వారికి భయం
బంజరభూమి గుండెల్నిచీల్చి
ఆహారాన్ని పండించే నల్లని గరుకైన చేతులు
ఇప్పటివరకు వారికి ప్రవేశం నిషిద్దమైన చోట
అదేసామర్ద్యంతో కలుసుకుంటాయని
వారికి తెలుస్
ఇదొక యుద్ధం అని
వారికి తెలుసు ఓటమి తధ్యమని
అయినా ఒక అబద్ధపు ముసుగువేసుకొని
ఏంతాకాలం…?
వారు ఓడిపోవటం తధ్యం.
వాలియొక్క తీక్షణ బాణాలనుండి
ఆకాశం నుండి వర్షించే నిప్పులనుండి..
అయినా..
వారు తమ పాత బాణాల్ని పదునుపెట్టుకుంటున్నారు
చౌరాస్తాల్లో నిర్భయంగా తిరుగుతున్నారు
వారికి తెలుసు
రోడ్లమీద కవాతు చేసే ఖాకీలు
వారి రక్షణకోసమేనని
కల్లకి గంతలుకట్టుకున్న న్యాయదేవత
అవసరమొచ్చినప్పుడు
పురుష సూక్తం లోని పదవ మండలాన్ని
పునరుక్తం చేస్తుంది
అయినా వారికి భయమే
భవిష్యత్తు గర్భం నుండి అరుస్తూ…
బయటకువస్తుంది వేల సంవత్సరాల అసహ్యం
వారి పూర్వీకులు దాన్ని రచించారు ఒక భవిష్యనిధిలా..
అది వారిని ఎక్కడ ముంచేస్తుందో
ఎదో తేలియని చీకటి లోయల్లో
అక్కడినుండి బయటపడే అన్ని మార్గాలూ
సుగ్రీవుని వలెస్వయంగా వారే మూసేసుకు వచ్చారు
దారులు అడ్దగించి నిలబడి
పొలాల్లోని మట్టిపరిమళం నిండిన చేతులతో
ఉచ్చస్వరంతో వారికి వ్యతిరేకంగా అరుస్తూ ఉన్నారు
వారిని చుట్టుముట్టిన తెల్లకోట్లపై రక్తపు మరకలు
కెమెరాల తీక్షణమైన వెలుగులో స్వచ్ఛంగా కనిపిస్తున్నాయ్
రోగుల మూలుగులు లోపలే మ్రింగివేయబడ్డాయ్
తలుపుబయట రొడ్లమీద పుట్టిన శ్రేష్ఠ మైన శబ్దాలు
అన్ని సామర్ధ్యపు పొరల్ని తొలగిస్తున్నాయి.
హిందీ- ఓంప్రకాశ్ వాల్మీకి
స్వేచ్ఛానువాదం- శ్రీనివాసుగద్దపాటి
ఉత్తేజకరమైన పద్యం.. బాగుంది మీ అనువాదం శ్రీనివాసు గారు..