూస్తూ ,
నడిరాత్రంతా,
నా అక్షరాలను
పీకి పీకి
పందిరేసిన దెయ్యం వాడు,
ఆ నల్లపిర్రలవాడు.
మట్టి వాసన వాడు,
పూలహారమై,
అమ్మ మెడలో
పరిమళించే వాడు,
వీది వీదంతా,
వర్షమై కురిసేవాడు,
ఇల్లంతా రొచ్చుచేసి,
రచ్చచేసే వాడు,
నా వాడు కాని వాడు,
ఆ కలువ కన్నుల వాడు,
వాడు, నల్లపిర్రల వాడు.
ఆ కమ్మని పదాల వాడు,
నిరంతర శోధకుడు వాడు,
వాడు అని ఏడ(ఎక్కడ) వాడాలన్న,
దాని పేటెంట్ నాదేనంటూ,
కోపంతో వణికేవాడు,
నన్ను గేలి చేసేవాడు,
ఓ చిన్ని భూతం వాడు,
కవిత ఇంట దీపం వాడు,
కవిత్వానికే వెన్నల వాడు,
ఆ నల్ల పిర్రలవాడు,
నా వాడు కాని వాడు.
శ్రీకాంత్ గారి నల్లపిర్రలవాడు,.చదివినప్పుడు రాసుకున్నదిది,.
,ఒకే భావాన్ని
అన్నిసార్లు,
సూటిగా, స్పష్టంగా
గురితప్పకుండా
లక్ష్యాన్ని చేధించినట్లు
గుండెల్లో గుచ్చాలా !
ఫరీదా,
ఇలా అడిగినందుకు క్షమించు,
వీలైతే నన్నూకొంచెం ప్రేమించు,
కుదరకపోతే,
కనీసం, ఫిరోజ్ తో స్నేహించు.(స్నేహం చేయించు.)
నీకై……ఫరీదా,
ఇంతకంటే ఎక్కువ
నాకిక నిషిధ్దం…….నీకై సిరీస్ లో కొన్ని కవితలు చదువుతున్నప్పుడు కలిగిన ఫీలింగ్ ఇది,.
ప్రస్తుత కవులలో ఒక డిఫెరెంట్ కవి శ్రీకాంత్ గారిని పరిచయం చేసినందుకు వాకిలికి, కృతజ్ఞతలు,..ఇంగ్లీష్ లో చెప్పిన సమాధానాల పక్కన తెలుగు అనువాదం ఇస్తే,.ఇంగ్లీష్ సరిగా అర్థం చేసుకోలేని నాలాంటి వారికి ఉపయోగంగా వుంటుందేమో,..
దేన్ని పూర్తిగా చెప్పకుండా,.పూర్తిగా చెప్పనట్లు అనిపించకుండా,.పూర్తయిందేమో మొత్తం అనేలా, పూర్తి సమాధానాలు చెప్పిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు,.వీలైతే వారి కవితల గురించి కూడా మాట్లాడించండి,..
ముందుగా వాకిలి టీమ్‌కి హృదయపుర్వక ధన్యవాదాలు, శ్రీకాంత్ గారిని మాకు పరిచయం చేసినందుకు!
పొద్దున్నే నా మొదటి కాఫీకప్ లిఖితతో స్నేహం కట్టి దాదాపు సంవత్సరమైందేమో! ఏదైనా ఒకరోజు ఆయన రాయడం మిస్ చేస్తే మాగొప్ప వెల్తిగా ఉంటుంది.. అంటే, ఆయన రాసినవన్నీ నచ్చేస్తాయని కాదు.. కానీ నచ్చినవన్నీ మాత్రం చదివిన ప్రతిసారీ కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేలా నచ్చేశాయి!!
‘I like this night and this Bacardi Rum.. Do you!?” — ‘yea, of course!’ అని స్వగతాన అనుకోకుండా పక్కకెళ్ళింది లేదు!
శ్రీకాంత్ గారి భాషలోనే చెప్పాలంటే, ఆయనొక “వొంటిగంట రాత్రి పూట వేసవి శీతల వెచ్చటిగాలిని నింపాదిగా గాట్లు పెట్టే సారంగి!”
Very glad to meet you here, Sir!
too much wonderful hard stuff to read
thanks to vakili
dear friend,
really it gives me immense pleasure to read ur poems. friend how do u get that much of time to think and express ur innovative ideas in a heart touchimg manner..hats of to u my dear..really i feel great to have a friend like u..
john
శ్రీకాంత్ గురించి కొత్తగా గొప్పగా తెలుసుకున్నాను.ఇంకా మాట్లాడించండి.
గొప్ప పుస్తకం చదివినట్టుంది
ఒక రచయిత/కవి నిరంతరం రాస్తూనే ఉండాలి అనే వాఖ్యను నేను అస్సలు నమ్మని వాడను..