అడుగు
అడుగు, పాముల్ని, అవి ఎలా కలుస్తాయో అని
పగల్ని, ఎలా వుదయించాలొ అని చెట్లని ,
మౌనం కి అర్థం ఏంటని నిద్రలో నడిచే వాలను,
కలల రంగు ఏమిటని వెలివేయబడిన వారిని అడుగు,
కన్నీరు వారి చెరసాల ఎలా అయ్యిందో అని
రాత్రి ఈ వురి వీదుల్లో నడిచే స్త్రీ లను
నీగ్రో లను అడుగు
భయం అంటే అర్థం చెప్పమని.
మేఘాలను అడుగు,
నిస్చాలమయిన పాల సముద్రం లో,
పున్నమి రాత్రులలో పాటలు పాడే చేపలన్నీ మాయమయ్యి
ఎక్కడికి వెలిపొయ్యయొ.
పోగొట్టుకు పోయిన వలసను అడుగు
భాష ఒంటరితనం లోంచి ఏమి పుడుతుందో.
నా జీవితపు మంచు శిఖరాల పై
ప్రాణం ఉన్న నిప్పురవ్వని వేసిన ఆమెని అడుగు
ఆ ఒంటరితనం లోని దుఖం గురించి
అడుగు ఆమెని, ఆమెని అడుగు
అడుగు నన్ను,
సాయంత్రపు చివరి రైలు ఎప్పుడు వెళ్ళిపోయిందో
ఆ రైలు పట్టాలు వనుకుతూ ఎలా తునిగిపోయ్యయో
అడుగు నన్ను,
ఒకే రెక్కతో, ఒకే పువ్వుతో వెచి వుండటం ఎలా ఉంటుందో.
_______________________
సూర్యాస్తమయం ( THE SUNSET)
సూర్యుడు అస్తమిస్తాడు
ఆ వ్యాపిస్తున్న పొలాల మీదుగా సూర్యుడు అస్తమిస్తాడు
అడవుల చాయలలోకి సూర్యుడు అస్తమిస్తాడు
ఇంకా కురవవలసిన ఒక క్రోదపు వానకు
అవతలిగా సూర్యుడు అస్తమిస్తాడు
ఒడ్డుపై ఇసుకలో చెల్లాచెదురుగా పడివున్న
వందల శావల పైగా అస్తమిస్తాడు సూర్యుడు ఒంటరిగా
తన కష్టాన్ని బాధని
ఎక్కడ పుడ్చాలో
తెలియక పంజరం లో ఒక చీకటి ములను వెతికి వేచిఉండే పక్షి
విరిగిన రెక్కల మీదుగా నా కన్నీటి లో సూర్యుడు అస్తమిస్తాడు.
పగలు అయ్యే సరికి తడబడుతున్న పదాలతో అంటారు, ఆ శవం ఇంకా దొరకలేదు అని
విధ్వంసం (APOCALYPSE)
మేమున్న సమయం లోనే అ విధ్వంసం జరిగింది.
పోగల తెరల వెనుక వణుకుతున్నభూమి
రాక్షస వర్షాలలో చీలుతున్న
శరీరాలు లోపల బయట నిప్పు అంటుకోవటం తో చీకటి కేకలు
వూలలెస్తున్న రాత్రుల
చివరి వరద పిల్లల్ని, ప్రజల్ని నరకపు మంటల్లో విసిరేసింది
మా చుట్టూ
మమ్మల్ను చూస్తున్న నిస్సహాయ స్థితి లో ఉన్న
వీక్షకుల వైపు ఓ జీవంలేని చూపు ని విసిరేస్తూ
పోగల పొగలగా మేఘలలా పైకి లేసాం మేము.
కాఫ్కా కి రాలేదు
తన రాతలకు నిప్పు ని తినిపించే అవకాసం కాని
శివరమని తన కవితలను కాల్చేసింది
ఒక నిషిద్ద సమయం లో ఒక కవిత అంతమొందింది,
మిగిలిన వారి రాతలు ప్రాణం పోసుకునేకి వెనుకంజ వేసాయి,
మేమందరం ఎక్కడికంటే అక్కడి నుండి వేల్లిపోయం
కథలు చెప్పటానికి ఎవరు మిగలలేదు.
ఇప్పుడు అక్కడ వున్నదంతా దెబ్బతిన్న నిశ్చలమైన నేల
ఇక ఏ పక్షి ఆ భూమి పైన ఎగరలేదు మేం తిరిగోచే వరకు
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్