Mango Bites

One Relation and Several Realizations.

డిసెంబర్ 2013

You have your logic and I have mine own argument
A strange situation of nobody being politically wrong.

The matter of interest is no longer
Who parted from the other first?
And to expect answers for every question
Is nothing short of madness.

We are inured to disappointments expecting high
We can’t help but live in whimsical imaginations.
Lugging the weights and counting the miles
We stay put still where we have been.

You travel your way, and I exile my own way.
Tragic moments of no one being wrong.

Now the issue remains
Who remained himself intact?
It’s of no consequence now whether
The lessons of life learnt shall rescue or no.

 

Original: Mohan Rishi
Translated By: Nauduri Murthy

 

ఒక రిలేషన్, అనేక రియలైజేషన్స్!

నీ లాజిక్ నీదే, నా ఆర్గ్యుమెంట్ నాదే
ఇద్దరమూ తప్పు కాని విచిత్ర సందర్భాలు

ఇక ఆ తర్వాత ఎవర్నుంచి ఎవరు
తప్పుకున్నారన్నది ఒక ప్రశ్న కాదు
అన్నింటికీ సమాధానాలు ఉండాలనుకోవడం
పిచ్చితనం తప్ప మరొకటి కాదు-

ఆశించి భంగపడ్డంలో ఆరితేరినవాళ్ళం
ఆలోచనల్లో తప్ప జీవించలేనోళ్ళం
దూరాల్ని కొలుచుకుంటూ, భారాల్ని మోసుకుంటూ
నిల్చున్న చోటునే నివాసం చేసుకునేవాళ్ళం

నీ ప్రయాణం నీదే, నా ప్రవాసం నాదే
ఇద్దరమూ తప్పు కాని విషాద సమయాలు-

ఇక ఆ తర్వాత ఎవర్నుంచి ఎవరు
కాపాడుకున్నారన్నది తేలాల్సిన విషయం
నేర్చుకున్న పాఠాలు జీవితకాలంలో
అక్కరకొస్తాయో లేదో ఇక్కడ అప్రస్తుతం!

-మోహన్ రుషి