కవిత్వం

కులం

ఫిబ్రవరి-2014

ఎవరు మేల్కొన్నారు..?
ఎవరు నిద్రపోతున్నారు..?
ఏం మార్పు జరిగిందిక్కడ..!?
ఇప్పుడుకూడా…..
ఒకశిశువు
తల్లి గర్భాన్నుంచి
కులాన్నివెంటేసుకొని పుడుతుంది
బోధపడుతుందా….!?
ప్రపంచమే బోధపరుస్తుందిలే….!
ఈ కులం ఎట్లాంటిదంటే….?!
వయస్సుతోపాటు రెండు రెట్లుపెరుగుతుంది
ఇప్పుడుకూడా మనిషి
ఒకచెట్టునెక్కి
కూర్చున్నకొమ్మనే నరుక్కుంటున్నాడు
ఈ నీడలు ఎప్పటినుండో
వెంటాడుతూనే వున్నాయ్…
కులం
నరికేస్తె తెగిపోదు
కాల్చేస్తే కాలిపోదు
అదికూడా..
ఆత్మలలాగే అమరత్వం పొందింది

 

హిందీ: హరీష్ పర్మార్ (హరీష్ పర్మార్ ప్రముఖ గుజరాతీ దళితకవి)
స్వేచ్చానువాదం:శ్రీనివాసుగద్దపాటి