అదినేనే
శుబ్రంగా ఊడ్చిన రోడ్లమీద
చీకట్లో మెరిసే మెరుపు
ఆ మెరుపును నేనే
చేతిలో విరిగిన ఆటబొమ్మతో
పులకించిపోయె పిల్లాడు
పిల్లవాని ముఖంలో పులకింత
ఆ పులకింతను నేనే
పొలంలో
మట్టినుండి మొలకెత్తే
ధాన్యపు సువాసన
నేనే
వారు ఎవరినైతే ధూషించి గెంటివేస్తారో
ఆఇంట్లో
మర్చిపోయి
ఆకలికి ఏడ్చే పిల్లలు
ఆ ఏడుపులో… ఆకలి
ఆ ఆకలి నేనే
వంచనకు గురై
బక్కచిక్కిన జనాల
గాయపడిన ముఖాలపై
గాయంలా అతుకున్న
సంతాపభరిత దినాలు
ఆ ముఖాల్లో
ఇంకా మిగిలిఉన్న ఆశ
అదినేనే
వృక్షాల్లో నదీజలాలు
ఎండా గాలుల్లో
శ్రామికుని రక్తపు వాసనలు
వరదలో కొట్టుకు పోయింది గుడిసెల ధుఃఖం
ఎండకు బీటలువారిన
నేలతల్లి గొడ్రాలితనం
అదినేనే
కేవలం
నేనుమాత్రమే.
హిందీ: ఓంప్రకాష్ వాల్మీకి
స్వేచ్చానువాదం: శ్రీనివాసు గద్దపాటి
ఓంప్రకాశ్ వాల్మీకి జూన్ 30 1950 వ సంవత్సరంలోఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు.ప్రముఖ దళిత కవిగా.. రచయితగా సుపరిచితులైన వాల్మీకి తన ఆత్మకథ “జూఠన్” లో దళిత జీవన విధానం, ఒక దళిత విద్యార్థిగా అయన పడిన కష్టాలు,, ఎదుర్కొన్న అవమానాలు.స్వాతంత్ర్యానంతరం కూడా దళితులు ఎదుర్కున్న సమస్యలు ఇందులో వివరించారు .. కవిగా “సదియోంకీసంతాప్”., “బస్ బహుత్ హో చుకా” ఘుస్ పేట్ “‘ మొదలైన కవితా సంకలనాలు.ఇంకా” దళిత సాహిత్య సౌందర్య శాస్త్రం.”సఫాయిదేవతా” మొదలైన రచనలు చేసారు. ముఖ్యంగా. వాల్మీకి కులచరిత్ర ద్వారా తనకుల చరిత్రను సమాజానికి పరిచయం చేసారు
బాగుందండి.
కవి జీవించేది స్వప్నలోకంలో కాదు, వాస్తవ జగత్తులొనేనని నిరూపిస్తున్నది జీవిత సత్యాలను ఆవిష్కరించే ఈ కవిత. దీనిలోని మానవతా స్పర్శ గుండె లోపల పొరల్ని తట్టి లేపుతుంది. స్వేచ్చానువాదమైనా జీవితానుభవాన్ని, అపురూపమైన అనుభూతిని అందిస్తోంది.