‘ రోహిత్ ’ రచనలు

అనుపమ స్వప్నయానం

డిసెంబర్ 2017


అనుపమ స్వప్నయానం

సీసాలో ఓ ఉత్తరముంచి సముద్రంలోకి విసిరేయటం లాంటిది కవిత్వమంటే.

ఆ సీసా అలల పై తేలుతూ ఏ తీరం చేరుతుందో.చరిత్రలో ఎప్పుడూ ఎవరో ఒకరు కవిత్వం రాస్తూనే ఉంటారు. ఓ మారుమూల గ్రామంలో లాంతరు వెలుగులోనో, అనేక అంతస్తుల భవనంలో ఓ ఇరుకు గదిలోనో, ఏడు సముద్రాలకవతల అంతరించిపోయిన తెగ తాలుకు చివరి మనిషో – నిరంతరం ఎవరోఒకరి చేత కవిత్వం రాయబడుతూనే ఉంటుంది. కవి తనకు మాత్రమే సొంతమైన ఒక నిశ్శబ్ధంలో రాసే కవిత్వం చరిత్రగమనంలో ఓ కాలానికే ఉపమానం అవుతుంది. ఓ కాలంలోని మనుషులు రక్తమాంసాలతో అనుభవించిన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఓ కాలపు అస్థిత్వాన్ని నిర్వచిస్తుంది.

కవిత్వం (creative…
పూర్తిగా »

అతి చిన్న కారణానికి నేను మరణిస్తాను.

ఏప్రిల్ 2015


బహుశా అతి చిన్న కారణానికి
నేను మరణిస్తాను.
చిన్న కలువపూవు కోసమో
అంచున వూగుతున్న మంచుబిందువు కోసమో
వాన చుక్క కోసం ఏప్రిల్ గాలిలో ఊగుతున్న పూరేకు కోసమో
మరణిస్తాను.

బహుశా
పిట్ట పాట కోసమో
పసిపాప బుగ్గపై సొట్ట కోసమో
సూర్యరశ్మిలోని ముత్యం కోసం
ఎవరి కంటిలోనో మెరుస్తున్న
కన్నీటిచుక్క కోసమో
మరణిస్తాను.

అత్యంత చిన్న దానికి
నేను మరణిస్తానేమో
వెండి వెన్నెల కోసమో
మేఘపు ముక్క కోసమో
బహుశా
ఇరవై ఒకటవ అంతస్థులో
ఏదో పచ్చటి మరకను అన్వేశిస్తూపూర్తిగా »

చేరన్ రుద్రమూర్తి కవితలు

జనవరి 2013


అడుగు 
అడుగు, పాముల్ని,  అవి ఎలా కలుస్తాయో  అని

పగల్ని, ఎలా వుదయించాలొ  అని చెట్లని ,

మౌనం కి అర్థం ఏంటని నిద్రలో  నడిచే వాలను,

కలల రంగు ఏమిటని వెలివేయబడిన వారిని అడుగు,

కన్నీరు వారి చెరసాల ఎలా అయ్యిందో అని

 

రాత్రి ఈ వురి వీదుల్లో నడిచే స్త్రీ లను

నీగ్రో లను అడుగు

భయం అంటే అర్థం చెప్పమని.

 

మేఘాలను అడుగు,

నిస్చాలమయిన పాల  సముద్రం లో,

పున్నమి రాత్రులలో పాటలు పాడే చేపలన్నీ మాయమయ్యి

ఎక్కడికి వెలిపొయ్యయొ.

 

పోగొట్టుకు పోయిన వలసను అడుగు

భాష ఒంటరితనం లోంచి ఏమి పుడుతుందో.

 

నా…
పూర్తిగా »